Sunday, November 13, 2011

సహార సంపన్నుడు - సుబ్రతా రాయ్‌ సహారా


Subrata_Roy_Sahara 
దేశంలోని అత్యంత ఐశ్వర్యవంతులలో ఒకరు సహారా గ్రూప్‌ అధినేత సుబ్రతా రాయ్‌ సహారా. దేశంలోని 25మంది అత్యంత శక్తిమంతులలో ఆయన ఒకరని ఇండియా టుడే మ్యాగజైన్‌ పేర్కొంది. 2004లో టైవ్గు మ్యాగజైన్‌ సహారా గ్రూప్‌ను ఇండియన్‌ రైల్వేస్‌ తర్వాత అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తున్న రెండవ అతిపెద్ద సంస్థగా పేర్కొడం విశేషం. ఇంతటి పెద్ద సంస్థ అరుున సహారా ఇండియా పరివార్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌, చైర్మన్‌ సబ్రతా రాయ్‌. ఇక 2011 జూన్‌ వరకు సహారా ఇండియా ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (ఎస్‌.ఐ.ఎఫ్‌.సి.ఎల్‌) 73,000 కోట్ల డిపాజిట్లను సమీకరించడం మరో విశేషం. ఒక నాన్‌ బ్యాంకింగ్‌ సంస్థ ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించడం అసాధారణం. దీంతో సుబ్రతా రాయ్‌ ఆధ్వర్యంలోని సహారా గ్రూప్‌ ప్రపంచంలోనే ప్రముఖ సంస్థగా గుర్తింపును తెచ్చుకుంది.

ఉత్తరప్రదేశ్‌ లక్నో ప్రాంతానికి చెందిన సుబ్రతా రాయ్‌ సహారా 1948 జూన్‌ 10న జన్మించా రు. ఆయన సహారా ఇండియా పరివార్‌ను 1978 లో ప్రారంభించారు.

సుబ్రతారాయ్‌ తన సహారా గ్రూప్‌ ఆధ్వర్యంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. సహారా రియల్‌ ఎస్టేట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్గ, సహారా హౌసింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్గల ఆధ్వర్యంలోని సహారా సిటీ ప్రాజెక్ట్‌లు దేశంలోని 217 నగరాలలో కొనసాగుతున్నారు.


వివిధ రంగాల్లో వ్యాపారాలు...
 Subrata-Roy
సుబ్రతారాయ్‌ తన సహారా గ్రూప్‌ ఆధ్వర్యంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. సహారా రియల్‌ ఎస్టేట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, సహారా హౌసింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ల ఆధ్వర్యంలోని సహారా సిటీ హోమ్స్‌ ప్రాజెక్ట్‌లు దేశంలోని 217 నగరాలలో కొనసాగుతున్నాయి. మీడియా రంగంలో కూడా సుబ్రతా రాయ్‌ ప్రవేశించి హిందీ న్యూస్‌ ఛానెల్‌ సమయ్‌ను ప్రారంభించారు. దేశంలోని 36 ప్రధాన నగరాల్లో సహారా సమయ్‌ ప్రాంతీయ న్యూస్‌ ఛానెల్స్‌ కొనసాగుతుండడం విశేషం.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌ సహారా వన్‌తో పాటు హిందీ మూవీ ఛానెల్‌ ఫిల్మీ సైతం సహారా గ్రూప్‌ ఆధ్వర్యంలో కొనసాగు తోంది. టూరిజం రంగంలోకి ప్రవేశించిన ఆయన సహారా గ్లోబల్‌ను స్థాపించి ట్రావెల్‌, టూరిజం సర్వీస్‌లను నిర్వహిస్తున్నారు. వైద్య,ఆరోగ్య రంగంలోకి ప్రవేశించిన సుబ్రతారాయ్‌ లక్నోలో అతిపెద్ద ఆసుపత్రిని నిర్మించారు. 120 క్రిటికల్‌ కేర్‌ బెడ్‌లతో కూడిన 350 బెడ్‌లతో 2009లో ఈ ఆసుపత్రి ప్రారంభమైంది. ఆతిథ్య రంగంలోకి కూడా ప్రవేశించిన సహారా గ్రూప్‌ ముంబయిలో ఎ-5 స్టార్‌ హోటల్‌ను ప్రారంభించింది.

ప్రభుత్వ సంస్థలు సహారా గ్రూప్‌ను ఆర్థికంగా దిగ్బంధించేందుకు పట్టుబిగిస్తున్నారు. 2010 నవంబర్‌ 24న సెబీ రెండు సహారా కంపెనీల మీద ప్రజల నుంచి ఎలాంటి నిధులూ సేకరించే వీలు లేకుండా నిషేధం విధించింది.

రికార్డు స్థాయిలో డిపాజిట్ల సేకరణ...

సహారా ఇండియా ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ 2011 జూన్‌ వరకు 73,000 కోట్ల డిపాజిట్లను సమీకరించి ఆశ్చర్యపరిచారు. విజయ్‌మాల్యా నియంత్రణలోని ఫార్ములా వన్‌ జట్టులో రాయ్‌ ఈ మధ్య రూ.500 కోట్లు పెట్టి 42.5 శాతం వాటాను కైవసం చేసుకున్నారు. గత ఏడాది చివరలో లండన్‌లోని ప్రఖ్యాత హోటల్‌ గ్రాస్‌వినార్‌ హౌస్‌ను ఆయన రూ. 3,250 కోట్లకు కొనుగోలుచేశారు.

సుబ్రతారాయ్‌ సహారా గ్రూప్‌ ఐపిఎల్‌లో పూణె వారియర్స్‌ ఇండియా టీంను గత ఏడాది మే 21న చేజిక్కించుకుంది. ఇందుకోసం 1702 కోట్ల రూపాయలను వెచ్చించారు. ఇక ఇండియన్‌ క్రికట్‌ టీంకు 2001 నుంచి సహారా గ్రూప్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులను కలిగి ఉండడం విశేషం. జాతీయ హాకీ జట్టుకు కూడా సహారా గ్రూప్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.

ఆర్థిక అగచాట్లు...

ప్రభుత్వ సంస్థలు సహారా గ్రూప్‌ను ఆర్థికంగా దిగ్బంధించేందుకు పట్టుబిగిస్తున్నాయి. కానీ సుబ్రతారాయ్‌ ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ సహారా గ్రూప్‌ను నిలబెడుతున్నారు. 2010 నవంబర్‌ 24న సెబీ రెండు సహారా కంపెనీల మీద ప్రజల నుంచి ఎలాంటి నిధులూ సేకరించే వీలు లేకుండా నిషేధం విధించింది. ఓ.ఎఫ్‌.సి.డిల రూపంలోని రూ.24,029 కోట్లను రెండు సహారా సంస్థలు ఆరువారాల్లో తిరిగి చెల్లించాలని ఈ ఏడాది అక్టోబర్‌ 18న శాట్‌ ఆదేశించింది. ఇక 73,000కోట్ల రూపాయల డిపాజిట్లను డిసెంబర్‌ 31 నాటికి చెల్లిస్తామని సహారా ఇండియా ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ వార్తా పత్రికలకు తెలిపింది.

సినీ రంగంలో...

సుబ్రతారాయ్‌ మోషన్‌ పిక్చర్స్‌ను ఏర్పాటుచేసి సినిమాల నిర్మాణం, మార్కెటింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌లను నిర్వహిస్తున్నారు. మోషన్‌ పిక్చర్స్‌ ఆధ్వర్యంలో బేవఫా, పేజ్‌ 3, సర్కార్‌, నో ఎంట్రీ, వాంటెడ్‌ చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. ఇక సుబ్రతారాయ్‌ సినిమాను రూపొందించేందుకు అవసరమైన పూర్తి సౌకర్యాలతో ఓ ఫిల్మ్‌ సిటీని నిర్మిస్తుండడం విశేషం.

సహారా ఇండియా ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ 2011 జూన్‌ వరకు 73,000కోట్ల డిపాజిట్లను సమీకరించి ప్రపంచంలోని ఆర్థికవేత్తలను నిర్ఘాంతపరిచారు. విజయ్‌మాల్యా నియంత్రణలోని ఫార్ములా వన్‌ జట్టులో ఈ మధ్య రూ.500 కోట్లు పెట్టి రాయ్‌ 42.5 శాతం వాటాను ెకైవసం చేసుకున్నారు. గత ఏడాది చివరలో లండన్‌లోని ప్రఖ్యాత       హోటల్  గ్రాస్‌వినార్‌ హౌస్‌ను ఆయన రూ. 3,250 కోట్లకు కొనుగోలుచేశారు.

క్రీడల్లోకి ప్రవేశించి...
 india-vijay-mal
క్రీడలకు పూర్తి ప్రోత్సాహాన్ని అందించేందుకు సుబ్రతారాయ్‌ ఎంతో కృషిచేస్తున్నారు. సుబ్రతారాయ్‌ సహారా గ్రూప్‌ ఐపిఎల్‌లో పూణె వారియర్స్‌ ఇండియా టీంను గత ఏడాది మే 21న చేజిక్కించుకుంది. ఇందుకోసం ఆయన 1702 కోట్ల రూపాయలను వెచ్చించారు. ఇక ఇండియన్‌ క్రికెట్‌ టీంకు 2001 నుంచి స్పాన్సర్‌షిప్‌ హక్కులను కలిగి ఉండడం విశేషం. జాతీయ హాకీ జట్టుకు కూడా సహారా గ్రూప్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. అంతేగాకుండా 91 మంది బాక్సింగ్‌, రెజ్లింగ్‌, ఆర్చరీ, షూటింగ్‌, ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ క్రీడాకారులను దత్తత తీసుకొని వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు వివిధ క్రీడాకారులకు ప్రతి ఏటా ‘సహారా ఇండియా స్పోర్ట్‌‌స అవార్డు’లను సుబ్రతారాయ్‌ అందజేస్తున్నారు.

No comments: