రే క్రాక్.. 52వ వసంతంలో మొదలైన జీవనయానం. నా వయస్సు 52 డయాబెటీస్ ఆర్ధట్రాయిస్.. రెండూ ఉన్నాయి నాకు. ఇంతకు మునుపే గాల్ బ్లాడర్‌ని, థైరాయిడ్ గ్లాండ్‌లోని చాలా భాగం తీసేసారు. అయినప్పటికీ నా భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందనే నమ్మకం నాకుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెక్ డొనాల్డ్ సంస్థ నిర్మాణంలో ముఖ్య భూమిక నిర్వహించిన రే క్రాక్ చెప్పిన మాటలివి. ఎప్పుడు మెక్ డొనాల్డ్ సంస్థలో చేరే ముందు.
మనలో చాలా మంది ఏ చిన్న ఎదురు దెబ్బ తగిలినా చివరికి జలుబు చేసినా తల్లడిల్లి పోతాం. ధైర్యం తక్కువ, పిరికితనం ఎక్కువ. గెలుపు మీద కంటే ఓటమి మీదే నమ్మకం ఎక్కువ. తప్పక గెలుస్తామనే నమ్మకం కంటే గ్యారెంటీగా ఓడిపోతామనే నమ్మకం జాస్తి. వీరందరికీ రే క్రాక్ మాటలు మార్గదర్శకమవ్వాలి.
అందుకు ఒకటే బలమైన కారణం. ఆయన కన్న కలలు సాకారం చెందే ఘడియలు ఇంకా చేరువ కాలేదు. అందాకా తన కృషి సాగుతూనే ఉండాలి అనేది ఆయన నమ్మకం. ముందు చెప్పుకున్నట్లుగా వేరెవరికయినా అలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన వలసి వస్తే అదే జీవిత చరమాంకం అనుకుని ఆగిపోయి ఉండేవారు. కాని రే క్రాక్ విషయంలో ఆయనకు తన ఆరోగ్య సమస్యలు గొప్ప సమస్యలుగా గోచరించినట్లు ఆధారాలు లేవు.
రే క్రాక్ గురించి నేను రీసెర్చి చేస్తున్నప్పుడు ఎక్కడ ఆయన తన ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావించలేదు. కనుక ఆయన పరిపూర్ణ ఆరోగ్యవంతుడనుకున్నాను. తర్వాత ఆయన ఆరోగ్య విషయం గురించి అసలు సంగతి తెలుసుకున్నాక నోట మాట రాలేదు. ఈయన తన 52 వ ఏట ఇటువంటి అనారోగ్యంతో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాడా? ఆకాశానికి అంతేది ? అవకాశాలకు అంతేది? ధైర్య సాహసాలు, కలలు గమ్యాలున్న వ్యక్తికి ఎదురేది ? నేను ఆరాధించే హీరోల్లో రే క్రాక్ ముఖ్యులు. కొండంత ధైర్యం, అన్నీ సుసాధ్యాలే అని నమ్మే ఆయన మనస్తత్వం ఈ ఆరాధానికి కారణం. ఇలాంటి వ్యక్తులు చాలా కొద్ది మంది తారసపడ్తారు మనకు జీవితంలో.
వారి జీవితాలు నేర్పే పాఠాలు అమూల్యమైనవి. ఆచరణీయమైనవి. నేటి మెక్‌డొనాల్డ్స్ విశ్వ దర్శనానికి రే క్రాక్ కృషి మూల స్థంభం. ఒకసారి గూగుల్ సెర్చ్‌కి వెళ్లి నేటి మెక్ డొనాల్డ్ రూప దర్శనం చేయండి. అదో అంతర్జాతీయ మహా వృక్షం. విత్తనం వేసింది మెక్ డొనాల్డ్స్ సోదరులైనప్పటికీ ఈ సంస్థను ప్రపంచమంతటా విస్తరింప చేసి నేటి స్థాయికి తెచ్చిన ఘనత రే క్రాక్‌దే.
జయహో రే క్రాక్ మహాశయా.. జయహో.
- ఎజి కృష్ణమూర్తి

సాధించిన రేక్రాక్
మెక్ డొనాల్డ్స్‌ను ఒక గొప్ప అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దిన రే క్రాక్ గురించిన ముచ్చట్లు మొదలుబెట్టాం గతవారం. ఆయన ఎంతో గర్వంగా తనను గురించి చెప్పుకున్న మాటల్ని మరోసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. నా వయస్సు 52, డయాబిటీస్, ఆర్ధయిటిస్ రెండు ఉన్నాయి. నాకు ఇంతకు మునుపే గాల్ బ్లాడర్‌ని, థైరాయిడ్ గ్లాండ్‌లోని చాలా భాగం తీసేసారు. అయినప్పటికీ నా భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందనే నమ్మకం నాకుంది. ఇటువంటి ధైర్య సాహసాలు, స్వశక్తిపై విశ్వాసం, నమ్మకం.. ఎటువంటి అడ్డంకులు వచ్చినా కలలను సాకారం చేసుకోవాలనే తపన ఉన్న ప్రతి వ్యక్తి విజేతగా రూపాంతరం చెందుతాడు. ఇందులో ఎలాంటి సందేహానికి తావులేదు.
ఆశావాదం విజేతకి కావాల్సిన ఒక గొప్ప అవసరం. చాలామంది విజేతల్లో మనకు కొట్టొచ్చినట్లు కనబడే గుణమిదే. మనం ఓ స్వామివారి దగ్గరికెళ్లి మన కష్టాల్ని ఆయన పాదాల మీద కుమ్మరిస్తాం. ఆయనేమని దీవిస్తారు ? ధైర్యంతో ఉండు.. అన్ని సర్దుకుంటాయి అనేగా. అలాకాకుండా ఇది కష్టకాలమే అంటే మన గతేం కాను. ప్రాణం ఊసురుమంటుంది.
అలాగే డాక్టర్ కూడా.. మా ఫ్యామిలీ డాక్డర్ గారున్నారు డాక్టర్ మనోజ్ కుమార్ గారని. ఆయన్ని కలుసుకుంటేనే సగం బాధ, రోగం తగ్గిపోతాయి. ఇక ఆయన చెప్పిన ధైర్య వచనాలు విన్నాక మిగతా సగం మారిపోతాయి. వైద్యుడు దేముడితో సమానం అన్నారు కదా ఆర్యులు. వారు మనకిచ్చేదేమిటి ? ధైర్యమే కదా. ఆపదలు తొలగిపోతాయని నమ్మకమే కదా.
ధైర్యే సాహసే లక్ష్మీ. ఆశావాదికి అలవోకగా అబ్బే గుణమే ధైర్యం. రే క్రాక్‌కి ఉన్నన్ని ఆరోగ్య సమస్యలు మరెవరికైనా ఉండి ఉంటే అన్ని పనులు వదిలి, నిరంతరం దిగులుతో నిస్సహాయంగా పైవాడి పిలుపుకి ఎదురు చూస్తుండేవారు అవునా కాదా ? మెక్‌డొనాల్డ్ సోదరులు స్థాపించిన మెక్‌డొనాల్డ్ హేంబర్గర్ రెస్టారెంట్స్‌ని కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేసిన ఘనత రే క్రాక్‌ది.
ఈ రంగ ప్రవేశం చేసే ముందు రే క్రాక్ రకరకాల పనులు చేశాడు. తన పదిహేనో ఏట ట్రక్ డ్రైవర్ అయ్యాడు. ఆ తర్వాత పియానో ప్లేయర్ ఉద్యోగం సంపాదించాడు. ఆ పిమ్మట పేపర్ కప్పులు అమ్మే కంపెనీలో సేల్స్‌మెన్ అయ్యాడు. ఈ ఉద్యోగంలో ఉన్నప్పుడే మిల్క్ షేక్ మిక్సర్లు తయారు చేసే ఓ పెద్ద మనిషితో పరిచయమైంది. ఆ పరిచయం ఆ కంపెనీలో ఓ ఉద్యోగిగా మార్చగా ఆ తర్వాత 17 సంవత్సరాలు మిక్సర్లు అమ్ముతూ అమెరికా అంతా తిరిగాడు.
అలా తిరుగుతూ మిక్సర్లు అమ్మటానికై మెక్ డొనాల్డ్ సోదరులను కల్సుకున్నాడు. వాళ్లు నడుపుతున్న రెస్టారెంట్స్ రే క్రాక్‌ని ఎంతో ప్రభావితం చేసినాయి. అవి ఎంతో చక్కని రెస్టారెంట్స్ అని వాటిని దేశవ్యాప్తంగా తెరిస్తే వాటికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని రే క్రాక్ ఆ సోదరులకు చెప్పాడు.
ఆయన బాగానే ఉంది కాని ఈ బాధ్యతనెవరు తలకెత్తుకుంటారంటే నేలేనా అన్నాడు. రెస్ట్ ఈజ్ హిస్టరీ మిగతాదంతా చరిత్ర అంటాం కదా. అలాగే రే క్రాక్ మెక్ డొనాల్డ్స్‌లో చేరాక ఒక చరిత్ర సృష్టికి మూలకారకుడయ్యాడు. అప్పుడు ఆయన వయస్సు 52. ఎన్నో ఆరోగ్య సమస్యలతో పో రాడుతున్నాడు. అయితే అదేమి ఆయన్ని క్రుంగ దీయలేదు.

June Martino - The Silent Backbone of McDonald's
Ray Kroc, Harry Sonnenborn, June Martino, Don Conley & Fred Turner - 1960
In 1948 June Martino became Ray Kroc's (founder of McDonald's Restaurants) bookkeeper. She rose to Corporate Secretary, Director and part owner of the corporation.
అందుకు ఒకటే బలమైన కారణం. ఆయన కన్న కలలు సాకారం చెందే ఘడియలు ఇంకా చేరువ కాలేదు. అందాకా తన కృషి సాగుతూనే ఉండాలి అనేది ఆయన నమ్మకం. ముందు చెప్పుకున్నట్లుగా వేరెవరికయినా అలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన వలసి వస్తే అదే జీవిత చరమాంకం అనుకుని ఆగిపోయి ఉండేవారు. కాని రే క్రాక్ విషయంలో ఆయనకు తన ఆరోగ్య సమస్యలు గొప్ప సమస్యలుగా గోచరించినట్లు ఆధారాలు లేవు.
రే క్రాక్ గురించి నేను రీసెర్చి చేస్తున్నప్పుడు ఎక్కడ ఆయన తన ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావించలేదు. కనుక ఆయన పరిపూర్ణ ఆరోగ్యవంతుడనుకున్నాను. తర్వాత ఆయన ఆరోగ్య విషయం గురించి అసలు సంగతి తెలుసుకున్నాక నోట మాట రాలేదు. ఈయన తన 52 వ ఏట ఇటువంటి అనారోగ్యంతో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాడా? ఆకాశానికి అంతేది ? అవకాశాలకు అంతేది? ధైర్య సాహసాలు, కలలు గమ్యాలున్న వ్యక్తికి ఎదురేది ? నేను ఆరాధించే హీరోల్లో రే క్రాక్ ముఖ్యులు. కొండంత ధైర్యం, అన్నీ సుసాధ్యాలే అని నమ్మే ఆయన మనస్తత్వం ఈ ఆరాధానికి కారణం. ఇలాంటి వ్యక్తులు చాలా కొద్ది మంది తారసపడ్తారు మనకు జీవితంలో.
వారి జీవితాలు నేర్పే పాఠాలు అమూల్యమైనవి. ఆచరణీయమైనవి. నేటి మెక్‌డొనాల్డ్స్ విశ్వ దర్శనానికి రే క్రాక్ కృషి మూల స్థంభం. ఒకసారి గూగుల్ సెర్చ్‌కి వెళ్లి నేటి మెక్ డొనాల్డ్ రూప దర్శనం చేయండి. అదో అంతర్జాతీయ మహా వృక్షం. విత్తనం వేసింది మెక్ డొనాల్డ్స్ సోదరులైనప్పటికీ ఈ సంస్థను ప్రపంచమంతటా విస్తరింప చేసి నేటి స్థాయికి తెచ్చిన ఘనత రే క్రాక్‌దే.
జయహో రే క్రాక్ మహాశయా.. జయహో.
No comments:
Post a Comment