'వీడికి ఫ్రెండ్స్ చాలా ఎక్కువయ్యారు... అందుకే చదువు తక్కువయ్యింది. ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్‌తో కబుర్లే గానీ చెప్పిన మాట ఒక్కటీ పట్టించుకోడు కదా......' అంటూ తమ పిల్లల గురించి కంప్లెయింట్ చేసే తల్లిదండ్రులను చాలామందిని చూస్తూనే ఉంటాం.
స్నేహితులు ఎక్కువగా ఉంటే పిల్లలకు చదువు ధ్యాస తక్కువగా ఉంటుందని, ఆటలపైనే మోజుంటుందని చాలామంది తల్లిదండ్రుల అభిప్రాయం. కానీ ఇటీవలి అధ్యయనాలు ఇందుకు విరుద్ధమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. బడికి వెళ్లే పిల్లలకు ఎంత ఎక్కువమంది ఫ్రెండ్స్ ఉంటే చదువులో వాళ్లు అంత ముందంజలో ఉంటారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు అధ్యయనకారులు.
పిల్లలు ఎక్కడికి వెళ్లినా ఇట్టే ఫ్రెండ్‌షిప్ చేసేస్తారు. ఇంటి చుట్టుపక్కల, బంధువుల పిల్లలు ఇలా వారి జాబితా పెద్దదే. వయసుతో పనిలేకుండా తమ కన్నా పెద్దవాళ్లతో కూడా ఫ్రెండ్‌షిప్ చేసేవాళ్లూ ఉంటారు. అయితే ఒకే స్కూల్‌లో, ఒకే క్లాస్‌లో చదువుతున్న పిల్లల మధ్య ఉన్న స్నేహం వారి అభ్యున్నతికి మరింత బాగా సహకరిస్తుందంటున్నారు
కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన మెలిస్సా విట్‌కోవ్. స్కూల్‌కి సంబంధించిన పనులు, హోమ్‌వర్క్, పాఠాల్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు, టీచర్లు చేయించే యాక్టివిటీస్.... ఇలా వీళ్లకి ఒకే రకమైన లక్ష్యాలు, ఇబ్బందులు ఉంటాయి. వీరంతా ఒకే రక మైన వాతావరణంలో పెరగడం, చదువుకోవడం వల్ల ఒకరి సమస్యలు ఒకరు షేర్ చేసుకోగలుగుతారు.
సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. కంప్లీట్ చేయాల్సిన పనులు ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. కాబట్టి చదువులో ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు ఒకరికొకరు సహకరించుకోవడం సులువవుతుంది. వారి మిత్రబృందంలో సభ్యులు ఎక్కువగా ఉంటే ఎక్కువ అభిప్రాయాలను షేర్ చేసుకోగలుగుతారు.
అందరికీ ఒకే సమస్య రావడం వల్ల దాని గురించి అందరూ చర్చిస్తారు. అలాంటి చర్చల వల్ల పిల్లల మానసిక పరిణతి పెరుగుతుంది. సమస్యను ఎదుర్కోగలిగే ధైర్యం అలవడుతుంది. చదువులో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా అధిగమించగలుగుతారు. తద్వారా ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతారు.
అందుకే ఫ్రెండ్స్‌తో ఎక్కువ సమయం ఉండొద్దని పిల్లల్ని గిరిగీసి కూర్చోపెట్టవద్దని సూచిస్తున్నారు మానసిక నిపుణులు. సో! ఇకనుంచీ మీరు కూడా మీ పిల్లల స్నేహాన్ని ప్రోత్సహించండి. అలాగని చెడ్డ స్నేహాలను కూడా ఓ కంట కనిపెడుతూ ఉండండి మరి.

1 comment:
Very niceeeeeeeeeeeee
Post a Comment