Sunday, May 22, 2011

'' మిస్టర్ రావును పిలవండి '' * ఆరుగురు ప్రధానుల మాట అది

శ్రీశ్రీ, వివేకానంద, చిన్మయానంద.. ఒకరు కమ్యూనిస్టు. మరొకరు తాత్వికుడు. ఇంకొకరు ఆధ్యాత్మికవేత్త. ఈ ముగ్గురి భావజాలం వేసిన బీజంతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన న్యాయమూర్తి డాక్టర్ పి.సి.రావు (పాటిబండ్ల చంద్రశేఖరరావు). కృష్ణా జిల్లా వీరులపాడులో పుట్టి పెరిగిన ఆయన హ్యాంబర్గ్‌లోని 'ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ' కోర్టుకు జడ్జిగా పనిచేస్తున్నారు. దేశాల మధ్య తలెత్తే తగువుల్ని పరిష్కరించే తీర్పులిస్తున్నారు. ఆయన ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా నవ్యతో మాట్లాడారు. "రాజీవ్‌గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్, చంద్రశేఖర్, పీవీ నరసింహారావు, వాజ్‌పేయి, దేవెగౌడతో కలిపి ఆరుగురు ప్రధానుల దగ్గర పనిచేసే అరుదైన అవకాశం నాకే దక్కింది. కొత్త చట్టాలు రూపొందించే సమయంలో ఎలాంటి న్యాయ సందేహాలు తలెత్తినా.. సలహాలు కావాలన్నా "మిస్టర్ రావును పిలవండి'' అనేవారు ప్రధానులంతా. రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావులతో నాకు సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది. పీవీగారు తను పదవిలో ఉన్నంత వరకు లా సెక్రటరీగా నన్నే ఉండమన్నారు. రాజ్యాంగంలోని ప్రొవిజన్స్‌ను చాలా సందర్భాల్లో రాజీవ్‌కు వివరించేవాణ్ణి. పంచాయతీరాజ్, మున్సిపాలిటీ యాక్ట్‌లు తీసుకొచ్చేందుకు నా సలహాలు తీసుకుంది ప్రభుత్వం.''
"ఫిజీలో గొడవలు జరిగినపుడు రహస్యంగా వెళ్లి అక్కడున్న భారతీయులందరినీ కలిశాను. వాళ్ల అవసరాలు, కావాల్సిన హక్కుల గురించి తెలుసుకున్నాను. వాటన్నిటినీ క్రోడీకరించి.. ఆ దేశ ప్రభుత్వానికి మన డిమాండ్లను చెప్పాను. దాంతో కొత్త రాజ్యాంగ రచనలో మన వాళ్ల హక్కులకు స్థానం దొరికింది. కొత్త రాజ్యాంగాలు రాసుకుంటున్న అన్ని దేశాలకు వెళ్లాను నేను. అలా వెళ్లి ప్రవాస భారతీయుల హక్కులకు స్థానం కల్పించమని కోరాను. కొన్ని దేశాలకు ప్రభుత్వం పంపితే, మరి కొన్నింటికి ఆ దేశాల ఆహ్వానంపై వెళ్లాను. టిబెట్, సూడాన్, కరీబియన్ దేశాలకు ఇలాంటి పనిమీదే వెళ్లడం మరిచిపోలేని అనుభవం.''

"చూశారుగా ఈ మూలనున్న పెద్ద పార్శిల్ బాక్సులు. వాటిలో ఉన్న కాగితాలను క్షుణ్ణంగా చదవాలి. బోలెడు పుస్తకాలను రెఫర్ చేయాలి. అంతర్జాతీయ చట్టాలను పరిశీలించాలి. ఎవరి వాదనలో ఎంత సత్యముందో అర్థం చేసుకోవాలి. ఇది మూడు దేశాలకు సంబంధించిన వ్యవహారం కదా.. హ్యాంబర్గ్ వెళుతూనే ఈ కేసు మీద తీర్పు చెప్పాలి..'' అంటూ హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ ఎదురుగ్గా ఉన్న భవంతిలో ఇంటర్వ్యూ మొదలుపెట్టారు డాక్టర్ పి.సి.రావు. ఇండియా, బంగ్లాదేశ్, బర్మా దేశాల సముద్ర జలాలకు సంబంధించిన కేసు అది. ఆ మూడు దేశాలు హ్యాంబర్గ్‌లోని 'ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ'లో విడివిగా కేసులు వేశాయి. ఆ కేసును విచారించే జడ్జిలలో ఒకరైన డాక్టర్ పి.సి.రావు.. మన దేశంలో ఆ స్థాయికి చేరుకున్న వారిలో నాలుగోవారు. ఇంటర్నేషనల్ కోర్టుకు చీఫ్ జస్టిస్ అయిన వారిలో ప్రథములు.

రెడ్‌విలేజ్...

"కృష్ణా జిల్లాలోనే మంచి చైతన్యవంతమైన గ్రామం మాది. వీరులపాడు పేరు చెప్పగానే ఎంతోమంది పెద్దవాళ్లు గుర్తుకొస్తారు. త్రిపురనేని రామస్వామి చౌదరి మా ఊర్లోనే పెళ్లి చేసుకున్నారు. ఆనాడే రైతుల కోసం ప్రత్యేకించి గ్రంథాలయం స్థాపించారు. ఊర్లో అందరూ కమ్యూనిస్టులే. అందుకే 'రెడ్ విలేజ్' అనేవారంతా దాన్ని. మా అమ్మ పుస్తకాలు బాగా చదివేది. లైబ్రరీ నుంచి కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి నన్ను కూడా చదవమనేది. అలా అలవాటైన పుస్తకాలను ఇప్పటికీ వదల్లేదు నేను. పెద్దయ్యాక బ్రిటిష్ లైబ్రరీకి వెళ్లి చదివేవాణ్ణి. అప్పుడే శ్రీశ్రీ, చిన్మయానంద, వివేకానందల భావజాలం నన్ను ఉత్తేజపరిచింది. శ్రీశ్రీ పుస్తకాలతోనే ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాను. ఉపనిషత్తుల్లోని గురు, శిష్య సంవాదం తార్కిక, లౌకిక జ్ఞానాన్ని పెంచింది. చెబితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కానీ, శ్రీశ్రీ, వివేకానంద, చిన్మయానంద ఆలోచనల్లోని టెక్నిక్‌ను... నా తీర్పుల్లో కూడా అనుసరిస్తాను. టెక్నిక్ అంటే 'నువ్వు ఎటువైపు చూస్తున్నావ్..? ప్రపంచాన్ని నువ్వు ఏ దృక్పథంతో పరిశీలిస్తున్నావ్? అన్నదే''

గోల్డ్‌మెడలిస్ట్...

"వందమందిలో కేవలం పదిమందే ఎం.ఎల్.లో పాసయ్యేవారు పాత రోజుల్లో 'లా' గోల్డ్‌మెడల్ వచ్చింది నాకు. ఆ తర్వాత మద్రాసు యూనివర్శిటీలో ఎల్.ఎల్.డి. (డాక్టర్ ఆఫ్ లాస్) చేశాను. ఆ కోర్సు చేసిన ఆఖరి వ్యక్తిని నేనే. ఎందుకంటే నాకు డాక్టరేట్ వచ్చాక ఆ కోర్సును ఎత్తివేశారు. చదువు గురించి చెబుతున్నాను కాబట్టి ఇక్కడో విషయం గుర్తుచేసుకోవాలి. నేను బీఏలో ఫిలాసఫీ తీసుకుంటుంటే ఒక అధ్యాపకుడు ఏమన్నాడంటే.. "ఏంటయ్యా, ఇది పనికొచ్చే కోర్సు కాదు. ఏదైనా ఉద్యోగం వచ్చే కోర్సులో జాయినవ్వు. టైమ్ ఎందుకు వేస్ట్ చేసుకుంటావ్..?'' అన్నారు కాస్త విసుగ్గా. "లేదు సార్, నా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఫిలాసఫీ చేశాక న్యాయశాస్త్రం చదువుతాను...'' అన్నాను. ఫిలాసఫీ అనేది ప్రశ్నల్ని లేవనెత్తే గొప్ప శాస్త్రం. ప్రశ్నలతోనే మనో వికాసం సాధ్యం. అలా ఇష్టంతో చదవడంతో 'బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద కాలేజ్' అవార్డు దక్కింది నాకు. చదువు పూర్తయ్యాక న్యాయరంగంలోకి అడుగులు పడ్డాయి..''

ఒక్కో మెట్టు ఎక్కుతూ..

"నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు 'ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా' నెలకొల్పారు. ఢిల్లీకి వెళ్లి అందులో 'రీసెర్చ్ ఆఫీసర్'గా జాయినవ్వడంతో నా కెరీర్ మొదలైంది. అదే సంస్థ నుంచి వచ్చే 'ఇండియన్ జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా' లో ఎడిటింగ్ వర్క్ కూడా చేసేవాణ్ణి. 1967లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో 'లా ఆఫీసర్'గా పోస్టింగ్ రావడంతో జాయినయ్యాను. ఆ శాఖలో పలు పదవులు నిర్వర్తించాక.. కేంద్ర న్యాయ శాఖకు వెళ్లాను. అక్కడ డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి లా సెక్రటరీ వరకు పనిచేశాను. ఈ సమయంలో రాజీవ్‌గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్, చంద్రశేఖర్, పీవీ నరసింహారావు, వాజ్‌పేయి, దేవెగౌడతో కలిపి ఆరుగురు ప్రధానుల దగ్గర పనిచేసే అరుదైన అవకాశం నాకే దక్కింది.

కొత్త చట్టాలు రూపొందించే సమయంలో ఎలాంటి న్యాయ సందేహాలు తలెత్తినా.. సలహాలు కావాలన్నా "మిస్టర్ రావును పిలవండి'' అనేవారు ప్రధానులంతా. రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావులతో నాకు సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది. పీవీగారు తను పదవిలో ఉన్నంత వరకు లా సెక్రటరీగా నన్నే ఉండమన్నారు. రాజ్యాంగంలోని ప్రొవిజన్స్‌ను చాలా సందర్భాల్లో రాజీవ్‌కు వివరించేవాణ్ణి. పంచాయతీరాజ్, మున్సిపాలిటీ యాక్ట్‌లు తీసుకొచ్చేందుకు నా సలహాలు తీసుకుంది ప్రభుత్వం. విధుల్లో భాగంగా అన్ని దేశాలు తిరిగాను. అక్కడి న్యాయవ్యవస్థలను అర్థం చేసుకున్నాను. నేను అంతర్జాతీయ న్యాయరంగంలోకి వెళితే మన దేశం ప్రతిష్ట పెరుగుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం... ఇంటర్నేషనల్ కోర్టుకు ప్రపోజ్ చేసింది..''

ఎల్లలు దాటి...

"అంతర్జాతీయ న్యాయవ్యవస్థ ఒకప్పుడు చాలా సంక్లిష్టంగా ఉండేది. ప్రపంచ దేశాల మధ్య ఎలాంటి తగువులు వచ్చినా ఈ కోర్టే పరిష్కరించాలి. కేసులు పెరిగిపోయి తీర్పుల్లో జాప్యం జరుగుతుండటంతో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని విడదీశారు. అవే మూడు అంతర్జాతీయ ట్రిబ్యునల్ కోర్టులు అయ్యాయి. అందులో ఒకటి 'ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ'. ఈ కోర్టు జర్మనీలోని హ్యాంబర్గ్‌లో ఉంది. దేశాల మధ్య ఎలాంటి జల వివాదాలు వచ్చినా ఈ కోర్టే విచారిస్తుంది. ఇందులో పలు దేశాలకు చెందిన 21 మంది జడ్జిలు ఉంటారు. జడ్జిగా ఎంపికవ్వాలంటే అదో పెద్ద ప్రక్రియ.

ఆయా దేశాలలో లబ్దప్రతిష్టులైన ఒక న్యాయనిపుణున్ని స్వయంగా ప్రధానే సిఫారసు చేయాలి. ఆ వ్యక్తి వివరాలన్నీ ఆ దేశపు రాయబార కార్యాలయాలకు వెళతాయి. న్యూయార్క్‌లోని డిప్లమాటిక్ మిషన్స్ ప్రచారం చేస్తాయి. ఈ పని అన్ని దేశాలు చేస్తాయి. ఆఖర్న ఐక్యరాజ్యసమితిలో సెక్రటరీ జనరల్ సమక్షంలో ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ ఎన్నికల్లో దేశాలు సిఫారసు చేసిన న్యాయ నిపుణులు జడ్జిలుగా పోటీ చేస్తున్న వారికి ఓటు వేస్తారు. అప్పుడు గెలిచిన వారే సంబంధిత కోర్టుకు జడ్జి అవుతారు. కనీసం 106 దేశాలు ఓటు వేస్తేకానీ జడ్జి కాలేరు. ఎన్నికైన జడ్జిలు తిరిగి చీఫ్ జస్టిస్‌ను ఎన్నుకుంటారు. ఇంత తతంగం ఉంటుంది అంతర్జాతీయ కోర్టులకు జడ్జి కావాలంటే. ఇప్పటి వరకు మన దేశం తరఫున కేవలం ముగ్గురు మాత్రమే జడ్జిలు (బి.ఎన్.రావు, నాగేంద్రసింగ్, ఆర్.ఎస్.పాథక్) అయ్యారు. నాలుగో వ్యక్తిని నేను. హైదరాబాద్‌లోనే ఇల్లు కట్టుకోవడంతో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చిపోతుంటాను.''

-మల్లెంపూటి ఆదినారాయణ ఫోటోలు : ఎం.గోపికృష్ణ

Wednesday, May 18, 2011

శృంగారానికి తొలి పాఠం!

'కామసూత్ర' ఈ పేరు వినగానే శృంగారం గుర్తుకొస్తుంది. 
నిజానికి రెండు వేల ఏళ్ల క్రితం రాసిన ఈ పుస్తకంలో శృంగారానికి సంబంధించిన అంశాలు మాత్రమే కాదు. స్త్రీ, పురుషులు ఒకరినొకరు ఎలా ఆకర్షించుకోవాలనే విషయాన్ని కూడా వాత్స్యాయనుడు చర్చిస్తాడు. ఇప్పటి దాకా ఈ పుస్తకాన్ని భిన్న కోణాల నుంచి విశ్లేషిస్తూ.. అందులో సారాన్ని వివరిస్తూ 183 పుస్తకాలు వెలువడ్డాయి. 
http://www.thehindu.com/multimedia/dynamic/00494/03ndmpSpring_fever__494512e.jpg
కొత్తగా ఈ పుస్తకంలోని సారాన్ని అందరికి అర్థమయ్యే రూపంలో - ఎ.ఎన్.డి. హక్సర్ సంస్కృతం నుంచి ఇంగ్లీషులోకి అనువదించారు. మొత్తం ఏడు అధ్యాయాలు ఉన్న ఈ పుస్తకంలో కేవలం శృంగార భంగిమల గురించే కాకుండా స్త్రీ,పురుష సంబంధాల గురించే కూడా చర్చించారు. దీనిలోని కొన్ని ముఖ్యమైన అంశాలు.....
http://images.bhaskar.com/web2images/www.dailybhaskar.com/2011/02/21/images/kama_sutra_250_f.jpg
"ఆరోగ్యకరమైన శృంగారానికి 64 కళల అవసరం కూడా ఉంటుంది. అందువల్ల దీనిని '64 సిద్ధాంతం' అని కూడా పిలుస్తారు. రుగ్వేదంలో ఉన్న శ్లోకాలను పదింటి చొప్పున గుదిగుచ్చుతారు. అదే విధంగా శృంగార కలయికలో ఉన్న అంశాలను 64గా కూరుస్తారని మనం భావించవచ్చు. భభృవ్యుడు ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం- శృంగారంలో ప్రధానమైనవి ఎనిమిది అంశాలు.''
http://ww.spicezee.com/upload/2011/1/30/kamasutra-150.jpg
పురుషులు ఎలా తయారుకావాలి?
ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత పళ్లను శుభ్రంగా తోముకోవాలి. ఆ తర్వాత సువాసన వెదజల్లే లేహ్యాన్ని వంటికి రాసుకోవాలి. సుగంధాన్ని వెదజల్లే సాంబ్రాణి పొగతో జుట్టును శుభ్రపరచుకోవాలి. తేనెటీగల మైనాన్ని, మృదువుగా ఉన్న ఎర్రని లక్కను మొహానికి రాసుకోవాలి. ఆ తర్వాత మంచి పూల దండ వేసుకొని రోజు వారీ కార్యక్రమాలకు ఉపక్రమించాలి.
http://www.newsreporter.in/wp-content/uploads/2011/05/Kama-Sutra-Wall-Carvings-Khajuraho-300x225.jpg
పురుషులు ప్రతి రోజూ స్నానం చేయాలి. రెండు రోజులకు ఒకసారి ఒళ్లు పట్టించుకోవాలి. మూడు రోజులకు ఒక సారి చేప ఎముకతో చేసిన పరికరంతో ఒళ్లును శుభ్రపరచుకోవాలి. మీసాలు, గోళ్లు నాలుగు రోజులకు ఒక సారి తీసుకోవాలి. శరీరంపై ఉన్న అనవసరపు రోమాలను ప్రతి పది రోజులకు ఒక సారి తీసివేయాలి.
http://www.indianetzone.com/photos_gallery/12/khajuraho_18221.jpg
ఆకర్షణీయంగా మారాలంటే...
"తయారయ్యే విధానం, వయస్సు, వ్యక్తిత్వం, స్వేచ్ఛగా ఉండే తత్వం- ఒక వ్యక్తిని ఆకర్షణీయంగా తయారుచేస్తాయి. దీని కోసం అధర్వణ వేదంలో కొన్ని మూలికలను పేర్కొన్నారు. వీటిని ఉపయోగించటం వల్ల వ్యక్తులు ఇతరులను ఆకర్షించగలుగుతారు. అడవుల్లో పెరిగే అల్లం, గడ్డి గులాబీలు, నేరేడు జాతికి చెందిన చెట్ల ఆకులను బాగా ఎండపెట్టాలి. ఎండిన ఈ మూడింటిని పొడిగా చేయాలి. మెలోబాలన్ (ఉత్తర భారతంలో వీటిని అర్జున చెట్లు అంటారు) చెట్ల నుంచి తీసిన నూనెను ఒక మానవ కపాలంలో పోయాలి. ఈ పొడిని పత్తితో కలిపి వత్తిగా చేసి వెలిగించాలి. అప్పుడు వచ్చే పొగ గదిలోని వ్యక్తులను ఆకర్షణీయంగా చేస్తుంది. ఒక వేళ ఇది సాధ్యం కాకపోతే- మరి కొన్ని చిట్కాలు ఉన్నాయి. కొన్ని ఎర్ర కలువలను, నీలం కలువలను తీసుకోవాలి. వీటిని అడవి గులాబీల రేకలతో కలిపి ఎండపెట్టి

పొడిగా చేయాలి. ఈ పొడిని తేనె, నెయ్యిలతో కలిపి తీసుకుంటే వ్యక్తులు ఆకర్షణీయంగా తయారవుతారు. ఈ పొడినే నేరేడు ఆకులతో కలిపి లేహ్యంగా చేసి ఒంటికి రాసుకుంటే ఆకర్షణ వస్తుంది.
http://www.telugupedia.com/VatsayanaKamaSutra/Mukteswar_temple.jpg
ఈ మూలికలతో పాటు కొన్ని జంతువుల ఎముకలను ఉపయోగించటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. బంతిపువ్వుల రేకలను తీసుకొని వాటి నుంచి రసం తీయాలి. ఈ రసంలో ఒంటె ఎముకను నానపెట్టాలి. ఇలా నానపెట్టిన ఎముకను బాగా కాల్చాలి. అప్పుడు వచ్చే కాటుకను తీసుకొని కళ్లకు పెట్టుకుంటే అత్యంత ఆకర్షణీయంగా తయారవుతారు. గద్దలు, రాబందులు, నెమళ్ల ఎముకలను కూడా ఇదే విధంగా చేసి వచ్చిన కాటుకను పెట్టుకోవటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.

లైంగిక శక్తి పెరగాలంటే..
లైంగిక శక్తి పెరగటానికి, భాగస్వామిని సంతృప్తిపరచటానికి అనేక మార్గాలు ఉన్నాయి. అల్లం, మిరియాలు, అడవిలో దొరికే లైకోరైస్ అనే చెట్టు బెరడులను పొడి చేయాలి. ఈ పొడిని పాలలో కలుపుకు తాగాలి. గొర్రె వృషణాలను పాలలో వేసి, ఆ పాలను మరగపెట్టి తాగటం వల్ల లైంగిక శక్తి బాగా పెరుగుతుంది. మాంసం తినని శాకాహారులకు మరొక పద్ధతి ఉంది. అడవిలో దొరికే కంద, చేమ, పెండలం వంటి దుంపమొక్కల వేర్లు , ఖర్జూరాలు, గుర్రం కళ్ల ఆకారంలో ఉండే బీన్స్‌లను పాలలో వేసి బాగా మరగించి తాగినా లైంగిక శక్తి బాగా పెరుగుతుంది. ఒక వేళ ఈ వస్తువులు దొరకకపోతే- తోక మిరియాలు, చెరకు వేర్లు, పెండలం గుజ్జును పాలలో వేసి మరగించాలి. ఆ పాలను తాగటం వల్ల ప్రయోజనం లభిస్తుంది. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారి కోసం మరి కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. పిచ్చుకల గుడ్లలో ఉండే సొనను సంపాదించాలి. ఈ సొనను నేతితోను, తేనెతోను కలపాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా బియ్యం కలిపి పాలలో ఉడికించాలి. దీనిని తినటం వల్ల పురుషులలో లైంగిక శక్తి బాగా పెరుగుతుంది. అనేక మంది స్త్రీలను సంతృప్తి పరిచే సామర్థ్యం లభిస్తుంది.

శృంగార కలయిక..
రతిలో 64 భాగాలు ఉంటాయని చెబుతారు. కొందరు అయితే 64 భాగాలను విడి విడి అధ్యాయాలుగా గ్రంథస్థం చేసారు కూడా. ఆరోగ్యకరమైన శృంగారానికి 64 కళల అవసరం కూడా ఉంటుంది. అందువల్ల దీనిని '64 సిద్ధాంతం' అని కూడా పిలుస్తారు. రుగ్వేదంలో ఉన్న శ్లోకాలను పదింటి చొప్పున గుదిగుచ్చుతారు.
http://static.ibnlive.com/pix/sitepix/02_2011/kamasutra_book_630.jpg
అదే విధంగా శృంగార కలయికలో ఉన్న అంశాలను 64గా కూరుస్తారని మనం భావించవచ్చు. భభృవ్యుడు ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం- శృంగారంలో ప్రధానమైనవి ఎనిమిది అంశాలు. కౌగిలింత, ముద్దు, కిలికించితం, కొరకటం, రతి, మూలుగు, ఉపరతి, ముఖరతి. ఈ ఎనిమిదింటిలోను మళ్లీ ఎనిమిది రకాలు ఉన్నాయి. ఎనిమిదిని ఎనిమిదితో హెచ్చువేస్తే 64 అవుతుంది కాబట్టి.. శృంగార కలయికను కూడా 64 కళలుగా పిలుస్తారు.

Tuesday, May 17, 2011

ఐడియాలతో అద్భుతాలు

'' పేరు ప్రతిష్ఠల ఫలితమే డబ్బు ''  ఆ పద్ధతి రాచమార్గం కాగా కుయుక్తులతో, అన్యాయంతో, అక్రమాలతో దేశాన్ని కొల్లగొట్టడం, అక్రమార్జన చేయటం అడ్డదారులుగాను. నాలుగు కాలాలపాటు నిలిచేదిగాను కాదని  తెలుసుకున్నాం. పదండి ముందుకి.. మిగతా అందిరి లాగే మనం కూడా మొబైల్ సంగీతం ఆస్వాదిద్దాం. మొబైల్ సంగీతం... జేబులో మొబైల్, చెవిలో స్పీకర్ లేని వ్యక్తి నేడు మనకెక్కెడా తారసపడరు. నడుస్తూ, వాహనాలు నడుపుతూ, నిద్రపోవటానికి ప్రయత్నిస్తూ, నిద్రపోతూ, చదువుకుంటూ, మాట్లాడుతూ సర్వవేళ సర్వావస్తలా ఈ మొబైల్ సంగీతం ఉండాల్సిందే... దాదాపు అందరికీ.. దీని పూర్వాపరాలు తెలుసుకుందాం.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiOq4Sn_UmgdFYJQobMXVhW58urKO3fmE4miz5RPNkvqXJAjkc4hSWTR-O7b_VvQEqrV13tNMr3A-n65phQxCX_fpYXs1PbjX-w7JrIn8GLif1i0srWyFYHhLs6JMihwm0wlfLlgFSabjQ/s1600/Akio+Mirota.jpg
ఈ మొబైల్ సంగీత యుగం ఆరంభం కాకముందు ప్రయాణాలు ముఖ్యంగా గంటలతరబడి చేసేవి, చాలా కష్టతరంగా, బోరింగ్ గాను ఉండేవి. ఒక్కసారిగా ఊహించుకోండి. దాదాపు ఇరవై నాలుగు గంటలకు పైగా సాగే భారత్-అమెరికా విమాన యాత్రలో సీట్లకు అతుక్కుపోయి అలాగే ఉండిపోవటం ఎంత కష్టంగా ఉండేదో ! తనువు, మనసు రెండు కష్టపడేవి విసుగెత్తిపోయేవి. అలాంటి ఒక ప్రయాణంలో సోనీ కార్పొరేషన్ చైర్మన్ అకియో మోరిటా బ్రహ్మాండంగా బోర్ అయిపోయి ఒక సరికొత్త ఐడియాతో ప్లేన్ దిగాడు. ఆ ఐడియా మ్యూజిక్ పరిశ్రమను పూర్తిగా మార్చివేయటమే కాకుండా, మనం సంగీతం వినే పద్ధతులను కూడా గుర్తుపట్టలేనంతగా మార్చేసింది. ఆ సుదీర్ఘ విమానయానం తర్వాత జపాన్‌లోని తన ఆఫీసుకు వెళ్లిన మోరిటా తన బృందాన్ని పిలిచి అటువంటి సుదీర్ఘ విమానయానాల్లో మనం మనకిష్టమైన మ్యూజిక్ వింటుంటే ఎంత బాగుండునో కదా అని అన్నాడు. ఆ ఆలోచనే నేడు కొన్ని వేల కోట్ల విలువైన ' వెళ్తూ వినే సంగీతానికి '(మ్యూజిక్ ఆన్ ది మూవ్) నాంది పలికింది.http://www.conceivablytech.com/wp-content/uploads/2010/10/sony-walkman.jpg
ఈ ఆలోచనకు మొదటి ప్రత్యక్ష రూపమే సోనీ వాక్‌మెన్. యువతను సంపూర్ణంగా ఆకట్టుకొని వాక్‌మెన్ లేని జీవితం కూడా ఒక జీవితమేనా అనేలా చేసింది. వాక్‌మెన్ మన వెంట తీసుకెళ్లగలిగిన మొట్టమొదటి మ్యూజిక్ సిస్టమ్. ఈ సిస్టమ్ వృద్ధి చెంది స్టీరియో రికార్డింగ్ చేసుకునే సదుపాయాన్ని కలిగించింది. కంప్యూటర్ మ్యూజిక్, ఎంపి 3 వచ్చిందాకా ఏకచ్ఛత్రాధిపత్యంతో మ్యూజిక్ ఇండస్ట్రీని ఏలింది వాక్‌మెన్. వాక్‌మెన్‌ను సృష్టించిన మోరిటాకు ఆ పేరంటే అస్సలు ఇష్టముండేది కాదు. వాక్‌మెన్ ఏమిటి అసహ్యంగా అనుకున్నాడు. పేరు మార్చుదామని ప్రయత్నిస్తే సలహాదారులు చాలా పాపులర్ అయిన పేరు వాక్‌మెన్ మార్చవద్దని సలహా ఇచ్చారు. వాక్‌మెన్ పేరు అలాగే ఉండిపోయింది.

ఒక చిన్న ఐడియా దూరాభారపు విమాన ప్రయాణాల్లో సొంత సంగీతం వినటం ఎలాగా అన్న ఆలోచన సంగీత ప్రపంచంలో సంచలనం కలిగించి, వేల కోట్ల వ్యాపారానికి మూలకారణమైంది. డబ్బు సంపాదించాలంటే ఐడియాలు కావాలి. అడ్డదార్లు కాదు మహాప్రభో !! వెళ్తూ ... తింటూ... తింటూ వెళ్తూ... రెండు బ్రెడ్ ముక్కలు.. వాటి మధ్య ఒక బర్గర్.. మరో చిన్న ఐడియా వేల కోట్ల వ్యాపారానికి, లాభాలకు నాంది పలికింది. అంతేకాదు నాగరిక జీవనానికి ఒక గుర్తుగా మారింది. అనగనగా ఒకప్పుడు కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఇద్దరు సోదరులు డిక్, మేక్ మెక్ డొనాల్డ్‌లకు ఒక ఆలోచన కలిగింది. ప్రయాణంలో ఉన్నప్పుడు సాధారణంగా రెండు భోజనాల మధ్య ఆకలవుతూ ఉంటుంది. అటువంటి సమయాల్లో ఏదో ఒక సామాన్యమైంది, సింపుల్‌గా ఉంటే చాలు. నక్షత్రాల హోటళ్ల విందులవసరం లేదు. వేడిగా, తాజాగా, రుచిగా, తొందరగా లభ్యమయ్యే ఆహారమైతే చాలు. కార్లోను, బస్సులోను ప్రయాణం చేస్తుంటే వాహనం దిగకుండా ఆ ఆహారం దొరికితే అది బోనస్ కింద లెక్క. అప్పుడు ఆ ఆహారం కోసం కస్టమర్లు పదేపదే వస్తారు... ఇదీ ఆ సోదరులు ఆలోచన.
http://www.index.hr/images2/McDWend1.jpg
బ్రహ్మాండమైన ఆలోచన ఈ ఆలోచనలోంచి ఉద్భవించిందే.. ప్రపంచంలోని అతి పెద్ద ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్. గ్రాండ్‌గా ఐదు నక్షత్రాల రెస్టారెంట్స్ కావివి.. సింపుల్‌గా, క్లీన్ గా, ఫాస్ట్‌గా మన ఆకలిని తీర్చే ఆహారం అమ్మే రెస్టారెంట్స్. మెక్‌డొనాల్డ్స్ కథ కూడా వాళ్లు అందించే ఆహారం లాగానే చాలా సింపుల్. ఈ అన్నదమ్ములతో చేయి కలిపాడు రేక్రాక్ అనే ఓ పెద్ద మనిషి. తర్వాత ఆయనే ఆ వ్యాపారాన్ని కొనుగోలు చేసి నేడు మనం చూస్తున్న మెక్‌డొనాల్డ్స్‌గా తీర్చిదిద్దాడు. మెక్‌డొనాల్డ్స్ అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న రెస్టారెంట్ చైన్. ఎన్నో చోట్ల, ఎల్ల వేళలా ఒకే రకంగా ఉండే సామర్థ్యం, ఆహారం.. ఇవీ మెక్‌డొనాల్డ్స్ విజయానికి మూల కారణాలు. ప్రపంచంలోని ఏ భాగనున్నా, మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్స్ ఒకే రూపంలో ఉంటాయి. వెంటనే క్షణంలో ఇట్టే గుర్తుపట్టేయొచ్చు. లోపలికెళ్లగానే ఒక రకమైన ఫుడ్, అదే సామర్థ్యం అన్ని చోట్ల ఒకేలా.http://www.thegimcrackmiscellany.com/wp-content/uploads/2008/09/whopper.jpg

కొత్త దేశాల్లో, కొత్త మనుషులు మధ్య ఒంటరితనం కాకుండా మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్స్‌ను ఒక చిరపరిచితమైన స్నేహితుడిగా భావిస్తాం మనం. రెండు బ్రెడ్ ముక్కలు, మధ్యలో ఓ బర్గర్... చిన్న ఐడియా... వేల కోట్లలో వ్యాపారం, లాభాలు. నేడు 119 దేశాల్లో 31 వేల పైచిలుకు మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి. రోజుకి 4 కోట్ల 7 లక్షల మంది పైనే కస్టమర్లు. ఇదండీ కథ.

ఇసుక రేణువులో ప్రపంచ దర్శనం
http://gigaom.files.wordpress.com/2008/09/kilby1lg.jpg
కిల్బీ, నోయిస్ అనే ఇద్దరు సైంటిస్టులు మైక్రోచిప్‌ను కనుగొని ఒక కొత్త ప్రపంచానికి శ్రీకారం చుట్టారు. మనం నేడు నివసిస్తున్న ఈ అధునాతన ప్రపంచంలోని కొత్త ఆవిష్కరణలో కెల్లా ఎంతో ముఖ్యమైంది ఈ మైక్రోచిప్ ఆవిష్కరణ. ఈ ఇద్దరు సైంటిస్టులు వేర్వేరుగా దీన్ని కనుగొని కొన్నేళ్లు కీచులాడుకొని చివ్వరికి మైక్రో చిప్ ఆవిష్కరణ తమ సమిష్టి కృషిగా నిర్ధారించుకొన్నారు. మైక్రోచిప్ ఎంత చిన్నదంటే దాన్ని ఒక చిరు చీమ నెత్తినపెట్టుకొని మోసుకెళ్లగలదు. అటువంటి అతి సూక్ష్మమైన చిప్ మీద ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌ని పొందుపరుస్తారు. ప్రతి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌కి సర్క్యూట్ ప్రాణంలాంటింది. ఆ ప్రాణం ఉంది ఈ చిన్న ఇసుక రేణువులో !! ఆశ్చర్యంగా ఉంది కదూ ! ఈ ప్రక్రియ ద్వారా ఒక గది నిండా ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను మన అరచేతిలో సులభంగా అమరే ఒక బుల్లి డివైస్‌లో కూర్చోపెట్టవచ్చు.

మనం ఇన్ఫర్మేషన్ ఏజ్ అని అంటూ ఉంటామే. దీని అవతరణకి మూల కారణం ఈ సిలికాన్ మైక్రోచిప్ వల్లనే. ఈ చిప్‌ను దీని వాడకంతో కూడిన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అమ్మకాలు 2004లో 179 అమెరికన్ బిలియన్ డాలర్లని అంచనా. అంటే 8 లక్షల కోట్ల రూపాయలకు పైబడే. ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆధారంగా అమ్ముడుబోతున్న ఎలక్ట్రానిక్ పరికరాల విలువ 1.1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. అంటే 50 లక్షల కోట్ల రూపాయలను మించి. ఈ అంచనాలు టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ కంపెనీ వారివి. ఇక్కడే కిల్బీ పనిచేశాడు. కిర్బీ కథనం ప్రకారం ఒక సమస్యను తొందరగా పరిష్కరించాలనే ప్రయత్నంలో ఉన్నాడతను.

ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌ని అతడు కనుగొని ఉండకపోతే, ఆయన కంపెనీ ఆయన్ను ఒక సమస్యాపూరితమైన పనిలోకి మార్చి ఉండేది. అది ఎలాగైనా తప్పించుకోవాలని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మీద దృష్టి సారించాడు. వేసవి కాలం సెలవులు కావటం వల్ల తను పనిచేసే టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో తన సహోద్యోగులందరూ సమ్మర్ హాలిడేస్ మీద వెళ్లారు. ఆయనొక్కడే ఉన్నాడు పనిలో. టిఆర్ రీడ్ అనే వ్యక్తి రాసిన పుస్తకం 'ది చిప్'లో ఇలా అంటాడు కిల్బీ.. నేను తొందరగా ఒక మంచి ఐడియాను కనుగొన లేకపోతే వేసవి సెలవుల తర్వాత నన్ను మైక్రో మాడ్యుల్ డిపార్ట్‌మెంట్‌లోకి మారుస్తారేమోననిపించింది. అది ఇష్టం లేదు కిల్బీకి .అందుకే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మీద దృష్టి కేంద్రీకరించాడు.
http://www.biographicon.com/images/Noyce_Robert.jpg
మరోపక్కన నోయిస్ తన పరిశోధనల ద్వారా మైక్రో చిప్‌ని తక్కువ ధరల్లో పెద్ద ఎత్తున (మాస్ మాన్యుఫ్యాక్చర్) తయారు చేసే పద్దతిని కనుగొన్నాడు. అంతేకాదు ఫెయిర్ చైల్డ్ సెమికండక్టర్ సంస్థలోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో పనిచేస్తుండగా చిప్‌ని కనుగొన్నాడు. కాలిఫోర్నియాలోని సిలికాన్ నేవీలో ఉన్న మొట్టమొదటి విజయవంతమైన సిలికాన్ సంస్థ ఈ ఫెయిర్ చైల్డ్ సెమికండక్టర్. వాళ్ల ప్రేరణలు ఎటువంటివైనప్పటికీ ఈ ఇద్దరు సైంటిస్టులు.. కిల్బీ, నోయిస్ మనందరి జీవిత విధానాన్ని మార్చివేసిన మైక్రోచిప్‌ని కనుగొన్నారు. ప్రతి ఆవిష్కరణకు ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక్కటి మటుకు ఉండదు.. డబ్బు.. ఒక ఆవిష్కరణ ఫలించటం ద్వారా దాని ఉప ఉత్పాదనగా, బై ప్రొడక్టుగా ప్రతిఫలంగా డబ్బు వస్తుంది తప్పితే కేవలం డబ్బు కోసం నూతన విధానాల ఆవిష్కరణ ఎక్కడా జరగలేదు. ఎవ్వరూ చేయలేదు.
- ఎజి కృష్ణమూర్తి