టెస్సీ థామస్ బయోగ్రఫీ చదివితే... అమె గురించి పెద్దగా ఏమీ తెలీదు. అయితే -
పిల్లల్ని ఎప్పుడూ బడికే కాకుండా... అప్పుడప్పుడు కొత్త ప్రదేశాలకూ పంపాలని తెలుస్తుంది.
సైన్సు - మేథ్స్ అంటే వారు భయపడుతుంటే కనుకఅంత సీన్ లేదు. అర్థమైతే పీచు పిఠాయే అని వెన్ను తట్టాలని తెలుస్తుంది. అప్పుడే పెళ్లి వద్దు నాన్నా ఎం.టెక్ చేస్తాను అంటే
అలాగే తల్లీ నీ ఇష్టం అనడమే కరెక్ట్ అని తెలుస్తుంది. ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి.
రోజూ ఉదయం నాలుగు గంటలకే నిద్రలేవాలని లేచిన క్షణం నుంచి లక్ష్యం కోసమే పాటుపడాలని
ప్రశంసల్ని , విమర్శల్ని సమానంగా తీసుకోవాలని పదిమందికి ఆదర్శంగా ఉండాలని... తెలుస్తుంది.
‘మిస్సైల్ ఉమెన్’ టెస్సీలోంచి మీలోకి ‘అగ్ని’కణాలు చొరబడి మీకొక కొత్తచూపును ఇస్తాయి!
ఊరికే - ‘కలలు కనండి... కనండి’ అని ముఖం మీది దుప్పటి లాగేసి బ్రెష్షూ పేస్టూ చేతికిస్తారు కానీ... కలలు కనడానికైనా ఒక ఇన్‌స్పిరేషన్ ఉండొద్దా?!
నాన్న ఏరోనాటికల్ ఇంజినీరు. ఒక ఇన్‌స్పిరేషన్.
అమ్మ ఐ.ఏ.ఎస్. ఆఫీసర్. ఒక ఇన్‌స్పిరేషన్.
మామయ్య లెఫ్టినెంట్ కల్నల్. ఒక ఇన్‌స్పిరేషన్.
పిన్ని పెద్ద ఫ్యాషన్ డిజైనర్. ఒక ఇన్‌స్పిరేషన్.
కానీ మనలో ఎంతమందికి ఇలాంటి ఇన్‌స్పిరేషన్... పాలపీక గుండా గొంతులోకి దిగి ఉంటుంది?
ఎ.ఆర్. రెహమాన్ ఒక ఇన్‌స్పిరేషన్.
పెప్సీ నూయీ ఒక ఇన్‌స్పిరేషన్.
సచిన్ టెండూల్కర్ ఒక ఇన్‌స్పిరేషన్.
మైక్రోసాఫ్ట్ నీలమ్ ఒక ఇన్‌స్పిరేషన్.
దేశంలో రోజూ లక్షలమంది వీళ్ల ఘనతల్ని వార్తల్లో చూస్తూ ఉంటారు కదా.. ధీమాగా ఎంత మంది ఇన్‌స్పైర్ అవగలరు? ధీమా ఎందుకంటే - ఇంట్లో సచిన్ ఫొటో ఉన్నంత మాత్రాన మన ఇంటి దగ్గర శివాజీ పార్క్ ఉండదు కదా! రెహమాన్‌ని తలచుకుని కీ బోర్డుపై వేళ్లు కదిలించినంత మాత్రాన మన ఇంటికి కాస్త దూరంగానైనా సినిమా ఇండస్ట్రీ ఉండదు కదా!
వాస్తవం ఏమిటంటే - వందకోట్లు దాటిన ఏ దేశంలోనైనా జనాభాకు సరిపడా ఇన్‌స్పిరేషన్ లభ్యం కావడం కష్టం.
మరి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి?
కేరళలోని అలప్పుళ వెళ్లాలి.
అక్కడ దొరుకుతుందా ఇన్‌స్పిరేషన్?
అక్కడి నుంచి ‘తుంబా’ వెళ్లే అవకాశం రావాలి.
అప్పుడు దొరుకుతుందా ఇన్‌స్పిరేషన్?
మే బీ, మే నాట్ బీ. ఒకటి మాత్రం నిజం. అమ్మానాన్నల్నుంచే, ఏఆర్ రెహ్మాన్‌లనుంచే మనం ఇన్‌స్పిరేషన్ పొందాలనేం లేదు!!
*********
భువనేశ్వర్ : జనవరి 3 మంగళవారం 2012
కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్శిటీ ప్రాంగణం.
భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ మాట్లాడుతున్నారు.
పదిహేనువేల మంది సైంటిస్టులు, ఇరవై మంది నోబెల్ గ్రహీతలు, ఐదొందల మంది విదేశీ ప్రతినిధులు, లక్షమంది యువకులు, యువతులు శ్రద్ధగా వింటున్నారు. తొంభై తొమ్మిదవ ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ మొదలైన రోజది!
సైన్స్ అండ్ టెక్నాలజీలో మనమింకా ఎంతో సాధించాలని అంటున్నారు మన్మోహన్. అంటూ అంటూ... మధ్యలో స్కూల్ పిల్లలు, కాలేజీ అమ్మాయిలు ఉన్న వైపు చూసి... మిస్సయిల్ ఉమన్ టెస్సీ థామస్‌ను మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలని అన్నారు.
సదస్సు ఒక్కసారిగా బర్త్‌డే బెలూన్‌లా పేలింది. హర్షధ్వానాలు చెమ్కీ ముక్కలై గాల్లో తేలాయి! నెలన్నర క్రితం - నవంబర్ 15న (ఆవేళ కూడా మంగళవారం!) ఒడిషా తీరంలోని వీలర్స్ ఐలండ్ నుంచి భారత ఉపరితల క్షిపణి ‘అగ్ని-4’ను డి.ఆర్.డి.ఓ. ప్రయోగించినప్పుడు మిన్నంటిన విజయధ్వానాలకివి రీసౌండ్‌లా అనిపించాయి! అగ్ని ఫోర్... మూడువేల ఐదు వందల కిలో మీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణి. ఆ క్షిపణిని వృద్ధి పరిచింది టెస్సీ, అమె బృందం.
టెస్సీ థామస్ వంటి కృతనిశ్చయం గల మహిళలు మన అమ్ముల పొదిలో ఉంటే భారత్ ఇలాంటి అగ్నులు ఎన్నింటినైనా అలవోకగా కురిపించగలదనే భావం కూడా మన్మోహన్ మాటల్లో ధ్వనించింది.
టెస్సీ... అగ్ని ప్రాజెక్టుకు డెరైక్టర్!
ఈ అగ్నిపుత్రికకు ఇన్‌స్పిరేషన్... తుంబా.
కేరళ రాజధాని తిరువనంతపురానికి శివార్లలో ఉన్న అరేబియా తీర ప్రాంత గ్రామం ‘తుంబా’కు, టెస్సీ చదువుకున్న తీరప్రాంత పట్టణం అలప్పుళకు మధ్య కొన్ని వందల కి.మీ. దూరం ఉన్నప్పటికీ, ఆ దూరాన్ని ఇప్పుడు మనం... పన్నెండేళ్ల వయసులో టెస్సీ ఏర్పరచుకున్న జీవిత ధ్యేయంతో మాత్రమే కొలవాలి! టెస్సీకి ఇన్‌స్పిరేషన్ మనుషుల నుంచి రాలేదు. తుంబాలో ఆనాడు తను చూసిన ప్రదేశం నుంచి వచ్చింది.
ఏం చూసింది ఆ అమ్మాయి?
*********
పిల్లలకు ఇష్టమైన సంగీతం... డబడబలు.
పిల్లలకు ఇష్టమైన ఎక్కం... టెన్ వన్స్ ఆర్..!
టెస్సీకి ఏ ఎక్కమైనా ఒకటే. పదమూడో ఎక్కాన్ని కూడా పదో ఎక్కంలా తేలిగ్గా చెబుతుంది. బ్రైట్ అండ్ బ్రిలియంట్. అయితే ఓరోజు ఎక్కం తప్పింది. థర్టీన్ ఫోర్స్ ఆర్... దగ్గరో, థర్టీన్ ఫైవ్స్ ఆర్... దగ్గరో తప్పింది. తప్పిన వెంటనే సర్దుకుంది. కరెక్ట్‌గా చెప్పింది. టెస్సీ ఎందుకు కన్ఫ్యూజ్ అయిందో టీచర్‌కు తెలీదు. కానీ టెస్సీకి తెలుసు. తనకు ఇష్టమైన సంగీతాన్ని వెదుక్కుంటూ ఆ అమ్మాయి మనసు అలప్పుళ నుంచి మధ్యలో రెండు జిల్లాలు దాటుకుని తిరువనంతపురం వెళ్లింది. కొన్ని క్షణాలు అక్కడి
‘తుంబా’లో ఆగింది!
క్రితం రోజే టెస్సీ, ఆమె క్లాస్‌మేట్స్ తుంబా లోని రాకెట్ లాంచింగ్ స్టేషన్‌కు విజ్ఞానయాత్రగా వెళ్లొచ్చారు. రయ్‌మని ఎగిసిన రాకెట్‌లను చూశారు. వాటి ధ్వని టెస్సీకి శ్రావ్యంగా అనిపించింది. అప్పటినుంచీ డబడబలకు ఎంటర్‌టైన్ అవడం మాని రాకెట్ సౌండ్‌ని మధ్యమధ్య గుర్తుచేసుకుని ఎంజాయ్ చేస్తోంది ఆ అమ్మాయి.
స్కూల్ ఫేర్‌వెల్‌లో ఎవరెవరు ఏమేం కావాలనుకుంటున్నారో చెబుతున్నారు.
డాక్టర్, ఇంజినీర్, ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్...
టెస్సీ వంతు వచ్చింది. రాకెట్ స్పెషలిస్ట్ అవుతానంది! అప్పుడు ఆమెకది మిస్సైల్ టెక్నాలజీ అని తెలీదు. తెలియకపోయినా కచ్చితంగానే తన భాషలో చెప్పింది. సెయింట్ జోసెఫ్ గళ్స్ హైస్కూల్‌లో అదే చెప్పింది. సెయింట్ జోసెఫ్ కాలేజీలోనూ అదే చెప్పింది. ఎదురుగా బొమ్మను పెట్టుకుని ఇన్‌స్పైర్ అవడానికీ, ఇన్‌స్పిరేషన్ కలిగించే అవకాశం అప్రయత్నంగా కలగడానికీ మధ్య వ్యత్యాసమే టెస్సీ బయోగ్రఫీ.
*********
శ్రీమతి టెస్సీ థామస్... డి.ఆర్.డి.ఓ. సైంటిస్ట్.
టెస్సీ గురించి నెట్‌లోగానీ, ఇంకెక్కడైనా గానీ ఇంతకు మించి ఎక్స్‌ట్రాగా ఒక్క ముక్క సమాచారం దొరకదు. ‘ఇండియా టుడే’ లాంటి పత్రిక అవార్డు ఇచ్చినప్పుడో, అగ్ని సఫలమైనప్పుడో, మరీ అంతగా సఫలం కాలేకపోయినప్పుడో టెస్సీ పేరు బయటికి వస్తుంది. అంతే!
మీడియాకు టెస్సీ థామస్ ఇచ్చే ఇంటర్వ్యూలు కూడా తట్టెడు పరిమితులకు లోబడి ఉంటాయి. బహుశా దేశ రక్షణ కోసం తన సైంటిస్టులు ఈ మాత్రం గోప్యనీయతను పాటించడం అవసరమని డి.ఆర్.డి.ఓ. భావిస్తుండవచ్చు. ఈ సంస్థ భారత రక్షణ మంత్రిత్వ్ర శాఖ పరిధిలో ఉంటుంది. డి.ఆర్.డి.ఓ. అంటే డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్. ఇందులో జరిగే పరిశోధనలు ఎంత గోప్యమో. సిబ్బంది వ్యక్తిగత వివరాలు అంత గుంభనం. వారి సాధారణ ప్రయాణ వివరాలు సైతం ఫైళ్లలో దూరిపోతాయి.
గత ఏడాది డిసెంబర్ 8న అలప్పుళ లోని పుట్టింటికి వెళ్లివచ్చారు మిసెస్ టెస్సీ. ఆమె డెయిరీలో అది అతి ముఖ్యమైన రోజు. తల్లి కుంజమ్మ (75) పుట్టినరోజు! బరువు బాధ్యతలు గల ఉద్యోగంలో క్షణం తీరిక లేకుండా ఉండే కూతురు తన కోసం అంతదూరం రావడం చూసి ఆ వృద్ధమూర్తి హృదయం పులకించింది. తల్లి స్పర్శకు ఈ ‘మిస్సైల్ ఉమన్’ కొన్ని క్షణాలైనా పసిపిల్ల అయి ఉంటుంది. తోబుట్టువు టెస్సీ వస్తుందని తెలిసి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు కూడా అలప్పుళ చేరుకున్నారు. ఇండియన్ మిస్సైల్ ప్రాజెక్టు తొలి మహిళా డెరైక్టర్ టెస్సీకి అవి ఎంతో అపురూపమైన క్షణాలు.
త్రిచూర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అయ్యాక పుణెలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్మమెంట్స్ టెక్నాలజీ (డైట్)లో ఎం.టెక్ లో చేరారు టెస్సీ. అక్కడే డి.ఆర్.డి.ఓ. ఆఫర్ చేసిన ‘గెడైడ్ వెపన్ కోర్సు’లో చేరారు. అప్పుడూ ఇంతే. వెళ్లేందుకు సెలవలు, వెళ్లాక సెలవు కొనసాగింపులు ఒకట్రెండు విజ్ఞప్తులతో దొరికేవి కాదు. అలప్పుళ నీటికయ్యల్ని చూడగానే ఆమెకు ప్రాణం లేచివచ్చేది మరి! అక్కడి నుంచి కదలబుద్ది అయ్యేది కాదు.
టెస్సీ తండ్రి టి.టి.థామస్ 1991లో చనిపోయారు. ఆనాటి విషాద ఉద్వేగాలను వృత్తిపరమైన బాధ్యతలతో నియంత్రించుకోగలిగారు.
టెస్సీ ఇంజినీరింగ్ చదివి తీరాల్సిందేనని ఇంట్లో అందరికన్నా ఎక్కువ పట్టుపట్టింది ఆమె తల్లి కుంజమ్మ! నచ్చిన ఉద్యోగాన్ని సంపాదించుకోవాలంటే ముందు నచ్చిన జీవితం ఏదో ఎంచుకోవాలి. టెస్సీ మిస్సైల్స్‌ను ఎంచుకున్నారు. ఆమె ఎంపికకు అప్పుడే పెళ్లి అడ్డుపడకుండా ఆమె తల్లి జాగ్రత్తలు తీసుకున్నారు. టెస్సీ రాకెట్ ఇంజినీర్ అయ్యారు.
‘‘ఎంతో కష్టపడి సాధించుకున్న కెరీర్‌ను కూడా పెళ్లి తర్వాత అమ్మాయిలు వదిలేస్తుంటారు. అది కరెక్ట్ కాదు’’ అంటారు టెస్సీ... తల్లి కుంజమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ. అగ్ని-4 పరీక్ష తర్వాత ఇండియన్ ఇంజినీరింగ్ కాంగ్రెస్‌లో మాట్లాడేందుకు బెంగళూరు వెళ్లినప్పుడు టెస్సీ బుర్రను కొందరు ఇంజినీరింగ్ అమ్మాయిలు ప్రశ్నలతో తోడేశారు. టెస్సీ తన సమాధానాలతో వాళ్ల హృదయాలను నింపేశారు!
‘‘ఆడవాళ్లు ఎంత పెద్ద సక్సెస్ సాధించినా గుర్తింపు రాదు. చిన్న ఫెయిల్యూర్ కూడా పెద్ద సర్టిఫికెట్ ఇచ్చేస్తుంది - అన్‌ఫిట్ అని. నిజమే కదా మేమ్’’
టెస్సీకి అర్థమైంది. అగ్ని-4ని, అగ్ని-3ని కంపేర్ చేసి మాట్లాడుతున్నారు ఈ అమ్మాయిలు. అగ్ని-3 తన గమ్యాన్ని చేరుకోడానికి ముప్పై సెకన్ల ముందుగానే బంగాళాఖాతంలో కూలిపోయింది. ఆ ఘటన తో మహిళల శక్తిసామర్థ్యాలను శంకించినవారు... అగ్ని-4 విజయవంతం అయ్యాక ఆ స్థాయిలో ప్రశంసించలేకపోవడం వారిని బాధిస్తోంది.
‘‘గుర్తింపు, సక్సెస్ వేర్వేరు అంశాలు. గుర్తింపు కోసం సక్సెస్ అవ్వాలని చూస్తామా? మన పని మనం చేసుకుపోవాలి.’’
‘‘కానీ మేమ్... ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఏమిటి?!’’
‘‘అలా ఎందుకు అనుకోవాలి. ఆడామగ తేడాలను ఎవరైనా ఎత్తిచూపుతున్నప్పుడు ఇంకా చక్కగా పని చేసి మనం ఏమిటో నిరూపించుకుందాం. అప్పుడు జెండర్ గురించి మాట్లాడ్డానికి అవకాశమే ఉండదు. అగ్ని-3 ఫెయిల్ అయినప్పుడు అంతా దిగ్భ్రాంతికి లోనై చూస్తున్నాం. అది వైఫల్యమే కానీ, పూర్తిగా కాదని మాకు తెలుస్తూనే ఉంది. కొంతమంది మమ్మల్ని సపోర్ట్ చేశారు. మరింత ఉత్సాహంగా పని చేశాం. విమర్శగానీ, విచక్షణగానీ మనల్ని బాధిస్తోందంటే... మన పోరాట పటిమ తగ్గుతున్నదేమో గమనించుకోవాలి.’’
‘‘ఎదగనీయకుండా అడ్డుకునే పరిస్థితులకు సర్దుకుని పోవడం తప్ప దారి లేదా?
‘‘ఉంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలి. చేస్తున్న పనిలోనే కాకుండా, సంబంధం ఉన్న ప్రతి పనిలోనూ సామర్థ్యాలను పెంచుకోవాలి. అకస్మాత్తు అవసరాలు మన పాత్రను కీలకం చేస్తాయి. అప్పుడు కాలుడ్డుపెట్టిన వారే పక్కకు తప్పుకుని దారిస్తారు.’’
‘‘నిజం. చెప్పండి. ఒక మహిళగా మీరు మీ వృత్తిలో సంతృప్తికరంగానే ఉన్నారా? ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా!’’
‘‘ఎస్. ఉన్నాను. నా టీమ్‌లో ఆరుగురు మహిళలు ఉన్నారు. వీరే కాకుండా అగ్ని ప్రోగ్రామ్‌లో ఇరవై మంది మహిళలు ఉన్నారు. మొత్తం డి.ఆర్.డి.ఓ.లో చూస్తే పదిహేను నుంచి ఇరవై శాతం వరకు మహిళలు ఉన్నారు. ఇంకా బయటి నుంచి వస్తున్నారు. ప్రతిభను నిరూపించుకునే క్రమంలో ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్లు ప్రతిభను మెరుగుపరిచేవిగానే ఉంటాయి తప్ప మాకొక అవరోధంగా అనిపించవు.’’
టెస్సీ ఇంత చెప్పాక ఏ అమ్మాయి మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఉబలాటపడకుండా ఉంటుంది?
సాదా సీదా చీరలో, చిరునవ్వుతో కనిపించే టెస్సీతో రెండు నిమిషాలు మాట్లాడితే చాలు తక్షణ శక్తిలా ఆడపిల్లలకు తక్షణ ఆత్మవిశ్వాసం కలుగుతుంది. భవిష్యత్తుపై కొత్త ఆశతో వారి కళ్లు మెరుస్తాయి. ఏదైనా సాధించగలం అన్న ధీమా వస్తుంది!
1988లో పుణె నుంచి హైదరాబాద్‌లోని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబరేటరీకి బదలీ అయిన కొత్తల్లో ప్రాజెక్టు డెరైక్టర్ ఎ.పి.జె. కలామ్ ఇదే విధమైన ధీమాను, ఆత్మవిశ్వాసాన్ని టెస్సీలో కలిగించారు. ఆమె ప్రావీణ్యాలను మలిచిన మరో గురువు అవినాశ్ చందర్. త్వరలోనే ఈ శిష్యురాలు తన గురువులిద్దరి ప్రఖ్యాతిని, డి.ఆర్.డి.ఓ. ప్రతిష్టను మరోసారి నిలబెట్టేందుకు అగ్ని-5 ను సంధించబోతున్నారు. వచ్చే ఫిబ్రవరిలో గానీ, మార్చిలోగానే టెస్ట్ ఫైర్ జరిపేందుకు టెస్సీ బృందం తమ లంచ్ టైమ్‌ను కూడా తగ్గించుకుంది!
*********
డి.ఆర్.డి.ఓ.లో టెస్సీ ప్రస్థానం మరో రెండేళ్లలో రజతోత్సవానికి దగ్గరౌతుంది. పాతికేళ్లు అంటే పాదరసం లాంటి మనిషి జీవితంలో పెద్ద అమౌంటే! ఇదంతా వృత్తిపట్ల అంకితభావంతో టెస్సీ వెనకేసుకున్న సంపద. డి.ఆర్.డి.ఓ.లో శాస్త్రవేత్తలు, భారత రాజకీయ రంగ ప్రముఖులు ఆమెను ‘రాకెట్ లేడీ’ అంటారు. మంద్రస్థాయిలో ఇది ‘భారత రత్న’ అన్నట్లుంటుంది టెస్సీని అభిమానించే మహిళలకు, ఇంజినీరింగ్ విద్యార్థినులకు.
అగ్ని-1 నుంచి ప్రస్తుతం సిద్ధమౌతున్న అగ్ని-5 వరకు ప్రతి దశలోనూ ఉపరితల క్షిపణుల తయారీలో టెస్సీ అతి కీలకమైన పాత్రను పోషిస్తూ వస్తున్నారు. ఎలా సాధ్యం ఇంటి కోసం, దేశం కోసం బ్యాలెన్సింగ్‌గా పని చేసుకుంటూ పోవడం!
ఆ క్రెడిట్ అంతా తన భర్తదేనని అంటారు టెస్సీ. ఆయన కూడా గెడైడ్ మిస్సైల్ టెక్నాలజీలోనే పోస్టు గ్రాడ్యుయేట్. కొన్నాళ్లు డి.ఆర్.డి.ఓ.లో చేశారు కనుక అక్కడి బాధ్యతల గురించి బాగా తెలుసు. అందుకే టెస్సీ ఇంటికి వచ్చే సమయానికి పూచికపుల్లనయినా ఇటు తీసి అటు పెట్టే అవసరం లేకుండా జాగ్రత్త పడతారు. ఒకేసారి అనేక బాధ్యతలు మీద పడి ఆమె సతమతమౌతున్నట్లు కనిపిస్తే ఎంకరేజ్ చేస్తూ ఆ భారాన్ని కొంత తగ్గిస్తారు. వారి ఏకైక కుమారుడు తేజస్. మన దేశవాళీ తేలికపాటి యుద్ధ విమానం పేరునే టెస్సీ తన కొడుక్కి పెట్టుకున్నారు. అతడూ ఎంటెక్‌కి వచ్చేశాడు!
పిల్లల్ని సైన్స్ కోర్సుల్లోకి ఎంకరేజ్ చెయ్యాలని టెస్సీ చెబుతుంటారు. ‘‘సైన్స్, మేథ్స్ లేకుండా నిత్యజీవితంలో మనిషి రెండడుగులైనా ముందుకు వేసే పరిస్థితి లేనప్పుడు... టఫ్‌గా ఉంటాయని సైన్స్ సబ్జెక్టులు తీసుకోడానికి విద్యార్థులు వెనకంజ వేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోగలం? ఇంట్రెస్ట్ లేనంత వరకే ఏదైనా టఫ్. ఆ సంగతి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశ అవసరాలను తీర్చవలసిన బాధ్యత తమ పిల్లలపై కూడా ఉందని ప్రతి తల్లీ తండ్రీ గ్రహించాలి’’ అంటారు టెస్సీ.
లాబ్‌లో తన జూనియర్ కలీగ్స్‌తో టెస్సీ కూడా ఇదే విధంగా ఉంటారు. అంటే... స్ట్రిక్ట్‌గా ఉండే ఒక పేరెంట్‌లా. వారి నుంచి ఆవిడ పూర్తిస్థాయి అంకితభావాన్ని మృదువుగా పిండుకుంటారు. ఒక దేశపు అత్యున్నతస్థాయి సంస్థలో బాధ్యతలు సక్రమంగా అమలవడానికి ఈ మాత్రం ‘కాఠిన్యం’ అవసరమే! అలాగని టెస్సీ బాసిజం చూపించరు. చెప్పడం చేతకాకపోతే కదా అరవడం.
*********
ఒక సాధారణ ఉద్యోగి లేచినట్లే రోజూ ఉదయం నాలుగింటికే నిద్రలేస్తారు టెస్సీ. అప్పటి నుంచి ఆమె డ్యూటీ మొదలౌతుంది.
తెల్లవారుజామున వచ్చే కలలు నిజమౌతాయని అంటారు. ఆ మాటలో ఎంత నిజం ఉందో కానీ, కలల్ని నిజం చేసుకోడానికి ఆ మాత్రం ముందుగా లేవడం అవసరం. ఎందుకంటే - అసలు కలలే కనని వారికి కూడా ఇన్ స్పిరేషన్ ఇచ్చే టైమ్ అది.
టెస్సీ థామస్
డి.ఆర్.డి.ఓ. శాస్త్రవేత్త (48)
జన్మస్థలం : అలప్పుళ (అలెప్పీ) కేరళ
తల్లిదండ్రులు :
టి.టి.థామస్, కుంజమ్మ
భర్త : సరోజ్
కుమారుడు : తేజస్
తొలి ఉద్యోగం : పుణె లోని డి.ఆర్.డి.ఓ. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్మమెంట్ టెక్నాలజీలో
గెడైడ్ మిస్సైల్ ఫ్యాకల్టీ మెంబర్‌గా (1987)
పదోన్నతి : గెడైడ్ మిస్సైల్స్‌లో ఎం.ఇ. డిగ్రీ అయ్యాక హైదరాబాద్‌లోని అడ్వాన్స్డ్ సిస్టమ్స్
లేబరేటరీలో ‘బి’ సైంటిస్ట్‌గా (1988)
ప్రస్తుత హోదా: మిస్సైల్ ప్రాజెక్ట్ తొలి మహిళా డెరైక్టర్
టైటిల్ : మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియా
అవార్డులు
అగ్ని సెల్ఫ్ రిలయన్స్ అవార్డు (2001)
పాత్ బ్రేకింగ్ రిసెర్చ్ / ఔట్‌స్టాండింగ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ అవార్డు (2007)
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టెక్నికల్ పేపర్ ప్రెజెంటేషన్ ప్రైజ్ (2007)
నేషనల్ సైన్స్ డే - డి.ఆర్.డి.ఓ. సిలికాన్ మెడల్ అండ్ కమెండేషన్
సర్టిఫికెట్ (2008)
డాక్టర్ కల్పన చావ్లా మెమోరియల్ లెక్చర్ ఆనర్ (2009)
ఇండియా టుడే ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ (2009)
‘అగ్ని’హోత్రి
క్షిపణి (మిస్సైల్) అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భారత రక్షణ వ్యవస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నాలుగు రకాల ఏ (అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4) క్షిపణుల పరీక్ష జరిగింది. వచ్చే ఫిబ్రవరి-మార్చిలో అగ్ని-5ను మన రక్షణ శాఖ పరీక్షించబోతోంది. ఆరంభం నుంచీ ఈ క్షిపణుల అభివృద్ధి కార్యక్రమంలో కీలక భాగస్వామ్యం కలిగి ఉన్న టెస్సీ... అగ్ని-4కు ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా ఉన్నారు. అగ్ని-5కి కూడా ఆమె నేతృత్వం కొనసాగుతుంది. దేశ రక్షణ వ్యవస్థలోని సకల విభాగాలలో ఇప్పటికే సమర్థంగా సేవలు అందిస్తున్న భారతీయ మహిళల్లో... యుద్ధ సంబంధమైన విధులను సైతం నిర్వహించగల సత్తా ఉందని టెస్సీ అంటున్నారు.
ఉపరితలం నుంచి ఉపరితలానికి టార్గెట్ రీచ్ అయ్యే దూరాన్ని బట్టి అగ్ని శ్రేణులు ఉంటాయి. అగ్ని-వన్... 500 - 700 కి.మీ. పరిధిలోని లక్ష్యాన్ని ఛేదించే విధంగా తయారైనది. అగ్ని-ఫైవ్ 5000 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యంతో తయారవుతోంది.
courtesy - సాక్షి ఫ్యామిలీ

No comments:
Post a Comment