ఏదో పని మీద కొడుకు గదిలోకి వెళ్లిన తండ్రికి స్టడీ టేబుల్ మీద కొడుకు రాసిన ఉత్తరం కనిపించింది. ఏంటా అని తీసి చదవడం మొదలుపెట్టాడు తండ్రి..
డియర్ డాడ్...
ఈ విషయాలన్నీ మీకు చెప్పాలంటే బాధగానే ఉంది. కాని చెప్పక తప్పడం లేదు. నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నాను. రోజూ ప్రతి చిన్న విషయానికి నువ్వూ, అమ్మా పోట్లాడుకోవడాలు, అరుచుకోవడాలు.. నన్ను చాలా డిస్ట్రర్బ్ చేస్తున్నాయి. ఇంట్లో ప్రశాంతత కరువవుతోంది. దాన్ని బయట వెదుక్కునే ఆరాటంలో ఉన్నాను. నన్ను ప్రేమగా చూసుకోవడానికి నా కన్నా పెద్దదైన ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది. సరదాలు, అల్లర్లు పంచుకోవడానికి ఫ్రెండ్స్, పబ్బులు, క్లబ్బులు ఉండనే ఉన్నాయి. చదువు సంధ్యలు, భవిష్యత్ బెంగలు.. గట్రా మరిచిపోయి ఆనందంగా... గాల్లో తేలిపోవడానికి కొకైనూ అందుబాటులో ఉంది.

వీటన్నిటినీ అనుభవిస్తూ....
హాయిగా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను డాడీ.... .
నా కోసం వెదకొద్దు.
పిఎస్: డాడీ.... పైన నేను రాసిన విషయాలన్నీ నా స్టడీ టేబుల్ సెంటర్ డ్రాలో ఉన్న నా ప్రోగ్రెస్ రిపోర్ట్‌లోని మార్కులకన్నా భయంకరమైన విషయాలు. అవన్నీ అబద్దం . నేను ఎక్కడికీ వెళ్లలేదు. ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. మంచి, చెడుల విచక్షణ నాకుంది. విచక్షణను అందించేదే కదా...విజ్ఞానం. మరి దీనికి మార్కులు కొలమానమా డాడీ....? ఇది అర్థం చేసుకున్నాక, మీ కోపం తగ్గాక కాల్ చేయండి.
క్షణంలో మీ ముందుంటాను.
లవ్ యూ డాడీ....
మీ అబ్బాయి

No comments:
Post a Comment