అంతర్జాతీయంగా మన దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన ఇంగ్లిషు రచయిత్రులలో శోభా డే ఒకరు. మోడల్‌గా, ఎడిటర్‌గా, కాలమిస్ట్‌గా, రచయితగా- విశేష అనుభవం గడించిన శోభా డే రాసిన తాజా పుస్తకం- శోభా ఎట్ సిక్స్‌టి. అరవై ఏళ్లు దాటిన తర్వాత ఎటువంటి మార్పులు వస్తాయనే విషయాన్ని తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ఈ పుస్తకం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. దీనిలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు....
"నాకు ఆరేళ్లు ఉన్నప్పుడు- ఎప్పుడో ఒకప్పుడు నాకు కూడా అరవై ఏళ్లు వస్తాయని ఊహించలేదు.
అది దాదాపు అసాధ్యమైన విషయం అనుకున్నా. 60 ఏళ్లు.. అంటే ముసలి అయిపోయినట్లే.. చనిపోవచ్చు కూడా.. అయితే 60 అంకె నన్ను ఎప్పుడూ భయపెట్టలేదు. ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్న రోజుల్లో ఆ ఆలోచనే ఎప్పుడూ రాలేదు. నా బుర్రలో మిగిలిన విషయాలు ఉండేవి తప్ప- వార్థక్యం గురించి ఎప్పుడైనా ఆలోచించలేదు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి.
పదాహారేళ్లు ఉన్నప్పుడు ఇరవై వచ్చిన వాళ్లు కూడా వయస్సు మీద పడినట్లు కనిపిస్తారు. మరి అరవై ఏళ్లు వచ్చినప్పుడు? అని మీరు అడగవచ్చు. నా వరకూ- 60 ఏళ్లు రావటం భయంకరమైన అనుభవం కాదు. ఒక విధంగా చూస్తే చాలా సంతృప్తినిచ్చే విషయం.
అరవై ఏళ్లు వచ్చినప్పుడు- నేను ఆనందపడ్డానని మాత్రం చెప్పను. అలాగని నిరాశ, నిస్పృహలు మాత్రం చెందలేదు. కొంత ప్రశాంతంగా అనిపించింది. నేను సీనియర్ సిటిజన్ అనే భావన నాలో వచ్చి చేరింది. ఇంకా నా తల మీద బోలెడంత జుట్టు ఉంది (ప్రతి ఇరవై రోజులకు ఒక సారి రంగు వేసుకుంటా.. కాని అది వేరే సంగతి). నా ముప్ఫై రెండు పళ్లకి వచ్చిన ఢోకా లేదు
. కళ్లద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం రాలేదు. ఇటీవలే నేను గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో కొద్ది భాగాన్ని గుండెపోటు రాకుండానే ఎక్కగలిగాను. నా కళ్ల చుట్ట్టూ వలయాలు, మొహం మీద, మెడ మీద ముడతలు పడిఉండచ్చు. అయితే ఏంటి? ఈ ఆలోచన రాగానే నాకు నవ్వొచ్చింది. నా మూడ్ మారింది. "ఎప్పుడూ నవ్వుతూనే ఉండు..ఇది జీవితంలో మరో అధ్యాయం. దీనిని ఎలా నడుపుతావనేది పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది
సమాజంలో ఉన్న కట్టుబాట్లు, ఇతర అంశాలకు తల వంచితే- భవిష్యత్తు చాలా బాధాకరంగా ఉంటుంది. నిన్ను నువ్వు సానుకూల దృక్పథంతో చూసుకుంటే- పరిస్థితులు మెరుగుగా ఉంటాయి..'' అని నాకు నేనే భరోసా ఇచ్చుకున్నా. ఈ భరోసా నా ఒక్కదానికి మాత్రమే కాదు. నా వయస్సులో ఉన్న మహిళలందరికి కూడా. నిరాశ చెందాల్సిన అవసరమేమీ లేదు.
"అరవై అంటే నలభై..'' అని గట్టిగా అనుకున్నా. చాలామంది మహిళలకు వయస్సు ఒక పెద్ద ఉచ్చు. వయస్సు మీద పడిన మహిళలను మన సమాజం చాలా ఘోరంగా చూస్తుంది. పురుషులకు ఈ సమస్య ఉండదు. ఒక మహిళ విలువను మనం ఆమె రూపురేఖల ఆధారంగా నిర్ధారిస్తాం.ఈ ప్రయాణం ఆధారంగా చూస్తే అరవై ఏళ్ల మహిళకు ఉండే విలువ తక్కువ.
ఇటీవల కాలంలో ఇరవై ఐదేళ్లు ఉన్న మహిళలు కూడా వయస్సు మీదపడటం వల్ల వచ్చే సమస్యల గురించి మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది. "మీకేం సమస్యలున్నాయి?'' అని వాళ్లని అడిగా. జుట్టు రాలిపోవటం, కళ్ల చుట్టూ వలయాలు, చలాకీగా ఉండలేకపోవటం, పొట్ట- ఇలాంటి సమస్యలు చెప్పారు. వాళ్లు చెబుతున్న మాటలను నేను నమ్మలేకపోయాను. నా కళ్లకు వాళ్లు అప్సరసల్లా కనిపిస్తున్నారు.
మరి వారు తమ గురించి తాము అంత తక్కువగా ఎందుకు అనుకుంటున్నారు? బహుశా- ఇటీవల కాలంలో చిన్న వయస్సులోనే వివిధ రంగాల్లో విజయం సాధిస్తున్న వారి సంఖ్య చాలా పెరిగిపోయింది. అందువల్ల 25 ఏళ్లు ఉన్నవారు కూడా మధ్యవయస్కుల్లా మధనపడుతూ ఉండచ్చు.
"సిగ్గు పడకుండా, జీవితాన్ని అనుభవించండి. ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా జీవితాన్ని అనుభవించే సమయం ఇదే. ప్రతి వారానికి ఒక సెక్స్ బ్రేక్ తీసుకోండి. దానిని రొమాంటిక్‌గా, మరిచిపోలేని అనుభవంగా మార్చుకోండి..''
సెక్స్‌ను ఆనందించండి...
మన సంస్కృతి సంప్రదాయాల పరంగా చూస్తే- వృద్ధులకు శృంగార వాంఛలు ఉండకూడదు. శృంగార ఆలోచనలను దరిచేరనివ్వకూడదు. సెక్స్‌ను మనం పునరుత్పత్తికి సాధనంగా మాత్రమే చూస్తాం. దానిని ఒక అందమైన అనుభవంగా పరిగణించం. పిల్లలు పుట్టిన తర్వాత ( అంటే పునరుత్పత్తి తర్వాత) శృంగార వాంఛలను తగ్గించుకోవాలని చెబుతారు.
ఇది నా దృష్టిలో చాలా పొరపాటు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నంత కాలం, శృంగారం పట్ల ఒక సానుకూలవైఖరి ఉన్నంత కాలం, సమాజంలో కట్టుబాటు కుంగదీయనంత కాలం- 60వ దశకంలో కూడా ఆనందంగానే గడపవచ్చు. అర్థం చేసుకొని ఆనందించే భార్య లేక భర్త ఉంటే ఇంకా మంచిది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకున్నవారైతే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
ఒకరి శారీరక, మానసిక అవసరాలు మరొకరికి తెలియటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా ఉన్నా తొలగిపోతాయి. అంతే కాకుండా శృంగారంలో తాను ధీరుడినని రుజువు చేసుకోవాల్సిన అవసరం భర్తకు కాని.. తాను భర్తను అన్ని విధాలుగా సుఖపెట్టలేకపోతున్న భావన భార్యకు కాని ఉండదు. అందువల్ల ఎటువంటి ఆందోళన లేకుండా ఆనందించటానికి ఈ వయస్సు పనికొస్తుంది. నాకు తెలిసిన కొందరు దంపతులు- పెళ్లైన కొత్తలో కన్నా- 50 ఏళ్లు దాటిన తర్వాతే శృంగారంలో ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నామని చెబుతూ ఉంటారు.
చాలాసార్లు రుతుక్రమం ఆగిపోయిన తర్వాత- మహిళలు తమలో ఉన్న శృంగారభావనలను వెలికి తీయగలుగుతారు. గర్భం వస్తుందనే భయం లేకపోవటం వల్ల శృంగార అనుభూతులను ఆనందించగలుగుతారు. ఎక్కువ మందితో సంబంధాలు లేని దంపతులు- అరవై, డెబ్బైలలోనే ఎక్కువగా శృంగార భావనలను అనుభవించగలుగుతారని, ఆరోగ్యంగా కూడా ఉంటారని సర్వేలు చెబుతున్నాయి
అయితే ఈ వయస్సులో ఉన్నవారికి- "మన పిల్లలు చూస్తే ఎలా భావిస్తారు? మనవలు ఎలా ఫీల్ అవుతారు? ఈ వయస్సులో సెక్స్ కోర్కెలు కలగడం అసహజం కదా..'' వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఈ వయస్సులో ఉన్నవారికి ఖాళీ సమయం ఎక్కువగా ఉంటుంది.
రోజూ ఏదో ఒక పని కోసం పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉండవు. అయితే భార్యాభర్తల్లో శారీరకంగా అనేక మార్పులు వచ్చి ఉండచ్చు. భార్యలు పెళ్లిఅయిన కొత్తలో ఉన్నంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. భర్తలకు బట్టతలలు వచ్చి ఉండచ్చు. అయినా దంపతుల మధ్య ప్రేమ ఉంటే- అది ఈ లోపాలన్నింటిని కప్పివేస్తుంది.
సంప్రదాయానికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే సమాజాలు వృద్ధుల్లో సెక్స్ వాంఛలను హర్షించవు. వారికి అటువంటి భావనలు కలుగుతున్నాయనే విషయాన్నే తట్టుకోలేవు. అయితే- ఆ వయస్సులో సెక్స్ వాంఛలు ఎందుకు ఉండకూడదు? మనవలు పుట్టినంత మాత్రాన వారిలో వాంఛలు ఇంకిపోవాలా? పాశ్చాత్య సమాజాలు ఈ విషయం మీద భిన్నంగా ఆలోచిస్తాయి
. అక్కడ ఇతరులకు సంబంధించిన అంశాలపై జడ్జిమెంట్స్ ఇవ్వరు. ఒక వేళ వృద్ధులు సెక్స్‌ను అనుభవిస్తున్నా పెద్దగా పట్టించుకోరు. మన దేశంలో ఈ విషయం గురించి మాట్లాడటానికే ఎవరూ ఇష్టపడరు. ప్రస్తుతం మనమున్న సమాజంలో పిల్లలకు పెళ్లిళ్లు అయిన తర్వాత- మహిళలు సెక్స్‌కు సంబంధించిన అంశాల గురించి మాట్లాడితే చిత్రంగా చూస్తారు. పురుషులు మాట్లాడితే- వారిని కామ వాంఛితులుగా ముద్రవేస్తారు.
అయితే సమాజం ఏదో అనుకుంటుందని మధురమైన అనుభూతులను వదులుకోవటం సరైనది కాదు. కొందరు మహిళలకు నిజంగానే సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవచ్చు. అలాంటి వారి భావనలను కూడా మనం గౌరవించాలి....
నేను పైన చెప్పిన అనుభవాలను కోల్పోతున్నామనే భావన ఉన్నవారికి మాత్రం నేను ఇచ్చే సలహా ఒకటే. సిగ్గు పడకుండా, జీవితాన్ని అనుభవించండి. ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా జీవితాన్ని అనుభవించే సమయం ఇదే. ప్రతి వారానికి ఒక సెక్స్ బ్రేక్ తీసుకోండి. దానిని రొమాంటిక్‌గా, మరిచిపోలేని అనుభవాలుగా మార్చుకోండి..

No comments:
Post a Comment