జర్నలిజం పట్ల ఆమెకున్న మక్కువ అతి చిన్న వయస్సులోనే ఆమెను అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా చేసింది. ఆ శిఖరాన తాను నిలబడి, తన పత్రికను నిలబెట్టడానికి ఆమె చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పురుషాధిక్య ప్రపంచమైన జర్నలిజంలో ఆమె ఎంత ఎత్తుకు ఎదిగినా పరిస్థితులు చివరకు ఆమెను కూలబడేలా చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యూస్ ఇంటర్నేషనల్ ఫోన్ టాపింగ్ కేసులో అరెస్టు అయ్యి బెయిల్‌పై విడుదలైన రెబెకా మేరీ బ్రూక్స్ కథ ఇది...
మీడియా మొగల్ రూపర్ట్ మర్డాక్‌కు నలుగురు కుమార్తెలే అయినప్పటికీ బ్రూక్స్ అయిదవ కుమార్తెలా వ్యవహరించేది. ఆయనకు అత్యంత సన్నిహితురాలైన బ్రూక్స్‌ను ఆయన ఈ అప్రతిష్ట నుంచి కాపాడలేకపోయారు. మర్డాక్ సామ్రాజ్యంలో ఎదిగిన బ్రూక్స్ ను ఆయన నుంచి ఎవరూ విడదీయలేరని లండన్ పత్రికలు పేర్కొంటూ ఉంటాయి.
బ్రూక్స్ అసలు పేరు రెబెకా మేరీ వేడ్. లాంక్‌షైర్‌లోని వారింగ్టన్‌లో 1968, మే 27న జన్మించిన బ్రూక్స్ డేర్స్‌బరీలో పెరిగింది. పద్నాలుగేళ్ళ వయసులోనే తాను జర్నలిస్టు కావాలని నిర్ణయించుకున్న రెబెకా వారింగ్టన్‌లోని ఆపిల్‌టన్ హాల్ కౌంటీ గ్రామర్ స్కూల్లో చదువుకుంది. లండన్ కాలేజ్ ఆఫ్ ప్రింటింగ్‌లో చదువుకున్న బ్రూక్స్ తన ఇరవయ్యవ ఏట నుం చే న్యూస్ ఆఫ్ ది వరల్డ్‌లో పని చేయడం ప్రారంభించింది. ఆమె జర్నలిజానికి చేసిన సేవలకు 2010వ సంవత్సరంలో బ్రూక్స్ లండన్‌లోని యూ నివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ ఆనరరీ ఫెలోషిప్‌ను ప్రకటించింది.
హైస్కూల్ చదువు పూర్తి చేసిన వెంటనే పారిస్‌లో ఆమె లా ఆర్కిటెక్చర్ డీ అజైర్డ్ అనే ఫ్రెంచ్ పత్రికలో పని చేసింది. అనంత రం ఎడ్డీ షాకు చెందిన మెస్సెంజర్ గ్రూప్‌లో పని చేసింది. తర్వాత న్యూస్ ఆఫ్ ది వరల్డ్ సండే పత్రికలో సెక్రెటరీగా 1989లో చేరి అనంతరం ఫీచర్ రైటర్‌గా ఎదిగింది. టివి సీరియళ్ళ నిపుణుడు క్రిస్ స్టేసీతో కలిసి ‘ఎ టు జెడ్ ఆఫ్ సోప్స్’ అనే శీర్షి కను సండేకు పత్రికకు అందించి, అంతిమంగా పేపర్‌కు డెప్యూటీ ఎడిటర్‌గా ఎదిగింది. దాదాపు పదేళ్ళ అనంతరం ఆమె సన్ పత్రికకు డి ప్యూటీ ఎడిటర్‌గా బదిలీ అయింది. ఈ సమయంలోనే ఆమె పేజ్ త్రీ గర్ల్స్ శీర్షికను ఆపించేందుకు ప్రయత్నించిందని ఆరోపణలున్నాయి. రెండేళ్ళ తర్వాత అంటే 2000వ సంవత్సరంలో ఆమె న్యూస్ ఆఫ్ ది వరల్డ్‌కు ఎడిటర్‌గా నియమితురాలైంది. ఒక బ్రిటిష్ జాతీయ పత్రికకు అతిపిన్న వయస్సులోనే ఎడిటర్ అయిన గౌరవం ఆమెకు దక్కింది.
సారా పేన్ అనే ఎనిమిదేళ్ళ బాలిక హత్యానంతరం ‘నేమింగ్ అండ్ షేమిం గ్’ పేరుతో వివాదాస్పద ప్రచారానికి శ్రీకారం చు ట్టింది. ముఖ్యంగా పిల్లలపై అత్యాచారాలు చేసి శిక్షించబడ్డ వారిపై ఈ ప్రచారం నడిచింది. పత్రిక తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆగ్రహించిన ప్రజలు అనుమానించిన ప్రతివారిని తన్నేదాకా వెళ్ళడంతో దానిని ప్రారంభించినందుకు ఆమె ఎన్నో విమర్శలను ఎదుర్కొనవలసి వచ్చిం ది. అయినప్పటికీ పత్రిక అమ్మకాలు ఆమె నేతృత్వంలో స్థిరంగా నిలబడ్డాయి. అయితే ప్రత్యర్ధి పేపర్లు ది పీపుల్, ది సండే మిర్రర్ అమ్మకాలు మాత్రం బాగా పడిపోయాయి.

అనంతరం 2003లో ఆమె సన్ పత్రిక తొలి మహిళా ఎడిటర్‌గా బాధ్యత లు స్వీకరించింది. ఈ సమయంలో ఆమె ప్రచురిం చిన కథనాలు కూడా వివాదాస్పదమయ్యాయి. అదే సంవత్సరం హౌస్ ఆఫ్ కామన్స్ సెలెక్ట్ కమిటీ వ్యక్తిగత విషయాలు, ప్రైవసీకి సంబంధించి చేసిన దర్యాప్తులో తన పత్రిక సమాచారం కోసం పోలీసు అధికారులకు లంచాలు ఇచ్చినట్టు బ్రూక్స్ పే ర్కొంది. ఇవే ప్రస్తుత ఆరోపణలకు ఊతమయ్యాయి.
ఆమె ఆర్గనైజేషన్ వుమెన్ ఇన్ జర్నలిజంకు చైర్ పర్సన్‌గా, గార్డియన్ స్టూడెంట్ మీడియా అవార్డులకు జడ్జిగా వ్యవహరించింది. 2009లో ఆమె న్యూస్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమితురాలైంది.
2002వ సంవత్సరంలో నటుడు రాస్ కెంప్‌ను వివాహం చేసుకున్న బ్రూక్స్ 2009లో అతడి నుంచి విడాకులు పొంది రేస్ హార్స్ ట్రైనర్, రచయిత అయిన ఛార్లీ బ్రూక్స్‌ను వివాహం చేసుకున్నది.
ఫోన్ హాకింగ్ స్కాండల్:
న్యూస్ ఆఫ్ ది వరల్డ్ పత్రికకు సెలబ్రిటీల మొబైల్ ఫోన్లకు వచ్చే మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌ను వినే అలవాటు ఉన్నట్టు పోలీసు దర్యాప్తులో తేలడంతో వివాదం మొదలైంది. పత్రిక రిపోర్టర్ క్లైవ్ గుడ్‌మన్‌తో పాటు మరొకరిని 2006లో రాచకుటుంబ సభ్యులకు వచ్చిన ఫోన్ మెసేజ్‌లను ఇంటర్సెప్ట్ చేసినందుకు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అప్పటి నుంచీ వివాదం నలుగుతున్నప్పటికీ 2011లో అది బద్దలైంది. గార్డియన్ పత్రిక ఫోన్ హ్యాకింగ్ ఉదంతాలపై ప్రత్యేక కథనాలు ప్రచురించింది.
ముఖ్యంగా 2002లో బ్రూక్స్ పత్రిక ఎడిటర్‌గా ఉండగా కనిపించకుండా పోయి, హత్యకు గురైన మిల్లీ డౌలర్ అనే విద్యార్ధిని కి ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన మెసేజ్‌లను యాక్సెస్ చేసినట్టు గార్డియన్ తన కథనంలో ఆరోపణలు చేసింది. వస్తున్న మెసేజ్‌లతో ఫోన్ ఇన్‌బాక్స్ నిండిపోవడంతో కొన్నింటిని డిలీట్ చేసి కొత్తవాటిని విన్నారని, మెసేజ్‌లు డిలీట్ కావడంతో మిల్లీ తల్లిదండ్రులు ఆమె సజీవంగా ఉందని భావించారని తన కథనంలో పత్రిక పే ర్కొంది. ఈ ఉదంతంపై బ్రూక్స్ తాజాగా మిల్లీ తల్లిదండ్రులకు క్షమాపణ లు చెప్పుకుంది. అయినప్పటికీ ఇవేవీ ఆమెను కాపాడలేకపోయాయి.
బ్రూక్స్‌కు ఉన్న స్నేహాలు సాధారణమైనవి కావు. ఆమె టోనీ, షెరీ బ్లెయిర్‌లకే కాదు ప్రస్తుత గార్డన్ బ్రౌన్‌కు, డేవిడ్ కామరూన్‌కు స్నేహితురాలు. ఆమె నివాసం ప్రస్తుత ప్రధాని కామరూన్ ఇంటికి సమీపంలోనే కావడంతో ఆమె ఆయన కుటుంబంతో మరింత స్నేహంగా ఉంటుంది. రాజకీయ నాయకులతో ఆమె సాన్నిహిత్యం అనేక విమర్శలకు తావిచ్చింది. న్యూస్ ఇంటర్నేషనల్ ఫోన్ హ్యాకింగ్ వివాదం చిలికి చిలికి గాలి వాన కావడంతో ఆమె జులై 15వ తేదీన తన పదవికి రాజీనామా చేసింది. న్యూస్ ఆఫ్ ది వరల్డ్ పత్రికకు ఆమె ఎడిటర్‌గా ఉన్న సందర్భంలోనే ఈ హ్యాకింగ్ జరిగినట్టు వార్తలు రావడం, అందులో ఆమె పాత్రపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె ఆ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. బ్రూక్స్ ఉదంతం పాశ్చా త్య ప్రెస్‌లో సంచలనాన్ని రేపటమే కాదు జర్నలిజంలో నైతిక విలువల గు రించిన బ్లాగుల్లో చర్చలకు శ్రీకారం చుట్టింది. సమాజానికి నాలుగవ స్తం భమైన ప్రెస్ బాధ్యతలేమిటో గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు.

ఆసీస్ క్రికెట్ లెజెండ్‌గా పేరుగాంచిన డాన్ బ్రాడ్‌మన్‌ను, నేటి కాలంలో మాస్టర్ బ్లాస్టర్‌గా పేరుతెచ్చుకున్న సచిన్ టెం డూల్కర్‌ను క్రికెట్ చరిత్రలోనే బ్యాటింగ్ దిగ్గజాలుగా పేర్కొంటారు. సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ తన కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాట్స్‌మన్‌గా పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించారు. ఆయన 1920 దశకం చివరి కాలం నుంచి 1940 చివరి కాలం వరకు క్రికెట్‌లో బ్యాటింగ్ దిగ్గజంగా ప్రఖ్యాతిగాంచారు. ఆ కాలంలో ఆయన బాడీలైన్ బౌలింగ్‌ను గట్టిగా ఎదుర్కొన్న బ్యాటింగ్ లెజెండ్‌గా పాపులారిటీ సంపాదించుకున్నారు.
ప్రపంచప్రఖ్యాతిగాంచిన ఇంగ్లీష్ కవిగా షేక్స్‌పియర్ పేరుగాంచితే కవిరత్న కాళిదాసు సంస్కృత కవిగా ప్రఖ్యాతిగాంచారు. కాళిదాసు చక్రవర్తి విక్రమాదిత్యుని కొలువులోని తొమ్మిదిమంది రత్నాల్లాంటి కవుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్ని మిత్రం, విక్రమోర్వసీయమ్ వంటి నాటకాలు, రఘువం శం, కుమార సంభవం, మేఘదూత వంటి కవితలతో సాహితీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. షేక్స్‌పియర్ హామ్లెట్, ద మర్చంట్ ఆఫ్ వెనిస్, రోమియో అండ్ జూలియట్, ఒథెల్లొ, కింగ్ లియర్ వంటి నాటకాలు వీనస్ అండ్ అడోనిస్, ద రేప్ ఆఫ్ ల్యుక్రీస్ వంటి కవితలతో గొప్ప కవిగా పేరుతెచ్చుకున్నారు.
దక్షిణాది సినిమాల డ్యాన్సింగ్ స్టార్ ప్రభుదేవాకు పాప్‌కింగ్ మైకేల్ జాక్సన్‌కు మధ్య ఓ పోలిక ఉంది. ఈ ఇద్దరు డ్యాన్స్ చేసే స్టైల్ ఒకే విధంగా ఉండడం విశేషం. ప్రభుదేవాని ఇండియన్ మైకెల్ జాక్సన్ అంటారు అభిమానులు.
ఒకప్పుడు హాలీవుడ్‌ను ఏలిన మహారాణిగా, అందాలతారగా మార్లిన్ మన్రో ఎంతో ప్రఖ్యాతిగాంచారు. ఆమె తన అందచందాలు, గ్లామర్, నటనతో పలు హిట్ సినిమాల్లో ప్రేక్షకులను మైమరపించారు. ఇక మన దేశానికి చెందిన అందాలరాశి, సినీతార మధుబాల సైతం నాడు పలు సక్సెస్ సినిమాలో చక్కగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు. వీరిద్దరూ నాడు సినీ రంగాల్లో అగ్రతారలుగా రాణించి అపురూప సౌందర్యరాశులుగా పేరు తెచ్చుకున్నారు. మార్లిన్ మన్రో వీనస్ ఆఫ్ హాలీవుడ్‌గా పేరు గాంచితే మధుబాల వీనస్ ఆఫ్ బాలీవుడ్‌గా ప్రఖ్యాతిగాంచారు. మార్లిన్ మృతి నేటికీ మిస్టరీగా మిగిలిపోతే మధుబాల గుండెకు సంబంధించిన వ్యాధితో మరణించారు. వీరు చనిపోయి దశాబ్దాలు గడిచినా నేటికీ ఈ అందాలతారలను ప్రేక్షకులు గుర్తుచేసుకుంటూనే ఉంటారు.
అమెరికాకు చెందిన లెజండరీ సినిమా డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్, యాక్టర్, ప్రొడ్యూసర్ ఓర్సన్ వెల్స్. ఆయన రూపొందించిన పోర్ట్రయల్ ఆఫ్ సిటిజన్ కేన్ అంతర్జాతీయంగా ఎంతో పేరుతెచ్చుకుంది. ఆయన సినిమాలు ఒక్కోటి ఓ దృశ్య కావ్యంగా పేరుగాంచాయి. వెల్స్ మాదిరిగా గురుదత్ కూడా గొప్ప డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్, యాక్టర్‌గా పాపులారిటీ సంపాదించారు. ఆయన తీసిన ప్యాసా, కాగజ్ కే ఫూల్ వంటి సినిమాలు ఇప్పటి వరకు రూపొందించిన 100 బెస్ట్ ఫిల్మ్‌సలో ఒకటిగా పేరుతెచ్చుకున్నాయి. వీరిద్దరి జీవితాలు విషాదాంతంగా ముగిసాయి.
సాహితీ ప్రపంచంలో తిరుగులేని రచయిత్రులుగా వెలుగొందుతున్నవారు జాకీ కొలిన్స్, శోభా డే. వారి నవలలు పాఠకుల విశేష ఆదరాభిమానాలను చూరగొంటున్నాయి. కేవలం రచయిత్రిగానే కాకుండా కాలమిస్ట్‌గా, సోషలైట్‌గా, డిజైనర్‌గా సైతం శోభాడే పేరుతెచ్చుకున్నారు. ఈ ప్రఖ్యాత రచయిత్రిని టైమ్ మ్యాగజైన్ ‘జాకీ కాలిన్స్ ఆఫ్ ఇండియా’కు కీర్తించింది.
మన దేశానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్‌ను ఫోర్బ్‌స మ్యాగజైన్ నాటి పాపులర్ ఆర్టిస్ట్ పబ్లొ పికాసోతో సరిపోల్చింది. వీరి పెయింటింగ్స్‌లో కొన్ని ఒకే శైలిలో రూపుదిద్దుకున్నాయి.ఎం.ఎఫ్.హు స్సేన్ మహాభారత సీరిస్‌లో భాగంగా గీసిన ‘దుర్యోధ న-అర్జున స్ల్పిట్’ పెయింటింగ్ పికాసో ‘గ్యుర్నికా’ పెయింటింగ్ ఒకే శైలిలో రూపుదిద్దుకున్నాయని ఆర్ట్ లవర్స్ పేర్కొంటారు.
షేక్ సౌదా బిన్ అల్ థాని ఓ అరబ్ షేక్. మహరాజా యశ్వంత్ రావు హోల్కర్ 2 మన దేశంలోని ఓ రాజ్యా న్ని పరిపాలించి చాలా సంవత్సరాల క్రితం మరణించిన రాజు. కానీ వీరిద్దరి మధ్య ముఖ కవళికలు, పోలి కలు ఒకే విధంగా ఉంటాయి. ప్రస్తుతం జీవించి ఉన్న షేక్ తాను గత జన్మలో మహరాజునని నమ్ముతారు. ఖతర్ దేశానికి చెందిన ఓ రాజు భావమరది అయిన షేక్ ఓ రోజు అమెరికన్ ఆర్టిస్ట్ మ్యాన్ రే గీసిన మహ రాజా యశ్వంత్ రావు హోల్కర్ 2 చిత్రపటాన్ని చూశారు. ఆ రాజుకు తనకు మధ్య పోలికలు ఉండడాన్ని గమనించిన ఆయన తానే గత జన్మలో ఆ రాజునని చెబుతారు. ఇద్దరూ సన్నగా ఉండడంతో పాటు ముఖం లోని వివిధ అవయవాలు సరిపోలినట్లు ఉంటాయి. ఐశ్వర్యవంతుడైన షేక్ దివంగత మహరాజా పెయింటింగ్‌లో పోజుతో ఫొటోలను కూడా తీయించుకున్నారు. ఇక మహరాజా 1961 సంవత్సరంలో మృతిచెందగా షేక్ జన్మించింది మాత్రం 1966లో.
పలు చిత్రాల్లో వెరైటీ క్యాప్స్‌తో అలరించిన టామ్ హ్యాంక్స్, అమీర్ ఖాన్‌లు ముఖ కవళికలు కూడా ఒకే విధంగా ఉంటాయంటారు వారి అభిమానులు. వారి నటన కూడా ఒకేవిధంగా ఉంటుందని చెబుతారు. ఇక ఆసియా సొసైటీ ఇంటర్వ్యూలో అమీర్‌ఖాన్ మాట్లాడుతూ హ్యాంక్స్‌కు తనకు మధ్య పెద్దగా పోలికలు లేవని కొట్టిపారేశారు.
నాటి నుంచి నేటి వరకు దశాబ్దాలుగా సినీ రంగంలో పాపులర్ హీరోలుగా పేరుతెచ్చుకున్న వ్యక్తులు రాబర్డ్ డి నీరో, అమితాబ్ బచ్చన్‌లు. హాలీవుడ్‌లో రాబర్డ్ డి నీరో పలు హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తే బాలీవుడ్‌లో బిగ్ బి యాంగ్రీ యంగ్‌మన్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ప్రపంచంలోని గొప్ప లేడీ అథ్లీట్స్‌లో ఒకరైన ఫ్లోరెన్స్ గ్రిఫిత్ జాయ్‌నర్ 1988 సియోల్ ఒలిపింక్స్‌లో స్ప్రింట్ డబుల్‌తో పాటు రిలేలో గోల్డ్ మెడల్స్‌ను సాధించి అం దరి దృష్టిని ఆకర్షించారు. కేవలం అథ్లెటిక్‌గానే కాకుండా ఆమె ఫ్యాషనబుల్ వస్త్రాలు ధరించడం, ఆరు అంగుల పొడవైన రంగు, రంగుల చేతి గోర్లతో ఆ కాలంలో ఫ్యాషన్ సింబల్‌గా నిలిచారు. ఇక ఇదే తరహాలో మన దేశానికి అథ్లెట్ అశ్వినీ నాచప్ప కూడా పేరు తెచ్చుకున్నారు. 1980 చివరి దశకం నుంచి 1990 దశకం ప్రారంభం వరకు అశ్విని నాచప్ప గొప్ప అథ్లెట్‌గా పాపులారిటీ సంపాదించుకోవడమే కాకుండా ట్రెండీగా హెయిర్ స్టైల్, ఉపయోగించే ఫ్యాషన్ యాక్ససరీస్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.
2010 సంవత్సరం ప్రారంభంలో ఫోర్బ్‌స మ్యాగజైన్ అజీమ్ ప్రేమ్‌జీని సాఫ్ట్‌వేర్ మొగల్ బిల్ గేట్స్‌తో సరి పోల్చింది. గేట్స్ మాదిరిగానే విప్రో చైర్మన్ అజీమ్ సైతం తన ఆదాయంలో పెద్ద మొత్తాన్ని ఛారిటీ కార్యక్రమాలకు వెచ్చిస్తూ వస్తున్నారు. ఆయన తన అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా 2010 డిసెంబర్‌లో 88,460,000,000రూ.లను సేవా కార్యక్రమాలకు కేటాయించడం విశేషం. 2011 జూన్‌లో ఆసియన్ హీరోస్ ఆఫ్ ఫిలాంత్రపీగా కీర్తించిన దేశంలోని నలుగురు ప్రముఖులలో ప్రేమ్‌జీ ఒకరిగా నిలిచారు.