అబద్ధం...నేటి నిజం!
అబద్ధం చెప్పటం కొందరికి ప్రాణావసరం. మరి కొందరికి సరదా. ఇంకొందరికి ఒక జీవన విధానం. తరచి చూస్తే- మన చుట్టూ అనేక అబద్ధాలు. రోజూ వీటిలోనే మనం బతుకుతూ ఉంటాం. జీవితంలో ఒక్క అబద్ధం కూడా చెప్పని వ్యక్తి ఎవరూ ఉండరు. అసలు మనం ఎందుకు అబద్ధం చెబుతాం? దానికి కారణాలేమిటి? ఈ విషయాలను డోరతి రో- 'వై వుయ్ లై' అనే పుస్తకంలో కూలంకషంగా చర్చించారు. అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్న ఈ పుస్తకం నుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు.
"అవతల వ్యక్తులను మోసం చేయటానికి ఉపయోగించే పదాలను కాని, చర్యలను కాని అబద్ధాలు అని మనం పిలుస్తాం. చాలా సార్లు మనం ఇతరులకు వాస్తవం చెప్పం. అబద్ధం చెబుతాం. కొన్ని సార్లు మనకు మనమే అబద్ధం చెప్పుకుంటాం. అబద్ధం అనే పదం చాలా చిన్నదే. కాని ఇది చాలా బలమైన పదం.
ప్రయోగిస్తే మనసులోకి సూటిగా దిగుతుంది. అందుకే ఎక్కువ మంది ఈ పదాన్ని ఉపయోగించటానికి ఇష్టపడరు. భాషాపరంగా చూస్తే అబద్ధానికి కచ్చితమైన అర్థం ఏదీ లేదు. వివిధ సమాజాల్లో దీనిని విభిన్నరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఒక సారి రోమ్ విశ్వవిద్యాలయంలో ఫెరారీ కంపెనీ ప్రెసిడెంట్, ఫియట్ కంపెనీ ఛైర్మన్ ల్యూకా కార్డిరో-మోంటిజీమోలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. "నేను స్కూల్లో ఉన్నప్పుడు కాపీ చేయటంలో ప్రపంచ ఛాంపియన్‌నని చెప్పొచ్చు.
ఈ విషయంలో నాకు ఎవరూ పోటీ ఉండేవారు కాదు. తెలివైన వారి పక్కన కూర్చోవటానికి ఏదో ఒక మార్గం వెతికేవాడిని. వారి దగ్గర కూర్చుని అంతా కాపీ కొట్టేవాడిని'' అని ల్యూకా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. ఈ అంశం గురించి ఫ్రాంక్స్ ఎక్స్ రోకా అనే పాత్రికేయుడు వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ఒక వ్యాసం రాశాడు. 'అమెరికాలో విద్యార్థులు ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని సేకరించి ఉపయోగించుకుంటూ ఉండొచ్చు.
కాని పక్క విద్యార్థుల నుంచి కాపీ కొట్టి.. దానిని తమ సొంత ప్రతిభగా ప్రదర్శించుకోరు. ఇది చాలా గర్హించదగ్గ విషయం''అని ఆ వ్యాసంలో వ్యాఖ్యానించాడు. అంతేకాదు 'ఇటలీలో కాపీ చేయటాన్ని ఒకరి పట్ల విశ్వాసానికి, విద్యార్థుల మధ్య బంధానికి చిహ్నంగా భావిస్తూ ఉండొచ్చు. చాలాసార్లు మోసగాళ్లు జీవితంలో పైమెట్టు ఎక్కలేకపోవచ్చు
. కానీ కాపీరాయుళ్ల మాత్రం పైకి వస్తారనటానికి నిదర్శనాలు ఉన్నాయి' అని ల్యూకాని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద దుమారం లేపాయి. ఇటలీకి చెందిన అనేకమంది మేధావులు ఈ వ్యాఖ్యలను ఖండించారు...
ఎందుకు?
అబద్ధం ఆడి తప్పించుకు పోవచ్చని చాలామంది భావిస్తూ ఉంటారు. చాలా మందికి ఈ అలవాటు చిన్నప్పుడే అబ్బుతుంది. కొందరు చెప్పే అబద్ధాలు ఇట్టే తెలిసిపోతాయి. అవి అబద్ధాలని మనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం ఉండదు. వీటన్నిటికన్నా ప్రమాదకరమైన అంశం- మనకు మనం అబద్ధం చెప్పుకోవటం.
ముందుగా ఒక విషయాన్ని నిజమని నమ్మటం మొదలుపెట్టి దానిని ఇతరులకు చెప్పటం మొదలుపెడతారు. అది బయటకు వస్తుందేమోననే భయంతో- వాస్తవాన్ని కప్పిపుచ్చటానికి మరొక అబద్ధం చెబుతారు. అది అబద్ధమనే అనుమానం రాకుండా ఉండటానికి ఇంకొకటి చెబుతారు. ఇలా ఒక వలను అల్లుతారు.
కొందరు మంచి పని చేయటం కోసం అబద్ధం చెప్పామనో.. ఒక ఉన్నతమైన విలువను కాపాడటం కోసం అబద్ధం చెప్పామనో కూడా చెబుతూ ఉంటారు. కాని చాలాసార్లు అవతల వ్యక్తులు వీటిని గుర్తిస్తారు.అయినా భయం వల్లనో, గౌరవం వల్లనో బయటకు చెప్పరు.
మౌనమే నీ భాష..
కుటుంబ జీవితం ఒక పెద్ద అబద్ధాల పుట్ట. అయితే కొందరు చాలాసార్లు అబద్ధం చెప్పాల్సిన పరిస్థితుల్లో మౌనంగా ఉండిపోతారు. అలాంటి సమయాల్లో మౌనమే పెద్ద ఆయుధంగా మారుతుంది. "ఎంత తక్కువ మాట్లాడితే- పరిస్థితులు అంత త్వరగా చక్కబడతాయి'' అనే సిద్ధాంతాన్ని కూడా చాలామంది పాటిస్తూ ఉంటారు.
సాధారణంగా కుటుంబంలో అతి శక్తివంతమైన వ్యక్తి అబద్ధాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు- మౌనాన్ని ఒక బలమైన ఆయుధంగా వాడుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు మా ఇంట్లో మా అమ్మకు ఏదైనా విషయం చెప్పటం ఇష్టం లేనప్పుడు మౌనంగా ఉండిపోతుంది.
నన్ను ఏదైనా విషయంలో శిక్షించాలన్నా.. నేను విమర్శలు చేస్తున్నప్పుడు అడ్డుకోవాలన్నా ఆమె ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తుంది. మా ఇంటికి సంబంధించిన చాలా రహస్యాలు ఇప్పటికీ నాకు తెలియదు. ఎప్పుడైనా రహస్యాల వైపు సంభాషణలు మళ్లినప్పుడు- అమ్మ మౌనం వహిస్తుంది. కొన్నిసార్లు అబద్ధం కూడా చెబుతుంది. ఆ విషయం ఆమెకు కూడా స్పష్టంగా తెలుసు.
'పిల్లలకు అన్ని చెప్పలేం కాబట్టి అబద్ధం చెప్పినా పర్వాలేదు' అని ఆమె నమ్ముతుంది... ఎవరికైనా చెప్పవచ్చు కానీ..
మనకు మనం అబద్ధాలు చెప్పుకోవటం మొదలుపెట్టినప్పుడు వాస్తవానికి దూరంగా జరిగిపోవటం మొదలుపెడతాం. తెలియకుండానే కళ్లకు గంతలు కట్టేసుకుంటాం. "కొందరికి కొంత కాలం పాటు మనం అబద్ధాలు చెప్పవచ్చు. కాని ఆ తర్వాత అది సాధ్యం కాదు. అయితే మనకు మనం ఎప్పటికీ అబద్ధాలు చెప్పుకుంటూ బతికేయవచ్చు'' అంటాడు ప్రముఖ మానసిక శాస్త్రవేత్త సిమన్ హోగర్ట్.
కొత్త జీవులను కనుక్కోవటానికి జీవ శాస్త్రవేత్త తన అధ్యయనాలను కొనసాగించవచ్చు. కొత్త రసాయనాలను కనుగొనటానికి రసాయన శాస్త్రవేత్త పరిశోధనలు చేయవచ్చు. కాని మనుషుల్లో కొత్త రకం ప్రవర్తనను కనిపెట్టడం చాలా కష్టం. మన చుట్టూ పరిస్థితులు మారుతూ ఉంటాయి. కాని మనం మాత్రం తరతరాలుగా ఒకే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం...
మనకు తెలుసు..
అబద్ధం ఎలా ఉంటుందో మనకందరికీ తెలుసు. ప్రతిరోజూ మనకు అనేక మంది అబద్ధాలు చెబుతూ ఉంటారు. అబద్ధాలు చెప్పటంలో వ్యక్తులు, సంస్థలు అనే తేడా కూడా ఏమీ లేదు. చాలాసార్లు ఇలాంటి అబద్ధాల వలన మనకు హాని కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం- ప్రతి కంపెనీ తన వార్షిక ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది.
కంపెనీ సైజు పెరిగే కొద్దీ వార్షిక నివేదిక కూడా ఆకర్షణీయంగా తయారవుతూ ఉంటుంది. దీనిలో షేర్‌హోలర్డ్స్‌ను ఆకట్టుకొనే అంశాలెన్నో ఉంటాయి. ఈ నివేదికలు చదవటానికి చాలా ఆసక్తికరంగా కూడా ఉంటాయి. అయితే ఈ భాష వెనక అనేక అబద్ధాలను కప్పిపెడతారు. దీనికి సంబంధించిన ఒక ఉదాహరణను చూద్దాం.
2007వ సంవత్సరపు రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌లాండ్ వార్షిక నివేదికను 2008, ఫిబ్రవరి 27వ తేదీన విడుదల చేశారు. "రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌లాండ్ (ఆర్‌బీఎస్) చాలా బాధ్యతాయుతమైన కంపెనీ. మా అధ్యయనాల ఆధారంగా షేర్‌హోల్డర్స్‌కు లాభదాయకమైన వాటిని ఎంపిక చేస్తాము..'' అని ఉంది. కాని ఆ ఏడాది షేర్ హోల్డర్స్‌కు తెలియకుండా ఆ బ్యాంకు రిస్కుతో కూడిన అనేక పెట్టుబడులు పెట్టింది.
చివరకు బ్యాంకు దివాళా తీసే పరిస్థితికి చేరుకుంది. బ్రిటిష్ ప్రభుత్వం సాయంతో తిరిగి కోలుకుంది. దీని ఆధారంగా చూస్తే- సాధారణంగా ఇలాంటి నివేదికల్లో బయటకు చెప్పేది ఒకటి.. వాస్తవ పరిస్థితి మరొకటి ఉంటుందని తేలుతుంది.

వై వుయ్ లై
రచయిత్రి: డోరతి రో
ప్రచురణ: ఫోర్త్ ఎస్టేట్, లండన్
ధర: రూ. 350
అన్ని ప్రముఖ పుస్తక దుకాణాల్లోను దొరుకుతుంది

No comments:
Post a Comment