Sunday, June 19, 2011

మా నాన్న.. నేను

"నేను చేసిన తప్పులకు నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ క్షణంలో ఏం చేయాలో తెలియలేదు. కానీ జీవితాంతం ఏం చేయకూడదో తెలుసుకున్నాను. అదే నాన్న గొప్పతనం''
- మహాత్మా గాంధీ

వేలు పట్టుకుని ప్రపంచాన్ని పరిచయం చేసినా, అడుగులు తడబడుతున్నప్పుడు 'భద్రం' అంటూ చేయి అందించినా, తప్పటడుగులు వేసినప్పుడు రెండు దెబ్బలు వేసి మందలించినా... అది నాన్నకే చెల్లు. ఏ బిడ్డలైనా నాన్న వేసిన బాటలోనే ప్రయాణిస్తారు. ఎంత లేదనుకున్నా ఆయన ప్రభావంతోనే పెరుగుతారు. ఇవాళ తండ్రులందరికీ సెల్యూట్ చేయాల్సిన రోజు. ఎందుకంటే ఈ రోజు 'ఫాదర్స్ డే'. ఈ సందర్భంగా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. తండ్రుల జ్ఞాపకాలను మనతో పంచుకున్నారు పలువురు ప్రముఖులు.. వాటి సమాహారమే ఈ ప్రత్యేక కథనం...

ఆయన ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు..
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ముఖ్యమంత్రి

ఫలానా పని చేయాలని, ఫలానా చదువే చదవాలని మా నాన్న ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదు. నాకు ఇష్టమైన రంగాలలో ముందుకు సాగేందుకు ప్రోత్సహించారు. నేను చిన్నప్పట్నుంచి హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నప్పటికీ ఇంటికి దూరంగా ఉన్నాననే భావం కలగనీయకుండా చూసుకునేవారు. నాన్న రాజకీయ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న సమయంలో నేను క్రికెట్‌లో బిజీగా ఉండేవాడిని. ఆయన మరణానంతరమే రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సి వచ్చింది.

అప్పట్లో నా తమ్ముళ్ళకు ఎన్నికల్లో పోటీ చేసే వయస్సు లేని కారణంగా నేను పోటీ చేయక తప్పలేదు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సేవలను ఇప్పటికీ జనం గుర్తు చేసుకుంటున్నారు. నేను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించే సమయంలో ఆ సంగతులను చెబుతుంటే సంతోషం కలుగుతుంటుంది. ఇటీవల శ్రీకాకుళం, కడప జిల్లాల్లో పర్యటించిన సమయంలో ఆ జిల్లాల ఇన్‌చార్జి మంత్రిగా మా తండ్రి అందించిన సేవలను పలువురు కొనియాడడం నాకెంతో గర్వంగా అనిపించింది.

నాన్నే అమ్మయ్యాడు...
గనులశాఖా మంత్రి గల్లా అరుణకుమారి

మా అమ్మను నేను ఎరుగను. నాకు రెండు సంవత్సరాల వయస్సులోనే ఆమె చనిపోయింది. ఊహ తెలిసిన దగ్గర నుంచీ అన్నీ నాన్నే నాకు. రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఎప్పుడూ ప్రజల్లోనే తిరిగేవారు. పొద్దుపోయి ఏ రాత్రికో యింటికి వచ్చేవాడు. ఎంత రాత్రి అయినా నన్ను వెతుక్కుని తన దగ్గర పడుకోబెట్టుకుని నిద్రపోయేవాడు. నాన్నమ్మ వంటనేర్చుకోమని తిడుతుంటే... మా నాన్న నన్ను దగ్గరకు తీసుకుని "యేం .. ఆడపిల్లగా పుట్టినంత మాత్రాన వంట చేసుకే బతకాలా? మా చిన్నమ్మ చేయాల్సిన పనులెన్నో వున్నాయి'' అనేవాడు.

ఒకరోజు మా మామ ఒకరు మా నాన్నతో మాట్లాడుతూ..."రాజా.. నా కొడుకుల్లో వొకరికి నీ కూతుర్ని యివ్వు'' అన్నారు. వెంటనే మా నాన్న నవ్వుతూ "మా అమ్మాయి చేత నీ కొడుకు తాళి కట్టించుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు'' అన్నాడు. ఆడపిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం. గౌరవం కూడా. రాజకీయాల్లోకి కూడా నాన్న నా చేయి పట్టుకుని నడిపించుకువెళ్ళారు. అయితే ఆ వాతావరణంలో యిమడలేక నేను నిరుత్సాహపడుతూ వుంటే, నవ్వి, రాజకీయం అంటే ఇలాగే వుంటుంది రా అనేవాడు. ఇక్కడ చావులేదు, బతుకూలేదు. చచ్చినవాడు చచ్చినట్టూ వుండడు, బతికినవాడు బతికినట్టూ వుండడు. ఎప్పుడు చస్తాడో, ఎప్పుడు బతికి లేచి కూర్చుంటాడో తెలియదు. దిగులు పడకూడదు. భయపడకూడదు. అవే అన్నీ సర్దుకుంటాయి. అని ధైర్యం చెప్పేవాడు. ఆ ధైర్యమే నన్ను నడిపిస్తోంది.

రెండు పడవల ప్రయాణం వద్దన్నారు.... శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్
నేను రాజకీయాల్లోకి వస్తానన్నప్పుడు నాన్న చెప్పిన మాటే ఈ రోజు నాకు మార్గదర్శకమయింది. " నువ్వు రాజకీయాల్లోకి రావాలంటే వ్యాపారాలకు దూరంగా ఉండు. ఏ పని చేసినా చిత్తశుద్ధితో, పూర్తిస్థాయిలో పనిచేయడానికి ప్రయత్నించు. రెండు పడవలపై ప్రయాణం ప్రమాదం'' అని చెప్పారు. మా నాన్న పుట్టిన గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆయన్ని గుర్తుచేసుకుంటారు. నన్ను అక్కున చేర్చుకుంటారు.

ప్రజల్లో ఇంతటి అభిమానం సంపాదించుకోవాలంటే నేను కూడా 'ఫుల్‌టైం జాబ్' చేయాల్సిందే అనుకున్నాను. అప్పటికి నాకు ఒక రెస్టారెంటు ఉంది. మరో కంపెనీకి డీలర్‌గా కూడా పనిచేస్తున్నాను. లాభాల్లో నడుస్తున్న నా వ్యాపారానికి బై చెప్పి వచ్చేశాను. నాన్నతో చాలా చనువుగా ఉండేవాడ్ని. కారణం ఆయన రాజకీయాలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో...కుటుంబానికి అంతే ప్రాముఖ్యం ఇచ్చారు. రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్న రోజుల్లో కూడా ఇంటికి వచ్చాక మాతోనే ఉండేవారు. ఆ విషయంలో నేను నాన్నంత గొప్పవాణ్ని కాలేను. ఎందుకంటే...ఆ కాలంలో సెల్‌ఫోన్లు లేవు (నవ్వుతూ...) ఇప్పుడలా కాదు...ఇలా ఇంటికి రాగానే జేబులో ఫోన్ మోగుతుంది. అంతే ఇల్లూ లేదు పిల్లలూ లేరు.

జేమ్స్‌బాండ్ అనేవారు...
జూబ్లీహిల్స్ ఎమ్ఎల్ఎ విష్ణువర్ధన్‌రెడ్డి

నాన్న కారు నెంబరు 4007 అంటే నలుగురు కూతుళ్లు, ఒక జేమ్స్‌బాండ్ అని చెప్పేవారు. ఆయన ఉన్నప్పుడు నా బలం తెలిసేది కాదు. ఇప్పుడు నేను ఒక్కడ్నే. నాన్నకు పడుకునే ముందు నాతో కాళ్లు నొక్కించుకోవడం అలవాటు. ఆ సమయంలో నాకు బోలెడు కబుర్లు చెప్పేవారు. ఇంట్లో ఉన్నప్పుడు తల్లి అవసరం, బయటికి వెళ్లినపుడు తండ్రి అవసరం ఏంటో తెలుస్తుంది. మా నాన్న గొప్పతనం ఏంటంటే...తనకి అన్ని విషయాలూ తెలుసు, అయినా నేను చెప్పే చిన్న చిన్న విషయాలు కూడా ఎంతో శ్రద్ధగా వినేవారు. ఆయన్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన సమయంలో నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన విగ్రహం ఎదుట ఏకలవ్యునిగా మిగిలిపోయాను.

ఆయన వేలు విడవలేదు...
రామగుండం ఎంపీ వివేక్

నా డాక్టరేట్ అయిన తర్వాత విదేశాలకు వెళదామనుకున్నా. అప్పుడే - 1990లో - చార్మినార్ ఇండస్ట్రీస్‌కు నాన్న యూనియన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కార్మికులకు వేతనాలు పెంచాలని పోరాడుతున్నారు. కాని యాజమాన్యం ఒప్పుకోలేదు. మనమే పరిశ్రమలు పెడదాం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆపారు. ఆ కారణంగానే ఇప్పుడు నేను పారిశ్రామికవేత్తగా ఎదిగాను. నాన్న జ్ఞాపకం అనగానే గుర్తొచ్చేది...రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఒకసారి మమ్మల్ని నార్త్ ఇండియా టూర్‌కు తీసుకెళ్లారు. బద్రినాధ్, హరిద్వార్...వంటి ప్రాంతాలు చూపించారు.

మరో విషయం కూడా గుర్తుకొస్తుంది. 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో భాగంగా పోలీసు ఫైరింగ్ జరిగింది. అప్పుడు నాన్నకు కూడా గాయాలయ్యాయి. ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. నాన్నను చూడ్డానికి అమ్మతో ఆసుపత్రికి వెళ్లిన జ్ఞాపకం కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఇంటా...బయటా అన్ని విషయాల్లో నాన్నను అనుసరించడానికి ప్రయత్నిస్తుంటాను. ఆయనలా ఉండాలంటే చాలా కష్టం. నా వ్యక్తిగత ప్రగతిలో, రాజకీయ అభివృద్ధిలో నాన్న పాత్ర చాలా ఉంది. ఇప్పటికీ ప్రతి విషయంలో ఆయన నన్ను వేలు పట్టి నడిపిస్తున్నట్లే ఉంటుంది.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోమన్నారు..
జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి

నేను పన్నెండో తరగతి చదువుకుంటున్నప్పుడు నాన్న ఒక మాట చెప్పారు. " నువ్వు డాక్టర్ చదవాలనుకుంటే ఇప్పటినుంచే కష్టపడి చదువు. రికమండేషన్ల కోసం నా దగ్గరికి రావొద్దు''. అప్పుడు నాన్న రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికాశాఖ మంత్రి. తన పలుకుబడి మా ఎదుగుదలకు ఏ విధంగానూ ఉపయోగపడకూడదనుకునేవారు. స్వయంకృషే శాశ్వతం అనేవారు. ఆయన మాటలు నాలో పౌరుషాన్ని నింపేవి. అలాగే అప్పుడప్పుడు మాపై మాకున్న నమ్మకాన్ని పరీక్షించేవారు. పరీక్షల సమయంలో సినిమాకి రమ్మనేవారు. అమ్మ చాలా పోట్లాడేది. "నిజంగా చదువుని ఒంట బట్టించుకుంటే...సినిమా చూసినా చక్కగా రాయొచ్చు'' అనేవారు. నేను బాగా చదువుతానని ఆయనకు తెలుసు. అయితే ఆ మాట ఎవరి దగ్గరా అనేవారు కాదు. అమెరికాలో ఎమ్ఎస్ చేసినపుడు నాకు 97 శాతం మార్కులు వచ్చాయి.

ఆ కాపీని ఇక్కడికి పోస్టు చేశాను. ఆ మార్కుల లిస్టుని ఇక్కడ అందరికీ చూపించుకుని మురిసిపోయారట. ఒక కొడుకుగా ఎప్పటికీ మరిచిపోలేని తీపి జ్ఞాపకం ఒకటుంది. నేను రాజేంద్రనగర్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నాన్న కేంద్రమంత్రి. కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమానికి ఆయన వచ్చినపుడు కాలేజీ స్టూడెంట్ లీడర్‌గా ఆయనకు నేను ఆహ్వానం పలికాను. అది నాకు చాలా గర్వంగా ఉండేది. ప్రజలు మనల్ని నమ్మినంతకాలమే మనం రాజకీయాల్లో ఉండగలం. ఆ నమ్మకాన్ని నిలబెట్టలేకపోతే మనకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదనేవారు.

ప్రేమంతా మనసులోనే... కర్నూలు ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి
మా కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య చనువు చాలా తక్కువగా ఉండేది. భయభక్తులు ఎక్కువ. నాన్న నాతో ఎక్కువ మాట్లాడేవారు కాదు. మా నాన్నతో మా తాత కూడా అలాగే ఉండేవారు. బాగా అవసరమైన విషయాలు తప్పితే...అన్ని విషయాలు నాన్నతో పంచుకునే పరిస్థితి ఉండేది కాదు. అలాగని అభిమానం లేదని కాదు. ఎంత ప్రేమ ఉన్నా...మనసులోనే ఉంచుకోవాలి. ఆయన ముందర నిలబడి మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. నేను చెప్పేది నా చిన్నప్పటి విషయాలు కాదు...నా పెళ్లయిన తర్వాత కూడా అంతే. అన్ని విషయాల్లో నేను ఆయన్నే అనుసరించేవాడ్ని. ఆయనొక మొండిఘటం. అనుకున్న పని అయ్యేవరకూ వదలరు. అదే ఆయన్నించి నేను నేర్చుకున్న అంశం. మనల్ని నమ్మినవారితో ఎలాంటి పరిస్థితుల్లో కూడా బంధాన్ని తెంచుకోకూడదు అనేవారు. ఇందిరాగాంధి నుంచి రాహుల్ వరకూ ఆ కుటుంబంతో మా కుటుంబానికి ఉన్న సంబంధాల్ని నేనూ కొనసాగిస్తున్నాను.

హుందాగా ఉండాలనేవారు... ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి

నేను మూడేళ్ల వయసున్నప్పుడే నాన్న ఎమ్మెల్యే. మాతోబుట్టువులలోనేనే చిన్నదాన్ని కావడంతో అందరికంటే నన్నే ఎక్కువ గారంగా చూసుకునేవారు. ఇప్పటివరకూ చిన్నమాట కూడా అనలేదు. పెళ్లయేదాకా నాకు ఏం కావాలన్నా నాన్నే హైదరాబాదు నుంచి తెచ్చేవారు. ఆళ్లగడ్డలో నేను నాన్నతో కలిసి నడుచుకుంటూ సినిమాకు వెళ్లేదాన్ని. నా పెళ్లయేదాకా ప్రతి పుట్టిన రోజుకూ నాన్న ఎక్కడున్నా వచ్చేవారు.

మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినపుడు నాన్న, నా భర్త అప్పటి నంద్యాల ఎంపీ భూమా నాగిరెడ్డితో కలిసి అసెంబ్లీకి వెళ్లాను. ఇద్దరం శాసనసభలో ఉన్నపుడు తెదేపా ఎమ్మెల్యేలతోపాటు నేనూ పోడియం వద్దకు వెళ్లడం లాంటివి చేస్తే అలా చేయొద్దని సైగ చేసేవారు.హుందాగా ఉండాలని కోరుకునేవారు. నెలకొకసారైనా ఆయన వద్దకు వెళ్లి కలిసి భోంచేసి వస్తుంటాను. మంచైనా చెడైనా నాన్నకు నేను తప్ప మా కుటుంబంలో ఎవరూ చెప్పలేరు. అంత చనువుంది ఆయనతో నాకు.

మానవత్వం నేర్పారు
పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

ఈరోజు ఆయన వారసునిగా మీముందు ఉన్నాను కాని చిన్నప్పుడు మా నోట రాజకీయం అనే మాట వినిపించేది కాదు. పెద్ద చదువులు చదువుకుని ఉన్నతమైన వ్యక్తిత్వంతో రాణించాలని కోరుకునేవారు. దానికోసం మాకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించేవారు. చదువు పూర్తి అయ్యాక మాకు నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకోమని చెప్పేవారు. కాని అనుకోకుండా రాజకీయాల్లోకి రావలసినవచ్చింది. ఎప్పుడూ పేదల గురించి ఆలోచించే నాన్నే నాకు స్పూర్తి. ఆయన మాకు మంచి, మానవత్వం నేర్పారు. ప్రతీ సమస్యను మానవీయ కోణంలో ఆలోచించాలని, ప్రతీ వ్యక్తిని మానవత్వంతో అక్కున చేర్చుకోవాలని చెప్పేవారు. నా నియోజకవర్గంలో ప్రజల ప్రేమాభిమానాలు పొందుతున్నానంటే ఆయన మంచితనమే కారణం.

పోలియో వచ్చినపుడు... నెల్లూరు ఎమ్ఎల్ఎ ఆనం వివేకానందరెడ్డి

నాకు పన్నెండేళ్ల వయసులో పోలియో వల్ల కాలికి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. రాయవేలూరులో ఉన్న ఆస్పత్రిలో వైద్యం చేయించారు. నెల్లూరి నుంచి రాయవేలూరికి వెళ్లాలంటే మూడు బస్సులు మారాలి. నాన్నే నన్ను ఎత్తుకుని తీసుకెళ్లేవారు. రెండుసార్లు ఆపరేషన్ చేయించారు. చంక దింపకుండా చంటిపిల్లవాడ్ని చూసుకున్నట్టు చూసుకున్నారు. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే...నాన్నే కారణం. రాజకీయాల్లో మునిగిపోయి భార్యాపిల్లల్ని పట్టించుకోలేనివారు బోలెడుమంది ఉన్నారు. కాని నాన్న అలా కాదు...'నేను ఏం చేసినా మీకోసమే కదా' అని ప్రతీ తండ్రి అనే మాటను ఆయన నిజం చేశారు.

ఆ ప్రశ్నని మరచిపోలేను....
మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి

నాన్న ఎమ్ఎల్ఎగా ఎన్నికైన సమయంలో నేను ఇంటర్ చదువుతున్నాను. మనం చదువులో కొంచెం వీక్(నవ్వుతూ...) ఇంటర్‌లో 49 శాతం మార్కులే వచ్చాయి. అగ్రికల్చర్ బిఎస్‌సి సీట్ కోసం ప్రయత్నిస్తున్నాను. నాన్న మార్కులు చూశారు. "ఈ మార్కులు చూపించి ఎవడి కాళ్లు పట్టుకోమంటావు'' అని అరిచారు. నా నోట మాట లేదు. చప్పుడు చేయకుండా వెళ్లి బీకామ్‌లో చేరాను. తరువాత లా చేశాను. వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయ జీవితంలోనూ ఆయన మాకు చెప్పింది, నేర్పింది, ఆచరించి చూపింది ఒకటే. నిజాయితీ. అదే నిలబెడుతుంది. నిజాయితీ లేకుండా ఎంత కష్టపడ్డా బూడిదపాలే అని చెప్పేవారు.

మంచి స్నేహితుడు...రాష్ట్ర న్యాయ శాఖా మంత్రి
ఏరాసు ప్రతాపరెడ్డి

మా నాన్న ఏరాసు అయ్యపురెడ్డి మంచి న్యాయవాది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేసులను డీల్ చేసేవారు. నన్ను చిన్నప్పుడు బూసెమ్మ మడుక్కు ఈత కొట్టడానికి తీసికెళ్లేవాడు. ఎల్‌కేజీ, యూకేజీలో నాన్న నన్ను హైదరాబాదు పబ్లిక్ స్కూల్లో చేర్పించారు. అది జాగీర్దారులు, జమీందారులు తమ పిల్లలను చదివించుకునే స్కూలు. ఒకరోజు నాన్న స్కూలుకు వచ్చి అక్కడ సరిగా ఇమడలేకపోతున్నానని తెలుసుకుని..ఈ బడీవద్దు..

గిడీ వద్దని మా ఊరు గడివేముల మండలం గడిగరేవులకు తీసుకొచ్చేశారు. కర్నూలు స్కూల్లో చేర్పిద్దామనుకున్నారు. కానీ నేను చదివిన బడికి ఇక్కడి బడులకు తేడా ఉందని కర్నూలులో చదవనని మారాం చేశాను. ఇంట్లోనే ప్రైవేటుగా చెప్పించారు. ఒకసారి కాలేజిలో కాలికి దెబ్బ తగిలింది. నాన్న వెంటనే రూ. 3500 పెట్టి సెకండ్ హ్యాండ్ కారు కొనిచ్చారు. ఆయనలా లాయరునయ్యాను. ఆయన మాదిరే ఆ శాఖకు మంత్రినయ్యాను.

నాన్నకు సెక్యూరిటీగా...
తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

ముప్పైఏళ్ల క్రితం హైదరాబాదులో ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద నాన్నపై మా శత్రువర్గం వారు హత్యాయత్నం చేశారు. 20కి పైగా కత్తిపోట్లు పడ్డాయి. ఆయన కేకలకు ఇంట్లో ఉన్న అమ్మ, నేను పరుగెత్తుకుంటూ వెళ్లాం. రక్తంమడుగులో ఉన్న నాన్నను చూసి చాలా భయపడ్డాను. భుజానికెత్తుకు ందామని ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. మాకు దక్కుతాడని అనుకోలేదు. ఐఎఎస్ అవ్వాలన్న నా ఆశ...అక్కడే చచ్చిపోయింది. చదువు మానేసి ఆయనకు సెక్యూరిటీ గార్డుగా మారిపోయాను.

ఇప్పటికీ నాన్న గురించి ఆలోచిస్తే...నాకు మొదట గుర్తుకు వచ్చే విషయం ఇదే. అదే నా బలహీనత, అదే బలం కూడా. కాంగ్రెస్‌లో నాన్నపై కక్షసాధింపు చర్యలు భరించలేక 1994లో తెలుగుదేశం పార్టీలో చేరాను. అమ్మానాన్నలను చూడాలనుకున్నప్పుడల్లా కర్నూలు వెళ్లిపోతాను. నాన్నతో కూర్చుని రాజకీయాలు మాట్లాడుతుంటే సమయమే తెలియదు.

Wednesday, June 15, 2011

నా భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందనే నమ్మకం నాకుంది. * రే క్రాక్

రే క్రాక్.. 52వ వసంతంలో మొదలైన జీవనయానం. నా వయస్సు 52 డయాబెటీస్ ఆర్ధట్రాయిస్.. రెండూ ఉన్నాయి నాకు. ఇంతకు మునుపే గాల్ బ్లాడర్‌ని, థైరాయిడ్ గ్లాండ్‌లోని చాలా భాగం తీసేసారు. అయినప్పటికీ నా భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందనే నమ్మకం నాకుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెక్ డొనాల్డ్ సంస్థ నిర్మాణంలో ముఖ్య భూమిక నిర్వహించిన రే క్రాక్ చెప్పిన మాటలివి. ఎప్పుడు మెక్ డొనాల్డ్ సంస్థలో చేరే ముందు.

మనలో చాలా మంది ఏ చిన్న ఎదురు దెబ్బ తగిలినా చివరికి జలుబు చేసినా తల్లడిల్లి పోతాం. ధైర్యం తక్కువ, పిరికితనం ఎక్కువ. గెలుపు మీద కంటే ఓటమి మీదే నమ్మకం ఎక్కువ. తప్పక గెలుస్తామనే నమ్మకం కంటే గ్యారెంటీగా ఓడిపోతామనే నమ్మకం జాస్తి. వీరందరికీ రే క్రాక్ మాటలు మార్గదర్శకమవ్వాలి. 

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgJui9JLjQSSMUu6m30oSGwwJUjy9FpdJI6HMCiYM0D1gIf9sIF2UJt4E7QASFX7MtzciTlpdcS1dtEjRNMmn1v8FGMBqbI-tfOPKRxf1fWp76Xw7bE1KigHftvuFOS-DIc1OJ3qzpm7BN8/s320/Kroc.jpg

సాధించిన రేక్రాక్

మెక్ డొనాల్డ్స్‌ను ఒక గొప్ప అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దిన రే క్రాక్ గురించిన ముచ్చట్లు మొదలుబెట్టాం గతవారం. ఆయన ఎంతో గర్వంగా తనను గురించి చెప్పుకున్న మాటల్ని మరోసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. నా వయస్సు 52, డయాబిటీస్, ఆర్ధయిటిస్ రెండు ఉన్నాయి. నాకు ఇంతకు మునుపే గాల్ బ్లాడర్‌ని, థైరాయిడ్ గ్లాండ్‌లోని చాలా భాగం తీసేసారు. అయినప్పటికీ నా భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందనే నమ్మకం నాకుంది. ఇటువంటి ధైర్య సాహసాలు, స్వశక్తిపై విశ్వాసం, నమ్మకం.. ఎటువంటి అడ్డంకులు వచ్చినా కలలను సాకారం చేసుకోవాలనే తపన ఉన్న ప్రతి వ్యక్తి విజేతగా రూపాంతరం చెందుతాడు. ఇందులో ఎలాంటి సందేహానికి తావులేదు.http://www.browsebiography.com/images/2/808-ray_kroc_biography.jpg
ఆశావాదం విజేతకి కావాల్సిన ఒక గొప్ప అవసరం. చాలామంది విజేతల్లో మనకు కొట్టొచ్చినట్లు కనబడే గుణమిదే. మనం ఓ స్వామివారి దగ్గరికెళ్లి మన కష్టాల్ని ఆయన పాదాల మీద కుమ్మరిస్తాం. ఆయనేమని దీవిస్తారు ? ధైర్యంతో ఉండు.. అన్ని సర్దుకుంటాయి అనేగా. అలాకాకుండా ఇది కష్టకాలమే అంటే మన గతేం కాను. ప్రాణం ఊసురుమంటుంది.

అలాగే డాక్టర్ కూడా.. మా ఫ్యామిలీ డాక్డర్ గారున్నారు డాక్టర్ మనోజ్ కుమార్ గారని. ఆయన్ని కలుసుకుంటేనే సగం బాధ, రోగం తగ్గిపోతాయి. ఇక ఆయన చెప్పిన ధైర్య వచనాలు విన్నాక మిగతా సగం మారిపోతాయి. వైద్యుడు దేముడితో సమానం అన్నారు కదా ఆర్యులు. వారు మనకిచ్చేదేమిటి ? ధైర్యమే కదా. ఆపదలు తొలగిపోతాయని నమ్మకమే కదా.
http://jeremywaite.files.wordpress.com/2010/05/0427_18innova.jpg
ధైర్యే సాహసే లక్ష్మీ. ఆశావాదికి అలవోకగా అబ్బే గుణమే ధైర్యం. రే క్రాక్‌కి ఉన్నన్ని ఆరోగ్య సమస్యలు మరెవరికైనా ఉండి ఉంటే అన్ని పనులు వదిలి, నిరంతరం దిగులుతో నిస్సహాయంగా పైవాడి పిలుపుకి ఎదురు చూస్తుండేవారు అవునా కాదా ? మెక్‌డొనాల్డ్ సోదరులు స్థాపించిన మెక్‌డొనాల్డ్ హేంబర్గర్ రెస్టారెంట్స్‌ని కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేసిన ఘనత రే క్రాక్‌ది.http://static6.businessinsider.com/image/4d52e37349e2ae5b32180000-400-300/1-raymond-albert-kroc-mcdonalds.jpg
ఈ రంగ ప్రవేశం చేసే ముందు రే క్రాక్ రకరకాల పనులు చేశాడు. తన పదిహేనో ఏట ట్రక్ డ్రైవర్ అయ్యాడు. ఆ తర్వాత పియానో ప్లేయర్ ఉద్యోగం సంపాదించాడు. ఆ పిమ్మట పేపర్ కప్పులు అమ్మే కంపెనీలో సేల్స్‌మెన్ అయ్యాడు. ఈ ఉద్యోగంలో ఉన్నప్పుడే మిల్క్ షేక్ మిక్సర్లు తయారు చేసే ఓ పెద్ద మనిషితో పరిచయమైంది. ఆ పరిచయం ఆ కంపెనీలో ఓ ఉద్యోగిగా మార్చగా ఆ తర్వాత 17 సంవత్సరాలు మిక్సర్లు అమ్ముతూ అమెరికా అంతా తిరిగాడు. http://www.keyvive.com/wp-content/userimages/1268755181ray-kroc-and-mcdonalds.jpg
అలా తిరుగుతూ మిక్సర్లు అమ్మటానికై మెక్ డొనాల్డ్ సోదరులను కల్సుకున్నాడు. వాళ్లు నడుపుతున్న రెస్టారెంట్స్ రే క్రాక్‌ని ఎంతో ప్రభావితం చేసినాయి. అవి ఎంతో చక్కని రెస్టారెంట్స్ అని వాటిని దేశవ్యాప్తంగా తెరిస్తే వాటికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని రే క్రాక్ ఆ సోదరులకు చెప్పాడు.http://www.teambuilding-leader.com/images/RayKroc.jpg
ఆయన బాగానే ఉంది కాని ఈ బాధ్యతనెవరు తలకెత్తుకుంటారంటే నేలేనా అన్నాడు. రెస్ట్ ఈజ్ హిస్టరీ మిగతాదంతా చరిత్ర అంటాం కదా. అలాగే రే క్రాక్ మెక్ డొనాల్డ్స్‌లో చేరాక ఒక చరిత్ర సృష్టికి మూలకారకుడయ్యాడు. అప్పుడు ఆయన వయస్సు 52. ఎన్నో ఆరోగ్య సమస్యలతో పో రాడుతున్నాడు. అయితే అదేమి ఆయన్ని క్రుంగ దీయలేదు. https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjvvaf_ciKkNtoQdbaK3Ij51pW3FN7mkQH5Vr1nOg8q1ACLyoPPaWnbHdSSGjpZ4UX9fs2aPuMxIuyuXT48mb5F0CyD8NmYMCb4MSU1xIkHkH7xHkeiBNRE8B_LYBq7gsNzYbBTLi720xnD/s1600/June+Martino.jpg

June Martino - The Silent Backbone of McDonald's

Ray Kroc, Harry Sonnenborn, June Martino, Don Conley & Fred Turner - 1960 
In 1948 June Martino became Ray Kroc's (founder of McDonald's Restaurants) bookkeeper. She rose to Corporate Secretary, Director and part owner of the corporation. 

అందుకు ఒకటే బలమైన కారణం. ఆయన కన్న కలలు సాకారం చెందే ఘడియలు ఇంకా చేరువ కాలేదు. అందాకా తన కృషి సాగుతూనే ఉండాలి అనేది ఆయన నమ్మకం. ముందు చెప్పుకున్నట్లుగా వేరెవరికయినా అలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన వలసి వస్తే అదే జీవిత చరమాంకం అనుకుని ఆగిపోయి ఉండేవారు. కాని రే క్రాక్ విషయంలో ఆయనకు తన ఆరోగ్య సమస్యలు గొప్ప సమస్యలుగా గోచరించినట్లు ఆధారాలు లేవు.

రే క్రాక్ గురించి నేను రీసెర్చి చేస్తున్నప్పుడు ఎక్కడ ఆయన తన ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావించలేదు. కనుక ఆయన పరిపూర్ణ ఆరోగ్యవంతుడనుకున్నాను. తర్వాత ఆయన ఆరోగ్య విషయం గురించి అసలు సంగతి తెలుసుకున్నాక నోట మాట రాలేదు. ఈయన తన 52 వ ఏట ఇటువంటి అనారోగ్యంతో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాడా? ఆకాశానికి అంతేది ? అవకాశాలకు అంతేది? ధైర్య సాహసాలు, కలలు గమ్యాలున్న వ్యక్తికి ఎదురేది ? నేను ఆరాధించే హీరోల్లో రే క్రాక్ ముఖ్యులు. కొండంత ధైర్యం, అన్నీ సుసాధ్యాలే అని నమ్మే ఆయన మనస్తత్వం ఈ ఆరాధానికి కారణం. ఇలాంటి వ్యక్తులు చాలా కొద్ది మంది తారసపడ్తారు మనకు జీవితంలో.

వారి జీవితాలు నేర్పే పాఠాలు అమూల్యమైనవి. ఆచరణీయమైనవి. నేటి మెక్‌డొనాల్డ్స్ విశ్వ దర్శనానికి రే క్రాక్ కృషి మూల స్థంభం. ఒకసారి గూగుల్ సెర్చ్‌కి వెళ్లి నేటి మెక్ డొనాల్డ్ రూప దర్శనం చేయండి. అదో అంతర్జాతీయ మహా వృక్షం. విత్తనం వేసింది మెక్ డొనాల్డ్స్ సోదరులైనప్పటికీ ఈ సంస్థను ప్రపంచమంతటా విస్తరింప చేసి నేటి స్థాయికి తెచ్చిన ఘనత రే క్రాక్‌దే.

జయహో రే క్రాక్ మహాశయా.. జయహో.

 - ఎజి కృష్ణమూర్తి

Tuesday, June 14, 2011

కల, కృషి, కాలం.. ఇవే మన ఆయుధాలు.

 http://www.hindu.com/mag/2006/03/26/images/2006032600370104.jpg
కలలను, గమ్యాలను విడనాడొద్దు. ప్రఖ్యాత రచయిత పాల్ కోయిలో చెప్పినట్లుగా మీకే బలమైన కోరికుంటే, ప్రపంచంలోని అన్ని శక్తులు కుట్రపన్ని, కూడబలుక్కుని మీ కలలను సాకారం చేస్తాయి. కుట్రపన్ని.. ఎంతో పవర్‌ఫుల్ శక్తివంతమైన పదప్రయోగం. ఎంత గట్టి నమ్మకం లేకపోతే పాల్ కోయిలో దీన్ని వాడుంటాడు. ది వరల్డ్ లవ్స్ ఎ లవర్ అనేది నానుడి. ప్రేమికులను ప్రపంచం ప్రేమిస్తుందని.. అలాగే కలలు, గమ్యాలు కల వారికి ప్రపంచంలోని అన్ని శక్తులు సహకరిస్తాయి.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgxPXhA5Hf00b2VDXfMw1eVBsN-SLZe9CmJp2OhklM_P9PSnB18l7kbONuWEUbfaWrSS4uuHRQPiMJppt9O7wtBsE_6vDG4AlL_BzsmX9Qt8nsjaH26seJFT97UhAZG-MjMpcqv0FTk1W8r/s1600/tyeb_mehta_tayyab_india_artist.jpg
తయబ్ మెహతా ఈ మహాశయునికి తన కల నిజమైంది ఎనభయ్యోపడిలో ప్రవేశిస్తున్న తరుణంలో. తయబ్ మెహతా.. నెమ్మదస్తుడు. నిరహంకారి. పెయింటర్. పేరు ప్రఖ్యాతులున్న పెయింటర్ అనగానే ఎంతో గర్వంతో, అంటీ అంటనట్లు ఉంటారేమోననుకుంటాం. మన మనస్సులో సృష్టించుకున్న పెయింటర్ల రూపకల్పనకు పూర్తి విరుద్ధం తయబ్ మెహతా. పెయింటింగ్ తనకు స్పూర్తిదాయకమైంది. గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. కనుకే పెయింటర్ అయ్యాడు కాని ధనార్జన కోసం చేపట్టిన వృత్తి కాదు.

గత అధ్యాయం పేరు ప్రతిష్ఠల ఫలితమే డబ్బులో ఈ విషయా న్ని కూలంకషంగా చర్చించుకున్నాం కదా. ఇదే జరిగింది తయబ్ మెహతా విషయంలో కూడా. ఖ్యాతి.. ఆపై ధనార్జన.. వృత్తిరీత్యా ముంబైలోని ఫేమస్ స్టూడియోలో ఎడిటర్‌గా పనిచేస్తుండేవాడు. అయితే ఆ ఉద్యోగం మూడునాళ్ల ముచ్చటే అయింది. మళ్లీ విద్యార్ధిగా మారాడు ముంబైలోని సర్ జెజె ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్‌లో చేరి పెయింటింగ్‌లో డిగ్రీ పుచ్చుకున్నాక పుంఖానుపుంఖాలుగా పెయింటింగ్స్ వేశాడు.
http://www.economist.com/images/columns/2007w28/KaliHead.jpg
మధ్య తరగతి వర్గానికి చెందిన పలు పెయింటర్లలాగా తిండి, బట్టకే కాదు, పెయింటింగ్ చేసుకునే కాన్వాస్ కొనటానికి కూడా డబ్బు ఉండేది కాదు. పేరు ప్రఖ్యాతులు గడించాక న్యూయార్క్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు తయబ్.. ఎగ్జిబిషన్‌లో పెట్టేందుకు కావాల్సిన కాన్వాస్ కొనే స్థోమత కూడా కరువయ్యేది కొన్నిసార్లు.. అని. ఇంట్లో ఎప్పుడైనా తిండికి డబ్బుల్లేక పోతే పోన్లే ఈ రోజు పస్తుంటాను అని తయబ్ అంటే లేదు మనిద్దరం కలసి పస్తుందాం అనేదట ఆయన భార్య. భార్య సంపాదించేంది. తయబ్ పెయింట్ చేసేవాడు. ఇలా ఒక పుష్కర కాలం గడిచింది కష్టాల్లో, కడగండ్లతో.. చివరికి తయబ్ తన ఫస్ట్ పెయింటింగ్‌ను తన మిత్రుడు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెయింటర్ ఎంఎఫ్ హుస్సేన్ ద్వారా పరిచయమైన వ్యక్తికి అమ్మాడు 30 అమెరికన్ డాలర్లకు.. అంటే 1,350 రూపాయలకు.

పోరాటం..పోరాటం.. జీవన పోరాటం... ఇలా సాగుతూనే ఉంది ఏళ్ల తరబడి తయబ్ జీవితంలో. తను 75వ వసంతంలో ప్రవేశిస్తున్న తరుణంలో, గుర్తింపు అదీ అంతర్జాతీయ ప్రమాణాల్లో లభించింది. ఆ గుర్తింపుతో పాటు లక్ష్మీ కటాక్షం. సెలబ్రేషన్ అనే ఆయన సృష్టి మూడు లక్షల అమెరికన్ డాలర్లకు విక్రయించబడింది. నేటి రేట్ల ప్రకారం కోటి ముప్ఫై లక్షల రూపాయలన్నమాట. ఆ తర్వాత మరో విక్రయం.. క్రిస్టీస్ న్యూయార్క్అనే అంతర్జాతీయ వేలం పాడే సంస్థ తయబ్ మహిషాసుర అనే సృష్టిని 1.58 మిలియన్ అమెరికన్ డాలర్లకు విక్రయించింది. అంటే దాదాపు ఏడు కోట్ల రూపాయలు. ఇది రికార్డులను బద్దలు కొట్టిన విక్రయం.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiLp6K_NPPSmGy0x_P9xpzF7EAWOsu_80UmN9BsCM4g1SbbpvasRLJWeHA01BR5Uo2i8xwVCzX9VuQJoRFgGOgOK3NAzkCLoxvaUbWA5caTeyC-_b1G0v1UnehYzLwQz_oSYE2xhfjT9j8U/s1600/tyeb_mehta_tayyab_india_artist03.jpg
ఏ భారతీయ పెయింటర్‌కైనా ఒక మిలియన్ డాలర్ల మూల్యం లభించిన ప్రథమ సందర్భం ఇదే. అంటే ఈ రంగంలో ఒక నూతన శకానికి నాంది పలికిన విక్రయం దాన్ని తయబ్ ఎనభయ్యో పడిలోకి ప్రవేశిస్తూ సాధించాడు. అందుకే చెప్పేది మాటిమాటికి, మరోసారి, మరోసారి అని ఆశను, గమ్యాన్ని కోల్పోకుండా మనం ముందుకు సాగిపోతూనే ఉండాలి. కలల్ని గుండెల్లో భద్రంగా పదిలపరచుకొని. అవకాశం ఎప్పుడు వస్తుందో తెలీదు కాని తప్పక వస్తుందనేది మాత్రం నిజం, ముమ్మాటికీ నిజం. మన నిరీక్షణ సాగిపోతూనే ఉండాలి.

మహిషాసుర రూ.7 కోట్లు


Mahishasura – sold for $1,280,900
Mahishasura by Tyeb Mehta
తయబ్ జీవిత కాలం కృషికి ప్రతిఫలం.. పేరు ప్రతిష్ఠ, లక్ష్మీ కటాక్షం.. ఆయన డెభ్భై ఏడో వసంతంలోకి అడుగిడబోతుండగా లభించింది. మీకు, నాకు ఎంతో తొందరగా లభ్యం కావచ్చు లేదా ఆలస్యంగానైనా. తన పెయింటింగ్‌కి ఎన్నో కోట్ల ధర పలికిందన్న వార్త సంతోషం కన్నా ఒక తమాషాలాగా, విచిత్రంగా గోచరించింది తయబ్‌కి. ఒక ఇంటర్వ్యూలో ఈ గుర్తింపు నా జీవితంలోనే జరిగినందుకు సంతోషంగా ఉంది. నా వయస్సు ఎనిమిది పదులు. ఎప్పుడైనా పైనుంచి పిలుపు రావచ్చు. ధనవంతుల వాళ్లకిష్టమైన ధరకు నా పెయింటింగ్స్‌ను కొనుక్కోవచ్చు అది వాళ్లిష్టం అన్నాడు తయబ్. తయబ్ జీవిత అనుభవాలు మనకు మార్గదర్శకాలవ్వాలి.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjA2e35AC7wWn9auRRJeLY2SLZs3QgZqYRW8bhs8VuiBS0R8hYXP1BwIpPT5mGWQ49AlI62RuIzEDXcAdqs_HP3saqVYZ5MRVtqbdQ95j1-mhDavMER9R4YLsxiTfBj4221jVUPlwzK0C9h/s1600/tyeb_mehta_tayyab_india_celebration_03.jpg
నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా మనపని మనం చేసుకుంటూ ఉండాలి. కలల్ని సజీవంగా ఉంచుకోవాలి. మరోసారి అం టూ అలుపెరగకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. పదేపదే ఈ విషయాన్నే వత్తివత్తి ఎందుకు చెబుతున్నానంటే కొంచెం నిరాశ నిస్పృహలకే గమ్యాలను వదలి కొత్త దోవలను ఎంచుకునే వారెందరో. మరో తరగతికి చెందిన వారు వృత్తి ఒకటి, ప్రవృత్తి మరొకటిగా ఎంచుకుని ఆ రెండింటిలోని ప్రత్యేకమైన అర్హతలుగాను అనుభవం కాని పొందక, ఆశించిన ఫలితాలు పొందలేక జీవితాసక్తి కోల్పోతారు.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhQwjNLounz21BWecaH89rU4VzuCMljWi0xItCN-ritwXPbT1MWG_Q0FOklpZD72OJOls_h256QX-Dcvr1xsB4iSCjodzlpXxrssd0tIfeAOZnpoIPU_Y0KiikbAO5gT7Z3ey7atmyxi7Ye/s1600/tyeb_mehta_tayyab_india_artis01.jpg
ఇదికాదు మార్గం.. తయబ్‌కి తనకిష్టమైన రంగం పెయింటింగ్ అని గ్రహించాక ఆ రంగంలో అర్హత, అనుభవం పొంది కొన్ని దశాబ్దాలు నిరాశ, నిస్పృహలకు గురి కాకుండా తన పనిచేసుకుంటూ పోయాడు. విజయాలు కాక మరేం వరిస్తాయి అటువంటి దీక్ష, పట్టుదల కలిగిన వ్యక్తులను. ఒకే జీవితం, ఎన్నో అవకాశాలు. ఆత్మానందం ఎదురు చూస్తోంది మన కోసం. కల, కృషి, కాలం.. ఇవే మన ఆయుధాలు.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiBRnhCS2XVdcqp0mmOxNviF7YdJtXA3-fU3mCxtT1Zk47MzF-jihsteDCMKUaV13ziedO59bVzxSXG6-t52EV51YcA1FFTDV_q1JJKoWBHogqWyiThgLtAzUD6LiTJVCFAJjfFtZ2PVzS7/s1600/tyeb_mehta_tayyab_india_artist02.jpg
మనపై మనం పెంచుకున్న అపనమ్మకాన్ని పారద్రోలి నమ్మకాన్ని పెంచుకోవాలి. మా గురువుగారు చెప్పినట్లుగా శక్తినంతయు నీలో కలదన్నా... లోని శక్తిని తెలిసి ధైర్యమును కలిగి యుండన్నా. అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయి మనలో.. నిద్రాణమైన వాటిని వెలికితీస్తే ఎదురేముంది.
- ఎజి కృష్ణమూర్తి

నమ్మకమే నడిపిస్తుంది

ఎన్ని అడ్డంకులొచ్చినా మీ కలలను, గమ్యాలను విడవద్దు.. మరోసారి ప్రయత్నిస్తానంటూ పదండి ముందుకు. విజేతలకి, ఇతరులకు ఉన్న తేడా ఇదే. కలల్ని మన సొంతం చేసుకొని అవి మన పంచప్రాణాలేమోనన్నట్లుగా వాటిని గుండెలకు హత్తుకుని మన దగ్గరే పదిలంగా ఉంచుకుంటే అవి సాకారం కాక మానవు.  
రోమ్‌ని ఒక రోజులో నిర్మించలేదన్నట్లుగా మన గమ్యాలు, కలలు ఒక్క రోజులో తీరేవి కావు. మన కలలకు ప్రతి రూపాలుగా మనం తీర్చిదిద్దే మన పిల్లలు పెరిగి పెద్దవారై ప్రయోజకులు కావటానికి దాదాపు పాతికేళ్లు పడుతుంది కదా అందాక మనం శ్రమిస్తూనే ఉంటాం కదా! అలాగే మన ఇతర కలలు, గమ్యాలు కూడా. ఈ మధ్య నా గురువు గారు గీరా బెన్ శరభాయి గారిని కలుసుకున్నాను.
http://gujarattourism.net/gifs/baroda-museum.jpg
ప్రపంచం గర్వింపతగిన కేలికో మ్యూజియం ఆఫ్ టెక్స్‌టైల్స్ సృష్టికర్త ఆవిడ. ఒక జీవిత కాలం అవిరామ శ్రమకు ప్రతిరూపం ఆ మ్యూజియం. భారతీయ వస్త్ర సంపద 15 వ శతాబ్దం నుంచి నేటి దాకా కన్నులకు కట్టినట్లు కనబడుతుంది ఆ మ్యూజియంలో. అక్కడ నేను పనిచేయటం ఆ మ్యూజియంలో ప్రదర్శించిన వస్త్ర సంపదను విస్తృతపరిచే యజ్ఞంలో నేను సైతం రెండు మూడు చిరు సమిధలు వేశాను.

భారతీయ వస్త్ర సంపదను తిలకించాలంటే ఈ మ్యూ జియం కన్నా మెండైనది ప్రపంచంలో మరెక్కడా లేదు. వారిని కలుసుకున్నప్పుడు అన్నాను ఇంత గొప్ప మ్యూ జియం సృష్టించిన మీరు చరితార్ధులని. ఆవిడ జవాబు.. కల, గమ్యం స్పష్టంగా మన ముందుంటే పట్టుదల దానికి జోడిస్తే కాలమే మన కలలను సాకారం చేస్తుందని. నిజమే ఓర్పు ఉండాలి. కృషిని విడనాడకూడదు. మన కలలపై నమ్మకముండాలి. అశాంతితో, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఓ పెద్దమనిషి ఒక గురువు గారి దగ్గరకు వెళ్లి మనశ్శాంతికి తనకేదైనా మంత్రోపదేశం చేయమన్నాట్ట అదీ చాలా సింపుల్‌గా! సూక్ష్మంలో మోక్షం కావాలి ఈ పెద్ద మనిషికి. ఆ గురువు గారు అతి చిన్న మంత్రాన్ని ఉపదేశించారు ఈయన గారికి.. అదేమంటే.. ఓ గాడ్ సేవ్ మీ. చాలా చిన్న మంత్రం కదూ. ఈ పెద్ద మనిషి అనుమానాల పుట్ట. అన్నీ అనుమానాలే. గురువు గారు చెప్పిన మంత్రాన్ని మార్చి ఇలా చెప్పుకున్నాడు. ఓ గాడ్ (ఇఫ్ యూ ఆర్ దేర్.. ఓ భగవంతుడా నీవంటూ అసలు ఉంటే) సేవ్ మీ (ఇఫ్ యూ కెన్ సేవ్ మీ.. నన్ను రక్షించగలిగితే రక్షించు). ఎంత నమ్మకం ! ఎంత గురి ! ఇటువంటి వ్యక్తిత్వమున్న వ్యక్తులను అంటే తన మీద గాని ఇతరుల మీద గాని నమ్మకం విశ్వాసం లేని వ్యక్తులు.. కలలేం కనగలరు ? వాటినెలా సాకారం చేసుకోగలరు ?? కల, కృషి, కాలం.. ఈ మూడు మనని మన గమ్యాల దాకా చేరుస్తాయి. వాటిని ఎట్టి పరిస్థితులలో మరిచిపోకూడదు, గమ్యాలను విడనాడకూడదు. రచయిత అంటే సమాజంలో గౌరవ మర్యాదలుంటాయి. అవి ఇతరులను ఇంప్రెస్ చేయటానికి కూడా పనికొస్తాయని, చిన్న చిన్న రచనలు చేయటం మొదలుబెట్టాను. ఎప్పటికైనా కాస్త పేరున్న రచయిత కావాలని బలమైన కల ఉండేది. 1964లో నా మొట్టమొదటి కథ... తానొకటి తలిస్తే.. ఆంధ్ర సచిత్ర వార పత్రికలో అచ్చయింది. ఆ పైన అడపాదడపా కథలు, రేడియో నాటికలు రాస్తుండేవాణ్ణి. ఈ వ్యాపకంలోనే మహానుభావుడు ఉషశ్రీతో పరిచయమైంది 1967లో. న్యూ నల్లకుంటలో పక్కపక్క భాగాల్లో ఒకే ఇంట్లో ఉంటుండే వాళ్లం నా కుటుంబం, ఉషశ్రీ గారి కుటుంబం. రేడియో నాటకాల రచనకు ప్రోదల్భం, సూచనలు ఆయనే అందిచ్చారు. కొన్ని దశాబ్దాలైనా వారి జ్ఞాపకాలు మదిలో ఇంకా ఎంతో తాజాగానే ఉన్నాయి.

1967లో పెళ్లి. 1968లో అహ్మదాబాదుకి తరలి వెళ్లటంతో నా రచనా వ్యాసాంగం మరుగున పడిపోయింది. కొత్త ఊరు, కొత్త మనుషులు, మరీ కొత్త భాష, సంస్కృతి.. జీవన పోరాటంలో నిమగ్నుడినై పోయాను. అయితే నాలోని రచయిత నిద్రాణమై ఉన్నాడు తప్పితే పూర్తిగా నా నుంచి దూరం కాలేదు. రచయిత కావాలనే తృష్ణే పలు అంశాలపై వ్యాసాలు రాసేందుకు పురికొల్పింది. ఈ తృష్ణే ప్రకటనలను సృష్టించటం అందులో భాగంగా ప్రకటనలు రాస్తూ ఉండటం నా వృత్తిగా, నా వృత్తి ధర్మంగా మారిపోయింది అయితే అవన్నీ ఇంగ్లీషులో, తెలుగులో. 1968 తర్వాత ఏదైనా రాసిన జ్ఞాపకం లేదు. 2001లో ముద్రాకు నేనింకా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తుండగా, సడన్‌గా పుస్తక రచనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. అమెరికన్ పబ్లిషింగ్ సంస్థ మెక్‌గ్రా హిల్ మేనేజింగ్ డైరెక్టర్ సింగపూర్ నుంచి అహ్మదాబాదు ఏదో పనిమీద వచ్చి నన్ను కలుసుకున్నాడు. నా ముద్రా అనుభవాల మీద ఒక పుస్తకం రాస్తే చాలా బాగుంటుందని, అది అడ్వర్‌టైజింగ్ రంగానికే కాకుండా, మేనేజమెంట్ రంగానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందన్నాడు. ఆలోచిస్తానని మాటిచ్చి, జీవన పోరాటంలో మళ్లీ తలమునకలయ్యా.

2003లో నేను ముద్రాను విడిచి రిలయన్స్‌లో అడ్వైజర్‌గా చేరటం, నాకు రచనా వ్యాసాంగానికి సరిపడా టైమ్ లభ్యం కావటంతో దాదాపు 35 ఏళ్ల క్రితం నాలో నిద్రించిన రచయిత మేలుకొని మళ్లీ రచయితనయ్యాను. 2005లో నా మొదటి ఇంగ్లీషు పుస్తకం ది ఇన్‌విజిబుల్ సిఇఒ ప్రచురింపబడింది. కవర్ పేజీ మీద ఉన్న నా పేరును అలాగా ఎంత సేపు ఎన్నిసార్లు ఆనందంగా చూస్తూ ఉండిపోయానో ! కల నిజమాయెగా, కోరిక తీరెగా అని పాట పాడానో లేదో తెలియదు కాని, ఆనాటి నుంచి నేటి దాకా నా ప్రతి పుస్తకం ప్రతి వ్యాసం ప్రచురింపడిన రోజున అమితానందం కలుగుతుంది. రెక్కలొచ్చి ఆకాశంలో విహరిస్తున్నానేమో అనిపిస్తుంది. ఇష్టమైన పని చేస్తే వచ్చే తృప్తి ఆనందం ఈ రచనా వ్యాసాంగం ద్వారా నేను తెలుసుకున్నాను , అనుభవిస్తున్నాను. ఇంగ్లీషులో నిర్విరామంగా పక్షానికో వ్యాసం చొప్పున బిజినెస్ స్టాండర్డ్‌లో ఆరు సంవత్సరాల పాటు ఎజికె స్పీక్ అనే శీర్షిక కింద నా వ్యాసాలు అచ్చయ్యాయి. వాటి ద్వారా ఎందరో ప్రముఖులతో పరిచయమైంది ఎందరో నా అభిమానులుగా మారారు. ఆంధ్రజ్యోతిలో ప్రతి వారం ఎజికె వారం వారం శీర్షికన 2005 నుంచి మూడేళ్లు 130కి పైగా వ్యాసాలు అచ్చయ్యాయి. తిరిగి గత 43 వారాలుగా ఈ జయహో వ్యాసాలు ప్రచురితమవుతున్నాయి. నేటి దాకా ఇంగ్లీషులో ఆరు పుస్తకాలు, తెలుగులో పది పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ఇంగ్లీషులోని నా పుస్తకాలు ధీరూభాయిజమ్, ఎగెనెస్ట్ ఆల్ ఆడ్స్, టెన్ మచ్ పలు దేశీయ భాషల్లో ప్రచురితమై అసాధారణ విజయాన్ని చవిచూసినాయి. గుజరాతీలో అయితే ధీరూభాయిజమ్ పుస్తకం ఆ భాషలోని ఆల్‌టైమ్ బెస్ట్ సెల్లర్స్‌లో ఒకటిగా చేరింది. ఇంగ్లీష్‌లో ఇదే పుస్తకం 2007 నుంచి నేటిదాకా పన్నెండు సార్లు ముద్రితమైంది. ఇదంతా సొంత డబ్బా కొట్టుకోవటం కాదు. బలమైన కల ఉంటే కాలమే దాన్ని సాకారం చేస్తుందనే నిజాన్ని మీ ముందు సోదాహరణంగా ఉంచటానికే.

35 ఏళ్లు రచనా వ్యాసాంగానికి దూరంగా ఉన్న నేను ఇంత ప్రాలిఫిక్ రైటర్.. అంటే ఎంతో విరివిగా రచనలు చేసే రచయితగా ఎలా మారానో నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇట్టే అవగతమవుతుంది. బలమైన కల, గమ్యం, పట్టుదల అవే మనకు మార్గదర్శకాలవుతాయని. చిన్నప్పటి నా కల 45 ఏళ్ల తర్వాత నిజమైంది. అయితే ముందుగా ముచ్చటించుకొన్నట్లుగా కలలను విడనాడకూడదు. వీటిని మనస్సులోనే పెట్టి బంధించాలి. ఓర్పు పెంచుకోవాలి. రోమ్ మహానగరం ఒక్క రోజులో నిర్మాణం కాలేదనే సత్యాన్ని పదేపదే మననం చేసుకోవాలి. కల, కృషి, కాలం.. ఈ మూడు ఏకమై మన కలల్ని నేడు కాకపోతే రేపైనా సాకారం చేస్తాయనే ధృడమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకోవాలి. మనసు మార్చుకోవద్దు. కలలను చంపుకోవద్దు. అర్థాంతరంగా జీవితాన్ని వివిధ మలుపులు తిప్పవద్దు. ఇష్టమైన దాని కోసం కష్టపడండి. మరోసారి ప్రయత్నించి చూడండి. ఇంకొంచెం, మరికొంచెం కాలం వేచి చూడండి. ఈ ప్రక్రియ వల్ల లాభమే కాని నష్టమంటూ ఏమీ జరగదు. ప్రసిద్ధ రచయిత పాల్ కోయిలో అన్నట్లు మీకే బలమైన కోరికుంటే ప్రపంచంలోని అన్ని శక్తులు కుట్రపన్ని కూడబలుక్కొని మీ కలను సాకారం చేస్తాయి. అక్షర సత్యం ఇది.
* ఎజి కృష్ణమూర్తి

Wednesday, June 1, 2011

ప్రపంచం మీ గుప్పిట్లో...

 http://www.prajasakti.com/images_designer/article_images/2011/4/24/aptn-1303669315342.jpg
అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక సామాన్య రైతు, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు. సమస్యల్లో ఉన్న ఇరుగుపొరుగు వారికి మంచి సలహాలిచ్చి ఆదుకుంటాడని మంచి పేరుంది ఈ పెద్ద మనిషికి. ఒక రోజు ఆ దేశ రాజు ఆ గ్రామం నుంచి వెళ్తూ.. మన రైతు గురించి, ఆయన మంచి గురించి, అతనిచ్చే సలహాల గురించి విని ఆయన్ను పిలిపించి అడిగాడు రోజూ నీ సంపాదన ఎంతా అని. ఒక రూపాయని చెప్పాడు.

రూపాయికి ఎంతో విలువున్న రోజులవి. ఆ రూపాయిని ఎలా ఖర్చు పెడ్తున్నావన్నాడు రాజు. ఒక పావలా తినేస్తాను, రెండో పావలా అప్పుగా ఇస్తాను. మూడో పావలాతో అప్పు తీరుస్తాను. నాలుగో పావలాని పారేస్తాను అన్నాడు ఆ రైతు. ఇదో పజిల్‌లాగా, మెదడుకు మేత వేసే సమస్యాపూరణం లాగా గోచరించింది రాజుకి. సరిగ్గా అర్థమయ్యేలా చెప్పవయ్యా అన్నాడు రాజు. మొదటి పావలా నాకు నా భార్య తిండి ఖర్చులకు వినియోగిస్తాను. రెండో పావలా పెట్టుబడిగా నా పిల్లల మీద వెచ్చిస్తాను. రేపు నాకు నా భార్యకు వృద్ధాప్యంలో పిల్లలు తోడు నీడగా ఉంటారనే ఆశతో. మూడో పావలాతో నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటాను. మిగిలిన నాలుగో పావలాను బీద వారికి దానం చేస్తానన్నాడు. సంతోషం, ఆశ్చర్యం రెండూ కలిగాయి రాజుకి ఏకకాలంలో. ఈ పజిల్ జవాబుని వేరెవ్వరికీ చెప్పవద్దని, తన ముఖాన్ని వంద సార్లు చూసాకే ఎవరికైనా చెప్పాలని ఆజ్ఞాపించాడు రాజు. సరేనన్నాడు రైతు.

రాజధాని చేరిన రాజు రైతు జీవన శైలిని ఒక చిక్కు ప్రశ్నగా మార్చి దాన్ని విప్పమన్నాడు. ఎంత తలబద్దలు కొట్టుకున్నా ఎవ్వరికీ సమాధానం దొరకలేదు. మంత్రి కనుగొన్నాడు రాజు ఒక గ్రామానికి వెళ్లటం. అక్కడో రైతుని కల్సుకోవటం. వెంటనే ఆ గ్రామం చేరుకొని మన రైతును కల్సుకొని ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పమన్నాడు. రాజుకు మాటిచ్చాను. చెప్పలేనన్నాడు రైతు. వంద నాణాలు బహుమతిగా ఇచ్చి ఇప్పుడు చెప్పమన్నాడు మంత్రి. ఆ నాణాల మీద రాజు శిరస్సు ముద్రించి ఉంది. వంద నాణాలపై వంద రాజు ముఖాలు. ఇంకేం. ఎలాంటి సమస్యా లేదు అనుకుంటూ జవాబు చెప్పాడు రైతు మంత్రికి. హుటాహుటిన మంత్రి రాజధానికి తిరిగొచ్చి రాజుకు సమస్యాపూరణం చేశాడు. ఆశ్చర్యపోయిన రాజు మంత్రిని అడిగాడు సమాధానం ఎవరు చెప్పారని. నిజం తెల్సుకున్న రాజు ఆగ్రహావేశాలతో గ్రామం నుంచి రైతును రప్పించి నిప్పులు చెరిగాడు. శాంతంగా విన్న రైతు రాజా తమరే సెలవిచ్చారు కదా. తమరి వంద ముఖాలు చూసే దాకా ఎవ్వరికీ జవాబు చెప్పొద్దని. మంత్రి ఇచ్చిన వంద నాణాల మీద తమరి ముఖార విందాన్ని వంద సార్లు చూసాకే సమస్యని పూరించానని ఎంతో వినయ విధేయతతో చెప్పాడు.

రైతు రుజువర్తనుడే కాదు నమ్మదగ్గ వ్యక్తి. ఇచ్చిన మాటకు విలువిస్తాడు అని ఆగ్రహించి సన్మానించాడు. మనందరం ఆ రైతు లాగా జీవితంలోని ముఖ్యాంశాలను గ్రహిస్తే అడ్డదోవలు తొక్కుతూ ఈ సమాజాన్ని అల్లకల్లోలం చేయాల్సిన అవసరం ఉండదు కదా! వృద్దాప్యంలో తల్లిదండ్రులను అమెరికాకు పిలిపించి వెట్టిచాకిరి చేయించుకునే ప్రబుద్ధులు ఎందరో! లేకుంటే చేతులు శుభ్రంగా డెటాల్‌తో కడుక్కొని తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి అంకితం చేయటం. ప్రేమతో గౌరవంగా తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో ఆదరించే వారు భూతద్దంలో వెతికితే గాని కనబడదు. ఎంత దురదృష్టం. మాతృదేవోభవా, పితృదేవోభవా అనే సంస్కృతికి నిలయమైన మన భారతంలో ఎన్ని అపశృతులు. ఇతరుల సహాయం కోసమే మానవ జన్మ అని మన శాస్త్రాలు, పురాణాలు, పెద్దలు ఘోషిస్తుండగా.. పట్టపగలే బందిపోటు దొంగల్లా దేశాన్ని, మనల్ని దోచేస్తూ, దేశ సంపదను స్విస్ బ్యాంకులకు తరలిస్తున్నారు మనకు అండదండగా నిలవాల్సిన పెద్దమనుషులు. ధనార్జనకు అడ్డదారులేకాదు. రాజమార్గాలు ఉన్నాయని నిరూపించే ప్రయత్నమే ఈ నిజ జీవిత గాధలన్ని. పదండి ముందుకు ఈ చిన్న ప్రపంచం మన గుప్పిట్లోకి ఎలా వచ్చిందో తెల్సుకుందాం.
http://suryaa.com/Main/gallery/2010/Sep/07/world.jpg
ప్రపంచం మీ గుప్పిట్లో....
రిలయన్స్ మొబైల్ ఫోన్ ప్రకటనలకు ఇది ట్యాగ్‌లైన్.. నేను రాసిందే 2003లో. నిజంగా ప్రపంచం మన గుప్పిట్లోనే ఉంది కదూ నేడు. మా పని అమ్మాయికి ఆవిడ పతి దేవుడైన సెక్యూరిటీ గార్డుకి, మావంటావిడకు, ఆవిడ కుటుంబ సభ్యులందరికీ, మన పోస్టుమ్యాన్‌కు, మన డ్రైవర్లకి, మా మానవరాలికి, మీకు ... నాకు... ఎవ్వరికీ ఇది లేందే జరగదు ఒక్క క్షణం కూడా. సర్వాంతర్యామి మొబైల్. చిన్నా పెద్దా, రాజు పేద, ఆడామగా... ఎలాంటి తేడాలు చూపకుండా అందరికీ అండదండ గా నిలుస్తూ ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తెచ్చింది ఈ మొబైల్ ఫోన్. చాలా వస్తు, సేవలు, విలాసాలు కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితమైన ఈ ప్రపంచంలో ఒక్క మొబైల్ ఫోన్ ఎలాంటి బేధాలు చూపకుండా అందరినీ అలరిస్తోంది. మన జీవితాల్లో అంతర్భాగమైపోయింది. ఒక్కోసారి మీకనిపించదూ ఈ మొబైల్ ఫోన్ లేకుండా ఇంతకాలం మనం ఎలా జీవిస్తూ వచ్చామా అని.

అరచేతిలో ఇమిడిపోయి ఎంతో సింపుల్‌గా ఇన్నోసెంట్‌గా కనబడే ఈ మొబైల్ ఫోన్ వెనక ఎన్నో సంవత్సరాల కృషి దాగి ఉంది. రెండు సంస్థలకు చెందిన ఇంజనీర్ల ద్వారా - మోటరోలా, ఎటి అండ్ టి - ఇది ఆవిష్కరించబడింది. ఈ రెండు సంస్థలు కమ్యూనికేషన్ రంగంలో ఉద్దండులే. మోటరోలా టూవే రేడియో టెక్నాలజీతో నిష్ణాతులు కాగా ఎటి అండ్ టి క్లిష్టమైన సెల్యులార్ టెక్నాలజీలో ప్రసిద్ధులు. ఈ రెండు సంస్థలు కలిసి చేసిన కృషికి ఫలితమే నేడు మన జేబుల్లో ఇమిడిపోయి మనతోనే ఎల్లవేళలా ఉండే మొబైల్ ఫోను. అసలు ఈ రెండు సంస్థలు మొదలుపెట్టింది కార్‌ఫోన్ రేంజిని పెంచుదామని. కార్ ఫోన్లు ల్యాండ్ ఫోన్లకు చెందిన రేడియో ఫ్రీక్వెన్సీకి ముడిపడి ఉన్నాయి. ఈ ప్రీక్వెన్సీ రేంజ్‌ని డ్రైవర్ ఎక్కడకు వెళితే అక్కడదాకా పొడిగించాలంటే మరో కొత్త కమ్యూనికేషన్ పద్ధతిని కనుగొనాల్సి ఉంది.

అప్పట్లో వాడుకలో ఉన్న టెక్నాలజీ వల్ల ఇది సాధ్యమయ్యే పనికాదు. కొత్త టెక్నాలజీ కనుగొనటానికి ఎన్నో సరికొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటగా ఒక కొత్త సెల్యులార్ సిస్టమ్‌ని కనుగొని దాని కోసమై ప్రభుత్వం క్లియరెన్స్‌లను పొందటం. రెండోది ఒక కొత్త ప్రొటోటైపు తయారు చేయటం. దీనికి సంబంధించిన నమూనాలు గాని, ఇతర సమాచారం గాని ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే పూర్తిగా ఇదొక వినూత్న ఆవిష్కారం. మోటరోలా ఇండస్ట్రియల్ డైరెక్టర్ రూడీ క్రాలాప్ ఈ పరిశోధనల గురించి వివరిస్తూ "మేం కనుగొంటున్న దాన్ని షూ ఫోన్'' అని పిలిచే వాళ్లం. ఎందుకంటే అది ఒక బూటులాగా రూపం సంతరించుకుంటోంది. చివరకు సెప్టెంబర్ 1, 1983న మోటరోలా సరికొత్త చరిత్రను సృష్టించింది. అమెరికాకు చెందిన యుఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్, డివైఎన్ఎ టిఎసి 800ఎక్స్ ఫోన్‌ను అంగీకరించింది. ఈ ఫోన్ ప్రపంచంలోని మొట్టమొదటి కమర్షియల్ మొబైల్ ఫోను. పదేళ్లు.. 10 కోట్ల డాలర్ల (450 కోట్ల రూపాయలు) పెట్టుబడికి ఫలితంగా ఉద్భవించిన మొబైల్ ఫోను ఇది.
http://www.travisfitzwater.com/wp-content/uploads/2010/02/dreambig.jpg
కార్ ఫోను రేంజ్‌ని పెంచుదామనుకొన్న చిన్న ప్రయత్నం ప్రపంచాన్ని, మనందరి గుప్పిట్లోకి తెచ్చింది. ఈ మొబైల్ ఫోను నేడు అందరికీ ఎలా కాసుల వర్షం కురిపిస్తోందో మనందరికీ తెలిసిందే. ఒక మంచి ఆలోచన, శ్రమ, దాని ఫలితం పది మందికి ఎలా ఉపయోగపడుతుందో, వారి జీవితాలను ప్రభావితం చేస్తుందో వివరించేదే ఈ మొబైల్ ఫోన్ కథ. అలాంటివే ఈ అధ్యాయం - పేరు ప్రతిష్టల ఫలితమే డబ్బు- లో మనం ముచ్చటించుకున్న ఇతర నిజ జీవిత కథలు కూడా. వాల్ట్ డిస్నీ యానిమేషన్ చరిత్ర, సింఫనీ కూలర్ విజయ గాధ, స్టార్ బక్స్ కాఫీ కప్పుతో ఘన విజయం, హాట్ మెయిల్ హాట్ హాట్ కీర్తి తద్వారా దక్కిన లక్ష్మీ కటాక్షం. యాపిల్ కంప్యూటర్ మెకింతోష్ ఆవిష్కరణ. అది సాధించిన అద్భుత విజయాలు. సోనీ వాక్‌మెన్ ఆవిష్కరణ. అది మన జీవిత సర ళిపై వేసిన చరగని ముద్ర. రెండు బ్రెడ్ ముక్కలు, మధ్య బర్గర్, ఒక చిన్న ఐడియాతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన మెక్‌డొనార్డ్స్. ఇసుక రేణువులో ప్రపంచ దర్శనం - మైక్రో చిప్ ద్వారా మానవజాతి జీవిత గమనాన్ని మార్చివేసిన కథాకమామిషు. చివరిగా ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తెచ్చిన మొబైల్ ఫోన్ అద్భుత ఆవిష్కరణ. ఇవన్నీ ఇలాంటివి మరెన్నో... చిన్నా పెద్దా నిజ జీవిత గాధ లు.http://us.123rf.com/400wm/400/400/kjpargeter/kjpargeter0607/kjpargeter060700180/478803-the-world-in-your-hands--3d-render.jpg
వేలల్లో, లక్షల్లో .. మనకు చెప్పేది ఒక్కటే:
ప్రతిభకు ఫలితం పేరు ప్రతిష్టలు. వాటి ఫలితం డబ్బు. ధనార్జనకు రాచబాట ఇదే. మోసాలు, అన్యాయాలు, అరాచకాలు కాదు. అవి తెచ్చే సంపద కేవలం తాత్కాలికం. మోసపోయిన వారి తిట్లు, శాపనార్ధాలు, మనకు దీవెనలు కాదు కదా! ఆలోచించాల్సిన విషయం ఇది. సువిశాలమైన ఈ ప్రపంచంలో అందరికీ ఉన్నాయి అవకాశాలు. అవి అందిపుచ్చుకొని హాయిగా ఆనందంగా ఉండటమే మన కర్తవ్యం. 
http://drjeffadams.com/wp-content/uploads/2008/07/dream-big.jpg
కలలను, గమ్యాలను విడనాడొద్దు! కలతో, కృషితో నాస్తి దుర్భిక్షమ్!
- ఎజి కృష్ణమూర్తి