కుబేరులున్న బీద దేశం మనది...
స్వాతంత్య్రం వచ్చిన ఆరు దశాబ్దాల తర్వాత కూడా..
ఎందువల్లనంటారు ? కొందరి దృష్ట్యా మనకు అంటే మన దేశ ప్రజలకు మితిమీరిన స్వాతంత్య్రం ఉండటం వల్లనని !
చట్టాలున్నాయి.. అమలు కావు.. చట్టాలు కూడా అందరికీ సమానం కావు.
మూర్ఖత్వం దేశంలో నాలుగు చెరగులా రాజ్యమేలుతుంది.
సంఘం మీద, తోటి మానవుల మీద గౌరవం శూన్యం. సభ్యత, నాగరికత కోసం భూతద్దాలతో వెతకాలి. పొరుగు దేశాల్లో ఎంతో సభ్యత, సంస్కారంతో మసలే భారతీయులు కూడా. స్వదేశం రాగానే అసభ్యత, అనాగరికత ప్రదర్శిస్తారు. చెత్త చెదారం ప్రతిచోటా వెదజల్లుతారు.
ఎందువల్ల? భయభక్తులు లేకే! అక్కడ విదేశాల్లో క్షణాల్లో పట్టుకుని శిక్షిస్తారు. మరి ఇక్కడో...?
ఎందుకు లెండి అందరికీ తెల్సిన కథాకమామీషుల్ని పదేపదే వల్లె వేసుకోవటం...
కంట్రోల్స్ ఉండాలి. భయముండాలి. నేరాలకు కఠినమైన శిక్షలు వెంటనే అమలు కావాలి. ఇలా ఎన్నెన్నో.. ఇవి లేకనే మనం ఇంకా మిగతా దేశాల కన్నా ఎంతో వెనకబడి ఉన్నాం. చైనా దేశ పురోగతిని ఉదహరిస్తారు వీరు.
ఇవి కొందరి అభిప్రాయాలు, ఆలోచనలు కాగా మరికొందరి దృష్టిలో పేట్రేగిపోతున్న స్వార్థం, లంచగొండితనం మన దేశ భవిష్యత్తును చావుదెబ్బకొడుతున్నాయని. వీరు ఇచ్చే ఉదాహరణ ఆనాటి బ్రిటీష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ మన దేశానికి స్వాతంత్య్రం రాబోతున్న సమయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు..
"అధికారం రోగ్సు (మోసగాళ్లు), రాస్కెల్స్ (దుష్టులు, పోకిరివాళ్లు), ఫ్రీ బూటర్స్ (దోచుకునే వాళ్లు, కొల్లగొట్టేవాళ్లు) హస్తగతమౌతుంది. భారత దేశంలోని నాయకులందరూ 'లో కేలిబర్'- తక్కువ మేధాశక్తి, బలహీన వ్యక్తిత్వాలు గల వారుగా ఉంటారు. తీయని పలుకులు, బుద్ది హీనత్వం వారి సొంతం. అధికారం కోసం తమలో తాము యుద్ధాలు చేసుకుంటారు. ఫలితంగా రాజకీయ అంతర్యుద్ధాలతో దేశం నష్టపోతుంది..''
నేడు జరుగుతున్న కథే ఇది. మనమంతా కష్టపడి చర్చిల్ మాటలను నిజం చేసుకుంటున్నాం. రాజకీయ అంతర్యుద్ధాలు, ముఠాతత్వాలు, అలసత్వం, స్వార్ధం ఎలాంటి భయభక్తులు, కంట్రోల్సు లేకపోవటం దేశాన్ని భ్రష్టు పట్టించి, పలు దేశాల కన్నా, సహజ సంపదలున్నా మనమింకా బీదరికం, రోగాల్తో కొట్టుమిట్టాడి పోతున్నాం.
ఈ చీకట్లో కాంతి పుంజాల్లాంటి వారు నేటి యువత. వారు చూపిస్తున్న అసాధారణ చొరవ, ప్రజ్ఞాపాటవాలు. మనం సాధిస్తున్న కాస్తో కూస్తో నేటి ప్రగతికి మూలకారణాలు. నిజానికి ఈ దేశ భవిష్యత్తుకి, దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కీలకమైన వారు మన దేశ యువతే.
నేడు దేశం గర్వింప దగ్గ వ్యాపారవేత్తలు, మేధావులు, శాస్త్రవేత్తలు, పలు రంగాలకు చెందిన నిపుణులు.. వీరందరూ ఎంతో చిన్నవారే. గతంలో లాగా తలలు పండితేనే విజయాలు వరించాల్సిన అవసరం లేదు నేడు. కొత్త ఉత్పాదనల ఆవిష్కరణలతో, సరికొత్త టెక్నాలజీలతో ఎంతో మంది యువకులు నాలుగు పదుల వయస్సు రాకముందే పేరు ప్రతిష్ఠలు అవి తెచ్చే ధన సంపదలతో తులతూగుతున్నారు దేశ విదేశాల్లో.. ఇవన్నీ స్వార్జితమైనవి.
కష్టపడి సంపాదించుకున్నవి. మనకు మార్గదర్శకమైనవి వీరి ప్రయోగాలు, విజయాలు. వీరెవ్వరూ కుటుంబ పలుకుబడి మీద, పెట్టుబడుల మీద, తరతరాలుగా వస్తున్న వ్యాపారాల పైన, వృత్తుల పైన ఆధార పడకుండా తమ తమ సామ్రాజ్యాలను సృష్టించుకొన్నారు పట్టుదలతో.. గమ్యాలతో రేయింబవళ్లు ఏకం చేసి.. ఇలాంటి వారు వందల్లో, వేలల్లో, లక్షల్లో విజయాలను తమ కైవసం చేసుకుంటుంటే నేటి భారతంలో మనమూ ఆ పని చేయొచ్చు కదా! వారు మనలాగే సామాన్యులే కదా.. స్వశక్తిపై నమ్మకం ఉంచుకుని ముందడుగు వేసిన వారే కదా ! వారూ మనలాగే రెండు కాళ్లు, రెండు చేతులు, రెండు కళ్లు.. ఇంకా ఇతర శరీర అవయవాలు కలవారే కదా !!!
వారిలో ఎంతమంది మనలాగే అట్టడుగు సమాజం నుంచి లేచివచ్చి ఈ సువిశాలమైన ఆకాశం కింద తమ అస్థిత్వాన్ని నిరూపించుకున్నవారే. తమ ఉనికిని పదిల పరుచుకున్నవారే. వీరిలో ఒకరు మనందరికి ఎంతో సుపరిచయమైన ధీరూభాయి అంబానీ గారు. ఎంతో క్లుప్తంగా వారి గురించి ముచ్చటిస్తాను ఇక్కడ.. ఎందుకంటే వారి గురించి రెండు పుస్తకాలు (ధీరూభాయిజమ్, ఎదురీత), పలు వ్యాసాలు, గతంలో రాయటం జరిగింది.
దేశాభివృద్ధి గురించి, నేటి భారతంలోని వ్యాపార విజయాల గురించి, గమ్యాలతో పట్టుదలతో ఎన్ని అడ్డంకులొచ్చినా ఎదురొడ్డి పోరాడి దేశంలోని లక్షల మందికి స్ఫూర్తిదాయకమైన నాయకుడు ధీరూభాయి. అందుకని వారి జీవిత విశేషాలు, ఇక్కడ క్లుప్తంగానైనా ముచ్చటించుకోవటం అవసరం.
వారు వ్యాపార రంగ ప్రవేశం చేసినప్పుడు మన దేశంలోని పరిస్థితులు నేటికి పూర్తిగా విరుద్ధం. లైసెన్స్ కోటారాజ్ తీవ్రంగా రాజ్యమేలుతున్న రోజులవి. సామాన్య కోరికలు కూడా ఆకాశంలో నక్షత్రాల్లా అందకుండా పోయిన రోజులవి. అన్నిటికీ కొరతలే పాలడబ్బాల నుంచి ప్లెయిన్‌లో సీటు దాకా.
అన్నిటికీ పరపతి కావాలి. ఫోను కావాలన్నా, స్కూటర్ కావాలన్నా, బ్యాంకులో లోను కావాలన్నా... పరపతి, ఆపై ఓర్పు మెండుగా ఉండాల్సిన కాలమది. ఫోను, స్కూటర్ వగైరాలు గృహ ప్రవేశం చేయాలంటే పది పదిహేను సంవత్సరాల నిరీక్షణ అవసరం. ఈ పరిస్థితుల్లో కలలకు, గమ్యాలకు, పట్టుదలకు చోటేది..!?
నిరీక్షణ, ఓర్పు- రెండే ప్రధాన జీవితావసరాలు ఆ రోజుల్లో. వ్యాపార రంగం నత్తనడకన నడుస్తున్న కాలం. వ్యాపారస్తులంటే అనుమానంతో చూడబడుతున్న సమయం. అటువంటి దేశ కాల పరిస్థితుల్లో రంగప్రవేశం చేసి తన జీవిత కాలంలోనే, ముప్ఫై ఏళ్ల లోపే అంతర్జాతీయ శ్రేణికి చెందిన ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పారు ధీరూభాయి.
పాలడబ్బాలకు పరపతి ఉపయోగించాల్సిన దేశంలో, అంతటి వ్యాపార సా మ్రాజ్య స్థాపనలో ఆయన ఎన్ని అడ్డంకులు, కష్టాలు ఎదుర్కొని ఉంటారో ఊ హించుకోండి.అందువల్లే ఆయన మనలాంటి సామాన్యులకు స్ఫూర్తిదాత, మా ర్గదర్శకుడయ్యారు. ఈ దేశంలో సామాన్యులు కూడా గొప్ప కలలు కని వాటిని తమ తమ జీవిత కాలాల్లోనే సాకారం చేసుకునే ధైర్యాన్ని మనలో కలిగించారు.
ధీరూభాయి అంత ఎత్తు ఎదగాలని నేడు కలలు కనే యువకులు లక్షల్లోనే ఉంటారు మనదేశంలో.. మన ఆలోచనా విధానంలో ఈ పెనుమార్పు ఆయన సాధించిన విజయాల వల్లే ఏర్పడింది. ఇన్ని విజయాలు సాధించిన ధీరూభాయి 28 డిసెంబర్ 1932న హీరాచంద్, జమునాబెన్ అంబానీలకు ఐదో సంతానంగా గుజరాత్‌లోని చోర్‌వాడ్‌లో పుట్టాడు.
హీరాచంద్ టీచరు. ఆనాటి పలువురిత ఉపాధ్యాయుల్లాగా బీదవాడు హీరాచంద్. చెప్పుల్లేని కాళ్లు, వంటికి రెండే రెండు జతల బట్టలు, స్కూలు ఫీజు కట్టాలంటే. తనే స్వయంగా ఏదైనా చిన్న వ్యాపారం చేసి సంపాదించాల్సిన పరిస్థితులు. బజ్జీలు చేసి వచ్చిన లాభాలతో స్కూలు ఫీజు కట్టేవాడు చిన్న ధీరూభాయి.
ఎస్ఎస్ఎల్‌సి పాసయ్యాక తన 17వ ఏట కుటుంబాన్ని పోషించటానికి బ్రిటీష్ కాలనీ అయిన ఎడెన్‌కి వెళ్లారు. అడుగులోనే హంసపాదన్నట్లుగా ఏ ప్యాసింజర్ షిప్‌లోనూ సీటు దొరకలేదు. సమయంలో చేరకపోతే ఉద్యోగం మాయమవుతుంది. కార్గో షిప్‌లో ప్రయాణం చేసి గడువులోగా ఎడెన్ చేరుకున్నాడు.
శుద్దమైన బ్రిటీష్ ఇంగ్లీష్ భాష అక్కడి వాడుక భాష. తనకు ఇంగ్లీష్‌తో అంతగా పరిచయం లేదు. మరో సమస్య. ఇలా జీవితాంతం అన్నీ సమస్యలే. తొమ్మిదేళ్ల అనంతరం ఎడెన్ నుంచి బాంబే వచ్చి కొద్దిపాటి మూలధనంతో ఆహార దినుసుల ఎగుమతి-దిగుమతి వ్యాపారం మొదలు పెట్టారు. ఇతర వ్యాపారులతో సమస్యలు. మెల్లగా ఎదిగి యార్న్ వ్యాపారంలోకి ప్రవేశించి 1966లో తమ సొంత బట్టల తయారీకి మొదలుపెట్టారు.
'విమల్' ఆ వస్త్ర సంపద పేరు. గమ్యం పద్ధతుల మీద పూర్తి నమ్మకం, అవగాహన ఉన్న వ్యక్తి ధీరూభాయి.
ఏ వ్యాపారం చేసినా, అందులో ప్రధమ స్థానం ఆక్రమించాలన్నది గమ్యం.
పద్ధతులు- ఉత్తమ శ్రేణికి చెందిన టెక్నాలజీ, మానవ వనరుల సహాయంతో అత్యుత్తమ ఉత్పాదనలకు పెద్దపీట వేశారు.
వ్యాపారమన్నాక జీవితంలో లాగానే ఎత్తుపల్లాలు, హెచ్చుతగ్గులు సహజం.
కనుక వాటి నుంచి పారిపోకుండా, ఎదురొడ్డి పోరాడి విజేత కావాలన్నది మరో వ్యూహం. ఈ ప్రయాణంలో మంచి టీము, వారికి స్ఫూర్తినిచ్చే ఛాలెంజెస్, జీత భత్యాలు సంస్థతో మమేకమయ్యేలా పరిసరాలు, పరిస్థితులు సమకూర్చటం మరో వ్యూహం.
నేను 23 ఏళ్లు వారితో కలిసి పని చేశాను. ఏనాడు నేను ఒక ఉద్యోగస్తుణ్ని 9 నుంచి 5 దాకా పనిచేసి. నెలాఖరున జీతం పుచ్చుకుని అంటీముట్టనట్లు వ్యవహరించలేదు. వారి కుటుంబంలో, వారి కలల్లో, గమ్యాల్లో, కష్టాల్లో ,సుఖాల్లో మాలాంటి వారు భాగస్తులు, ఇది మా కృషి వల్లకాదు. వారి చొరవ వల్లే.
ప్రభుత్వ పరంగా, పోటీ దారుల నుంచి, పత్రికల నుంచి పెను సమస్యలే ఎదురయ్యాయి ధీరూభాయికి . పోరాడారే తప్ప పారిపోవాలనుకోలేదు. విదేశాల్లో సెటిల్ కావటం ఆ రోజుల్లో చాలా ఫ్యాషనబుల్, ధీరూభాయికి కాదు. జీవితాంతం మధ్యతరగతి విలువలు ఎదుటివాడికి సహాయం చేసే తత్వం ధీరూభాయిది. ప్రతిభకు పట్టం కట్టేవారు, మాలాంటి వారంటే బోలెడంత ప్రేమాభిమానాలు. ఎంతో గౌరవించేవారు.
భారతీయ వ్యాపార రంగంలోని పలువరి దిగ్గజాలతో నాకు పరిచయాలున్నప్పటికి ధీరూభాయి లాంటి వ్యాపార వేత్తను, వ్యక్తిని మరెవరిలో చూడలేదు. ధైర్యం.. గమ్యాలు .. వాటిని చేరుకునే విధానాలు.. అన్నీ సుసాధ్యాలేనని నమ్మే పాజిటివ్ వ్యక్తిత్వం.. ఇతరులను నమ్మి, వారికి బాధ్యతలను అప్పగించగలిగిన ధైర్య సాహసాలు.. గొప్ప కలలుకనే ఆత్మస్థైర్యం, వాటిని ఎలాగైనా చేరుకోవాలనే తపన. అసాధ్యమైన కలలంటూ ఏవీ ఉండవనే గాఢ విశ్వాసం.
ధీరూభాయి గారి అస్త్రాలు ఇవన్నీ. అతి సామాన్యుడు, అసామాన్యుడైనాడు కేవలం మూడు దశాబ్దాల్లో, తన జీవిత కాలంలోనే. ఇది అందరికీ సాధ్యమేనని నమ్మి, మనని నమ్మించి, మనలో కలల్ని, గమ్యాల్ని ప్రేరేపించగలిగారు ధీరూభాయి ఇదే ఆయన విజయం.

-ఎజి కృష్ణమూర్తి
No comments:
Post a Comment